/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz హరీష్ రావు‌ను కలిసిన రాజాసింగ్.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ! Yadagiri Goud
హరీష్ రావు‌ను కలిసిన రాజాసింగ్.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ!

తెలంగాణలో రాజకీయాలు రసవతరంగా మారాయి. ఈ తరుణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మంత్రి హరీష్ రావుతో భేటి అయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ ఏది చేసినా ఓ సంచలనమే. గత కొంతకాలంగా రాజాసింగ్ సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడప్పుడు తనదైన శైలితో చేస్తున్న కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయ్. ఈ తరుణంలోనే బిజెపి నేతలు కొంతమంది ఇతర పార్టీలోకి చేరుతున్నారని ప్రచారం ఉపందుకుంది. ఆ పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా తరుణంలోనే మంత్రి హరీష్ రావును బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరుతారా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా... అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ మీటింగ్‌గా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ మంత్రి హరీష్ రావుతో భేటి కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం లేనిది ఎన్నికల ముందు ఒక్కసారిగా కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడుతున్నారని ప్రచారం ఊపు అందుకున్న తరుణంలో రాజాసింగ్ బీఆర్ఎస్ మంత్రితో భేటీ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది......

సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము నీకుందా రేవంత్ ❓️: గుత్తా సూటి ప్రశ్న

నల్గొండ జిల్లా :జులై 14

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవుపలికారు. శుక్రవారం గుత్తా మీడియాతో మాట్లాడుతూ.. బషీర్‌బాగ్ కాల్పులకు కారణం కేసీఆర్ అనడం అవగాహన లేకనే అని అన్నారు.

తొమ్మిదేళ్లలో ఎకరం పంట ఎక్కడైనా ఎండిందా, సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలు జరిగాయా... అని ప్రశ్నించారు. కరెంటు నిరంతరాయంగా వస్తున్నందునే అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదన్నారు. కరెంటు కొనుగోళ్లు జరిగేది ఎన్ఎల్‌డీసీ నుంచే అని అవినీతి జరిగిందనడం అవివేకమే అని అన్నారు. రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదన్నారు.

ఆవారా నంబర్ 1, స్థిమితం లేని వెంకట్ రెడ్డి వ్యవసాయం పేరుతో బావుల దగ్గరికి పోయేది సురా పానకం కోసమే అంటూ వ్యాఖ్యలు చేశారు. 82 ఏళ్ల ఖర్గే ఏఐసీసీగా ఉండొచ్చు కానీ రిటైర్డ్ అయినా సమర్థత ఉన్న అధికారులు ఉద్యోగంలో కొనసాగకూడదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటూ గుత్తాసుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు...

Konaseema: భర్తను చెంబుతో కొట్టి చంపిన భార్య..

అయినవిల్లి: భర్త రోజూ తాగి వచ్చి చిత్రహింసలు పెడుతుండటంతో విసిగిపోయిన భార్య చెంబుతో కొట్టి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

ఇసుకపట్ల రామకృష్ణ (34) రోజూ మద్యం సేవించి భార్య సత్యనారాయణమ్మతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ.. చెంబుతో భర్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Chandrababu: 'కియా' మిలియన్‌ కార్ల ఉత్పత్తిపై చంద్రబాబు హర్షం..

అమరావతి: అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు..

ఈ మేరకు కియా యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్‌లో కియా పెట్టుబడులు ఓ బలమైన సంకల్పమన్న చంద్రబాబు.. ఈ సమర్థ విధానం ఆ ప్రాంత రూపురేఖల్ని మార్చి సంపద సృష్టి, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దిందని చెప్పారు.

ప్రపంచ వేదికపై ఇది ఓ ప్రత్యేకతను చాటుకుందన్నారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం కలిగినందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు. వేలాది మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి పొందుతున్నారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు..

Japan: జపాన్‌ అంతరిక్ష కార్యక్రమానికి ఎదురు దెబ్బ

జపాన్‌(Japan) అంతరిక్షకార్యక్రమానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ దేశం అభివృద్ధి చేస్తున్న రాకెట్‌ ఇంజిన్‌ పరీక్షల సమయంలో పేలిపోయింది..

ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని ఆ దేశ స్పేస్‌ ఏజెన్సీ వెల్లడించింది. గతంలో ఉపయోగించిన ఎప్సిలాన్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసి ది ఎప్సిలాన్‌-ఎస్‌( Epsilon S) పేరిట సిద్ధం చేసింది. తాజాగా అదే ప్రమాదానికి గురైంది.

గత అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్‌ను ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. తాజా మార్పులతో పరీక్షించగా.. ప్రయోగం మొదలైన 50 సెకన్లలో విఫలమైంది. ఈ పరీక్షా కేంద్రం ఉత్తర అకితా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భారీ ఎత్తున మంటలు, పొగలతో నిండిపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలను జాతీయ మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టంపై సమాచారం అందలేదని జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ (జేఏఎక్స్‌ఏ) అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టామన్నారు.

Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఫ్రాన్స్‌ అత్యున్నత అవార్డుతో సత్కారం..

పారిస్‌: ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆతిథ్య దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌.. మోదీని 'గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ ఆన్‌ర్‌' పురస్కారంతో సత్కరించారు..

ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర, సైనిక పురస్కారాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.

గురువారం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మేక్రాన్‌.. మోదీకి ఈ పురస్కారం అందజేశారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా, బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌, జర్మనీ మాజీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్‌ బుట్రోస్‌ బుట్రోస్‌ ఘలి వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు వారి సరసన మోదీ చేరారు..

వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం

వరంగల్ జిల్లా :జులై 14

జిల్లాలోని రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం రైల్వేస్టేషన్‌లోని ఓ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫామ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రయాణికులు ఉన్న సమయంలో ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌‌ వద్ద రేకుల షెడ్డుపై ఉన్న వాటర్ ట్యాంక్ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడి ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వాటర్ ట్యాంక్ పడిపోడానికి గల కారణాలపై రైల్వే సిబ్బంది ఆరా తీస్తున్నారు...

తిరుపతి నూతన బస్టాండుకు ఈ నెలలోనే టెండర్లు*

తిరుపతి :జూలై 14

తిరుపతిలో రూ.400 కోట్లతో 13 ఎకరాల్లో ఇంటర్‌ మోడల్‌ సెంట్రల్‌ బస్టేషన్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ సిద్ధం చేశామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీనికి గతేడాది ఆర్టీసీతో ఎంవోయూ జరిగిందని ఈ నెలలోనే టెండరు దశ పూర్తవుతుందన్నారు.

కృష్ణ పట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారుల నిర్మాణానికి డిజిటల్‌ విధానంలో గురువారం ఉదయం తిరుపతి తారకరామా స్టేడియంలో శంకుస్థాపన చేశాక జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రేణిగుంట - నా యుడుపేట మధ్య రూ.2300కోట్లతో జరుగుతున్న 6లేన్ల జాతీయ రహదారి పనులు వచ్చే ఏడాది జనవరికల్లా పూర్తవుతాయన్నారు.

ఏపీలో 7 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణాలు చేపట్టగా బెంగుళూరు- చెన్నై, కోలారు జిల్లా బేతమంగళం-చిత్తూరు జిల్లా గుడిపాల, చిత్తూరు-చెన్నయ్‌ సమీపంలోని తచ్చూరు మార్గాలు వీటిలో ప్రధానమైనవన్నారు. ప్రస్తుతం బెంగళూరు- చెన్నై ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటలుందని హైవే పూర్తయితే రెండున్నర గంటల్లో వెళ్లిపోవచ్చన్నారు. వివిధ దశల్లోని ఎన్‌హెచ్‌ పనుల ఫొటో ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు...

పాత బస్తీలో 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్:జులై 14

పాత బస్తీలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెయిన్ బజారులోని పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గంజాయి బ్యాచ్ అడ్డాలపై దాడులు నిర్వహించారు. మొత్తం 15 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.

పాతబస్తీలో గంజాయి బ్యాచ్‌ ఆగడాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. గంజాయి మత్తులో రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. అర్థరాత్రి స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల పాత బస్తీలో అక్బర్‌ అండ్‌ గ్యాంగ్‌ రెచ్చిపోయింది. ఇంటి ముందు స్నేహితుడితో మాట్లాడుతున్న పర్వేజ్‌ అనే యువకుడితో అకారణంగా గొడవకు దిగింది. వెంట తెచ్చుకున్న కత్తితో పర్వేజ్‌పై దాడి చేసి పరైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్వేజ్ సోమవారం రాత్రి మృతి చెందాడు.

దీంతో పర్వేజ్‌ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పాషాఖాద్రి పరామర్శించారు. రూ. 2లక్షలు తీసుకుని హత్యలకు పాల్పడే నేరస్తులు పోలీసులతో కుమ్మక్కయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గంజాయి ముఠాను అరెస్ట్‌ చేసే దమ్ము, ధైర్యం పోలీసులకు లేదని కామెంట్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. పోలీసులే గంజాయి గ్యాంగ్‌లను ప్రోత్సహిస్తున్నారని, డబ్బులు తీసుకుని గంజాయి బ్యాచ్‌ను వదిలేస్తున్నారని ఎమ్మెల్యే పాషాఖాద్రి ఆరోపించారు.

పాతబస్తీలో రౌడీ షీటర్లు.. రూ.2లక్షలు తీసుకుని హత్యలకు పాల్పడుతున్నారని, పోలీసులతో నేరస్తులు మిలాఖాత్‌ అవుతున్నారని ఎమ్మెల్యే పాషాఖాద్రి ఆరోపించారు. హత్య చేసిన తర్వాత లొంగిపోయి, 15-20 రోజుల్లో బెయిల్‌ తెచ్చుకుంటున్నారని చెప్పారు. అంతేకాదు.. గంజాయి బ్యాచ్‌లపై ఫిర్యాదులు చేస్తే పోలీసులు వచ్చి అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గంజాయిగాళ్లపై పీడీయాక్ట్‌ పెట్టాలని ఎమ్మెల్యే పాషాఖాద్రి డిమాండ్‌ చేశారు.

ఆరోజు మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్:జులై 14

బోనాల పండుగ సందర్భంగా ఆదివారం 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సౌత్‌ ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్లు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజిగిరి జోన్‌ మల్కాజిగిరి,

కుషాయిగూడ డివిజన్లు, ఎల్బీనగర్‌ జోన్‌ వనస్థలిపురం డివిజన్‌, మహేశ్వరం జోన్‌ మహేశ్వరం డివిజన్‌ పరిధిలో ఒక రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయా కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లోని సౌత్‌జోన్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ డివిజన్‌ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనూ ఆంక్షలు ఆదివారం అమల్లో ఉండనున్నాయి.