/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పాత బస్తీలో 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు Yadagiri Goud
పాత బస్తీలో 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్:జులై 14

పాత బస్తీలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెయిన్ బజారులోని పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గంజాయి బ్యాచ్ అడ్డాలపై దాడులు నిర్వహించారు. మొత్తం 15 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.

పాతబస్తీలో గంజాయి బ్యాచ్‌ ఆగడాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. గంజాయి మత్తులో రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. అర్థరాత్రి స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల పాత బస్తీలో అక్బర్‌ అండ్‌ గ్యాంగ్‌ రెచ్చిపోయింది. ఇంటి ముందు స్నేహితుడితో మాట్లాడుతున్న పర్వేజ్‌ అనే యువకుడితో అకారణంగా గొడవకు దిగింది. వెంట తెచ్చుకున్న కత్తితో పర్వేజ్‌పై దాడి చేసి పరైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్వేజ్ సోమవారం రాత్రి మృతి చెందాడు.

దీంతో పర్వేజ్‌ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పాషాఖాద్రి పరామర్శించారు. రూ. 2లక్షలు తీసుకుని హత్యలకు పాల్పడే నేరస్తులు పోలీసులతో కుమ్మక్కయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గంజాయి ముఠాను అరెస్ట్‌ చేసే దమ్ము, ధైర్యం పోలీసులకు లేదని కామెంట్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. పోలీసులే గంజాయి గ్యాంగ్‌లను ప్రోత్సహిస్తున్నారని, డబ్బులు తీసుకుని గంజాయి బ్యాచ్‌ను వదిలేస్తున్నారని ఎమ్మెల్యే పాషాఖాద్రి ఆరోపించారు.

పాతబస్తీలో రౌడీ షీటర్లు.. రూ.2లక్షలు తీసుకుని హత్యలకు పాల్పడుతున్నారని, పోలీసులతో నేరస్తులు మిలాఖాత్‌ అవుతున్నారని ఎమ్మెల్యే పాషాఖాద్రి ఆరోపించారు. హత్య చేసిన తర్వాత లొంగిపోయి, 15-20 రోజుల్లో బెయిల్‌ తెచ్చుకుంటున్నారని చెప్పారు. అంతేకాదు.. గంజాయి బ్యాచ్‌లపై ఫిర్యాదులు చేస్తే పోలీసులు వచ్చి అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గంజాయిగాళ్లపై పీడీయాక్ట్‌ పెట్టాలని ఎమ్మెల్యే పాషాఖాద్రి డిమాండ్‌ చేశారు.

ఆరోజు మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్:జులై 14

బోనాల పండుగ సందర్భంగా ఆదివారం 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సౌత్‌ ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్లు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మల్కాజిగిరి జోన్‌ మల్కాజిగిరి,

కుషాయిగూడ డివిజన్లు, ఎల్బీనగర్‌ జోన్‌ వనస్థలిపురం డివిజన్‌, మహేశ్వరం జోన్‌ మహేశ్వరం డివిజన్‌ పరిధిలో ఒక రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయా కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లోని సౌత్‌జోన్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ డివిజన్‌ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనూ ఆంక్షలు ఆదివారం అమల్లో ఉండనున్నాయి.

అందరి చూపు.. చందమామ వైపు

శ్రీహరికోట :జులై 14

అలనాటి రామచంద్రుడి నుంచి నేటి ఆధునిక రోబో వరకు.. అందాల చందమామ ఎప్పుడూ మానవాళికి ఆకర్షణీయమైన అద్భుతం. దీనిని చేరుకోవాలని అందరూ కోరుకుంటారు. దీనికోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కొన్ని విజయవంతం అయ్యాయి. 2008 అక్టోబర్ 22న మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ -1‌ను ప్రయోగించింది. 2019, ఆగస్టు 14న చంద్రయాన్ – 2ను ప్రయోగించి, ఆగస్టు 20, 2019 న చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు కానీ చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. ఎత్తులో ఉండగా, ల్యాండరుకు భూమితో సంబంధం తెగిపోయింది. అయితే, ఈ యాత్ర 90 నుండి 95% వరకూ విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.

తక్కువ ఖర్చుతో కూడుకున్న మిషన్లకు పేరుపొందిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ -3తో మరోసారి చంద్రుడిపైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇస్రో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ నీటి మొత్తాన్ని ఆవిరి రూపంలో ఉన్న ట్రేస్ గుర్తించి చంద్రయాన్ -1తో అపారమైన విజయాన్ని సాధించింది. అందుకే మరోసారి చంద్రయాన్ -3తో చంద్రుని ఉపరితలంపై మరింత అధ్యయనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బిలియన్ సంవత్సరాలలో సూర్యరశ్మిని చూడని చంద్రుని చీకటి వైపు దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో మంచు, విస్తారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని పరిశోధకులు నమ్ముతారు. చంద్రుడి నిగూఢ రహస్యాలు ఛేదించడానికి ఇస్రో చేపట్టిన మూడో ప్రయోగం ఇది.

చంద్రయాన్ - 3 ఎందుకు?

ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ..అగ్రదేశాల జాబితాల్లో చేరిపోయింది భారత్. సాంకేతిక పరంగా పరంగా ఎన్నో వినూత్న ప్రయోగాలకు చిరునామా ఇస్రో చిరునామాగా నిలుస్తుంది. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో భారత్ చేస్తున్న ప్రయోగాలకు అన్ని దేశాలు ఫిదా అవుతున్నాయి. ఇప్పుడు అంతరిక్ష రంగంలో ఇస్రో మరో ఘనతను సాధించనుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక ఘట్టాన్ని చేరుకోనుంది. చంద్రయాన్-3 ద్వారా చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా, పర్యావరణం, ధర్మో ఫిజికల్ లక్షణాలు, భూకంప అవకాశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన సైంటిఫిక్ పరికరాల్ని పంపనున్నారు. దీనికోసం ఇస్రో అన్ని ప్రయత్నాలు చేసి, నేడు ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించబోతుంది. ఇది 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇది ఆగస్టు 23వ తేదీ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది. దీనికోసం జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ మార్క్-3ని వినియోగించనుంది.

చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చంద్రయాన్-2 కంటే తక్కువ ఖర్చుతో ప్రయోగిస్తుంది. దీనికి కారణం చంద్రయాన్-2లో పంపిన ఆర్బిటర్ ఇప్పిటికి విజయవంతంగా కక్ష్యలో తిరుగుతూ.. చంద్రుడి ఉపరితలాన్ని చాలా వరకూ స్కాన్ చేసి విలువైన సమాచారాన్ని భూమికి పంపించింది. ఈ ఆర్బిటర్ జీవితకాలం ఏడున్నరేళ్లు అని ఇస్రో నిర్ధారించింది. ఆ ఆర్బిటర్ ఇప్పటికి విజయవంతంగా సేవలు అందించడంతో చంద్రయాన్-3 ప్రయోగంలో ఆర్బిటర్ పంపించడం లేదు. చంద్రయాన్-2లో పంపించిన ఆర్బిటర్‌నే దీనికి ఉపయోగించుకోనున్నారు..

తెలుగు రాష్ట్రాలకు వరద ముప్పు?

•తెలంగాణలో పరిస్థితి మరింత దారుణం

•దేశంలో 72% జిల్లాలు వరద ముంగిట్లో

•సీఈఈడబ్ల్యూ తాజా

నివేదిక

తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వరద ముప్పు పొంచి ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లో ముందస్తు హెచరిక వ్యవస్థల ఈడబ్ల్యూఎ్‌స లు మాత్రం అరకొరగానే ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) గురువారం ఒక నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం... దేశంలోని 12 రాష్ట్రాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, జార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, గోవా, బిహార్‌ ఉన్నాయి. వీటిలో అసోం, యూపీ, బిహార్‌లలో మాత్రమే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్‌ లభ్యత అత్యల్పంగా ఉంది. భారీ వరదలతో సతమతమవుతున్న హిమాచల్‌ప్రదేశ్‌నూ ఇదే పరిస్థితి. వరద ముప్పు అంత తీవ్రంగా లేని ఉత్తరాఖండ్‌లో ఈ వ్యవస్థల లభ్యత అత్యధికంగా ఉండగా, యమునా నది ఉధృతి కారణంగా వరదలు ముంచెత్తుతున్న ఢిల్లీ ఈ విషయంలో మధ్యస్థంగా ఉంది.

ముందస్తు సమాచారం కొందరికే

దేశవ్యాప్తంగా 72శాతం జిల్లాలు తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని సీఈఈడబ్ల్యూ నివేదిక పేర్కొంది. అందులో 25శాతం జిల్లాలు మాత్రమే వరద అంచనా కేంద్రాలు/ ముందస్తు హెచరిక వ్యవస్థలను కలిగి ఉన్నాయని తెలిపింది. అంటే దేశంలో మూడింట రెండొంతుల మంది ప్రజలు తీవ్ర వరదలతో ప్రభావితం అవుతుండగా, ఒక వంతు మందికి మాత్రమే ముందస్తు సమాచారం అందించే అవకాశం ఉంటోంది. మరోవైపు దేశ జానాభాలో 25శాతం మంది తుఫాన్లు, తదనంతర పరిణామాలతో ప్రభావితమవుతుండగా వారిలో నూరు శాతం మందికీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని నివేదిక వివరించింది. కాగా, ఈడబ్ల్యూఎ్‌సలను విస్తృతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని దేశంలో ఇటీవల సంభవించిన వరదలు మరోసారి స్పష్టం చేశాయని సీఈఈడబ్ల్యూ సీనియర్‌ ప్రోగ్రాం లీడ్‌ డాక్టర్‌ విశ్వాస్‌ చితాలే అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్రాలు వీటి ఏర్పాటును వేగవంతం చేయాలని ఆయన సూచించారు...

తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ

తిరుమల: జులై 14

తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. వీకెండ్ కావడంతో క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు శిలాతోరణం వరకూ వ్యాపించాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం స్వామివారిని 67,300 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చె్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.83 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 32,802 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

చెన్నై- బెంగుళూరు డబుల్ డక్కర్ ఎక్స్ ప్రెస్ లో పొగలు

కుప్పం : జులై 13

చెన్నై నుండి బెంగళూరు వెళ్లే డబుల్ డక్కర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఉన్నట్టుండి ఎస్ 6 బోగిలో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.

చెన్నయ్ నుండి బెంగళూరు వెళ్లే డబుల్ డక్కర్ ఎక్స్ ప్రెస్ రైలు వయా కుప్పం గుండా నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి.గురువారం సాయంత్రం కుప్పం సమీపంలో ఉన్న తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం దగ్గర రైలు నడుస్తుండగానే ఎస్ 6 బోగి లో పొగలు రావడం గుర్తించారు.

సమీపంలో ఉన్న జోలార్ పేట రైల్వే జంక్షన్ వద్ద అధికారులు వచ్చి తనిఖీ చేసిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని నిర్దారించుకుంటున్న తరువాత రైలు బయలుదేరింది. ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ఆపద, ఇబ్బంది లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.....

కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది : మా సవాల్ ను కేటీఆర్ స్వీకరిస్తాడా ❓️

బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ బంధమని మండిపడ్డారు.

నేను, కోమటిరెడ్డి, షబ్బీర్ అలీ వస్తాం. ఏ సబ్ స్టేషన్ దగ్గరుకు రమ్మంటారు?. మా సవాల్‌ను కేటీఆర్ స్వీకరిస్తారా? హరీష్ స్వీకరిస్తారా?. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైంది. ధర్మపురి అర్వివింద్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. ధర్మపురి అరవింద్‌ను కూడా సీరియస్‌గా తీసుకుంటారా?. 24 గంటల ఉచిత కరెంట్ మా పేటెంట్. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒకటో తారీఖున జీతం ఇస్తాం. ప్రభుత్వం మూడు పంటలు ఇవ్వలేదు. మూడు గింజలు కొనలేదు. నీచుడు అనే పదానికి నిలువుటద్దం కేసీఆర్. విద్యుత్ అంశంపై 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారో లేదో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఎందుకు మాట్లాడడం లేదు?. సన్నాసి పాల్పడుతున్న దోపిడీ ఆపితే మేం అనుకున్న అన్ని పాలసీలు అమలు చేయొచ్చు. రైతు డిక్లరేషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తాం." అని రేవంత్ రెడ్డి అన్నారు...

Srinivas goud: ఏపీ రాజధాని ఏదంటే.. సమాధానం చెప్పలేని పరిస్థితి: శ్రీనివాస్‌గౌడ్‌

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చూసి రాసి పరీక్షలు పాస్‌ అయ్యారు కాబట్టే .. అలా అంటున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు..

తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతో, అక్కసుతో బొత్స మాట్లాడతున్నారని ఆక్షేపించారు. తాము తెలంగాణలోనే చదువుకుంటామని ఏపీ విద్యార్థి కోర్టుకు కూడా వెళ్లారని మంత్రి గుర్తు చేశారు. ఏపీ రాజధాని ఏది అని పరీక్షల్లో అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేదని వ్యాఖ్యానించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. ఎందుకు అలా విషం కక్కుతున్నారని ప్రశ్నించారు. వారి హయాంలో ఏపీపీఎస్సీలో స్కాములు జరిగేవని, ఇప్పుడు కూడా అలానే అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. బదిలీల కోసం వారి హయాంలో సూట్‌ కేసులు పట్టుకొని లాడ్జిల్లో ఉండేవారని గుర్తు చేశారు. వారి హయాంలో కోళ్ల ఫారాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉంటే నాణ్యత లేదని తీసివేసినట్టు మంత్రి చెప్పారు..

మా దగ్గర వోక్స్‌ వ్యాగన్‌ స్కాములు ఉన్నాయా? అని ప్రశ్నించిన శ్రీనివాస్‌గౌడ్‌.. ఏపీలో ఆలయాల వద్ద కూడా వివక్ష ఉందన్నారు. ఏపీలో అంతా కులపిచ్చి.. అభివృద్ధి లేదన్నారు. అన్ని విషయాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని బొత్సకు సవాల్‌ విసిరారు. బొత్స పిల్లలు కూడా ఇక్కడే చదివి ఉంటారని వ్యాఖ్యానించారు. బాధ, ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడారా? లేక రాజకీయంగా ఉపయోగపడుతుందని మాట్లాడారా? అని ప్రశ్నించారు..

టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో వెంటాడి దోషులను అరెస్టు చేస్తున్నామని, పారదర్శకంగా ఉండాలన్న ప్రభుత్వ చర్యలు హర్షించాలన్నారు. తెలంగాణను కించపర్చేలా మాట్లాడితే సహించబోమన్నారు. ఏపీ అభివృధ్ధిపై దృష్టి సారించాలని, మనుషులు కలిసి మెలిసి ఉండేలా చూడాలని బొత్సకు సూచించారు. ఏపీలోనూ భారాసను విస్తరిస్తామని, అధికారం ఇస్తే తెలంగాణ తరహాలో ఏపీని కూడా అభివృద్ధి చేస్తామన్నారు..

Pawan Kalyan: పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు.. సచివాలయ వ్యవస్థ దేనికి?: పవన్‌

తాడేపల్లిగూడెం: అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదని.. పేదల బతుకులు మార్చాలనే వచ్చానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తెలిపారు..

తాడేపల్లిగూడెంలో జనసేన నాయకులు, వీర మహిళలతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకే పోరాడుతున్నట్లు చెప్పారు..

''రాజకీయాల్లో ప్రలోభాలను దాటుకొని ముందుకు వెళ్తున్నాం. రాజకీయాల్లో ఎదురుదాడి అలవాటు చేసుకోవాలి. మనం ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదు. అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. పేదల బతుకులు మార్చాలని వచ్చా. నేను, నా కుటుంబం ఎందుకు విమర్శలు ఎదుర్కోవాలి? సమాజంపై ప్రేమతో నా ప్రాణం, కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చా. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు.. సచివాలయ వ్యవస్థ దేనికి? రాష్ట్రంలో అవినీతి నిత్యకృత్యమైపోయింది. నా అభిమాని అయినా సరే.. మాన, ప్రాణాలకు భంగం కలిగిస్తే శిక్షించాలి'' అని పవన్‌ అన్నారు..

PM Modi: 9 ఏళ్లలో 64దేశాలు.. 100కుపైగా పర్యటనలు.. ఆరు దేశాల్లో తొలి భారత ప్రధానిగా అడుగు..!

2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ (Narendra Modi).. ఇటీవలే 9ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో అనేక దేశాల్లో (Modi Foreign tour) సుడిగాలి పర్యటనలు చేసి..

ద్వైపాక్షిక చర్చలు, పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో గతంలో ఏ భారత ప్రధాని అడుగుపెట్టని దేశాల్లోనూ మోదీ పర్యటించి రికార్డు సృష్టించారు.

ఇలా తొమ్మిదేళ్ల కాలంలో 71 విదేశీ పర్యటనలు చేసిన ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా 64 దేశాల్లో 100సార్లకు పైగా అధికారికంగా పర్యటించారు. తాజాగా ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు..