/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz సాయి చంద్ భార్యకు పదవి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం Yadagiri Goud
సాయి చంద్ భార్యకు పదవి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు కుసుమ జగదీష్, సాయి చందు అకాల మరణం చెందడం సీఎం కేసీఆర్‌ను ఎంతగానో కలిచివేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం తెలిపారు.

ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామన్నారు. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని వెల్లడించారు. సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని సీఎం నిర్ణయించారని అన్నారు. ఇరు కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయం ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందన్నారు. కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు....

ఖమ్మం జిల్లాలో యువకుడి దారుణ హత్య

ఖమ్మం జిల్లా :జూలై 07

జిల్లాలో ఓ యువకుడు శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్‌లో యువకుడిని కొందరు యువకులు హత్య చేశారు.

మృతుడు సాయి పవన్‌(23)గా గుర్తించారు. మరొక యువకుడు సాయి తీవ్రంగా గాయపడ్డారు. గంజాయి మత్తులో ఘర్షణ చోటు చేసుకుందని.. కత్తులతో యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయపడిన సాయిని చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

మృతుడు చికెన్‌ షాపులో పనిచేస్తున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. హాజరైన మంత్రి కేటీఆర్‌

విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయింది. హైదరాబాద్‌ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న

ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్ హరీశ్‌ రావు, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యాశాఖలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. టెట్‌ నిర్వహణ, టీచర్ల నియామక ప్రక్రియ, మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి, రెండో విడుత అమలు వంటి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది...

అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే ఆశ వర్కర్లకు ఎక్కువ జీతాలు : మంత్రి హరీశ్‌ రావు

దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్‌ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. హైదరాబాద్‌ లో శుక్రవారం శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 15 వేల మంది ఆశావర్కర్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి మంత్రి హరీశ్‌ రావు నియామక పత్రాలు అందేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒకప్పుడు ఏ రోగం వచ్చినా గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లేవాళ్లమని.. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. దీంతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఓపీ శాతం తగ్గిందని చెప్పారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మూడు ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్‌ చెప్పారు. కేసీఆర్‌ కిట్‌తో మాతా శిశు మరణాలను తగ్గించామని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా టీ-డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణకు అసలైన డాక్టర్‌ హరీశ్‌ రావు: మంత్రి తలసాని

ఆశావర్కర్ల సేవలు మరచిపోలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణలోని ఆరోగ్య సేవలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రజలు ప్రభుత్వ దవాఖానలవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కరోనా సమయంలో ఆశావర్కర్ల సేవలు విశేషమైనవని తెలిపారు. తెలంగాణకు అసలైన డాక్టర్‌.. మంత్రి హరీశ్‌ రావు అని వెల్లడించారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లకు రూ.9,750 వేతనం ఇస్తున్నామన్నారు....

ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 5 బోగీలు పూర్తిగా దగ్ధం

భువనగిరి జిల్లా:జులై 07

యాదాద్రి జిల్లాలో శుక్రవారం ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా బోగీలో మంటలు చెలరేగాయి. మొత్తం 6 బోగీలకు వ్యాపించిన మంటలు.. పక్కనే ఉన్న బోగీలకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి కిందకు దూకారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో బోగీలు దగ్ధం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. లోకో పైలట్ గమనించి రైలును ఆపాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా రైలును అక్కడికక్కడే ఆపాల్సి వచ్చింది. ఈ రైలులో దాదాపు 1500 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 80 నుండి 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. భువనగిరి సమీపంలో రైలు వేగాన్ని తగ్గించడంతో మంటలను గుర్తించారు. ఈ రైలులోని ఎస్3, ఎస్4, ఎస్5, ఎస్6 కోచ్‌లు దగ్ధమైనట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ హరా నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో గంటలో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకుంటారనగా ప్రమాదం జరిగింది. మంటలు ఇతర బోగీలకు వ్యాపించే చోట బోగీల మధ్య ఉన్న లింక్‌ను తొలగించారు. దీంతో ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లే మంటలు చెలరేగాయని ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు.

నేడు టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

ఈ రోజు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జూన్‌ 14 నుంచి 22 వరకూ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 60 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు కూడా రెండుమూడు రోజుల్లో విడుదల కానున్నాయి. జూన్‌ 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగ్గా, 4,12,325 మంది విద్యార్థులు హాజరయ్యారు....

సర్వీస్ రివాల్వర్ కాల్చుకున్న కోయంబత్తూర్ డిఐజి

తమిళనాడు:జులై 07

కోయంబత్తూరు డీఐజీ విజయ్ కుమార్ (45) ఈరోజు తెల్లవారుజామున క్యాంపు కార్యాలయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన విజయకుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. మొదటగా నెల్లై జిల్లా వల్లియూర్‌లో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు.

దీని తర్వాత కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. సీబీసీఐడీలో ఎస్పీగా కూడా పనిచేసిన విజయకుమార్ సాతంకుళం జంట హత్య కేసును తొలిసారిగా దర్యాప్తు చేశారు. కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, నీలగిరి నాలుగు జిల్లాల పర్యవేక్షణ అధికారిగా పని చేశారు. గత జనవరిలో విజయకుమార్ కోయంబత్తూరు డీఐజీగా బాధ్యతలు చేపట్టారు.

గత రెండు రోజులుగా విజయకుమార్ కుటుంబ కారణాలవలన మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆయన కొంత కాలంగా నిద్ర సరిగా ఉండటం లేదని తోటి అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి డిప్రెషన్‌తోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. నిన్న రాత్రి కోయంబత్తూరు డిప్యూటీ కమిషనర్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు సైతం హాజరైన విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. కాగా.. విజయకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాంథియా రోడ్డు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై కూడా విచారణ జరుపుతున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.. విజయ్ కుమార్ మృతి విషయం తెలుసుకుని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు స్టాలిన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు...

మంత్రి మల్లారెడ్డా? : మజాకా ❓️

నెత్తిన గొంగడి, చేతిలో కర్రతో గొర్రెల వెంట వెళుతున్న ఈ వ్యక్తిని గుర్తు పట్టారా? అవును.. మంత్రి మల్లారెడ్డే. మేడ్చల్‌ మండలంలోని గౌడవెల్లి గ్రామం లో గురువారం సాయంత్రం

పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 18 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయ గా, లబ్ధిదారులకు అందించిన గొర్రెలు గుంపుగా కనిపించడంతో

సంతోషం పట్టలేని మంత్రి యాదవుల వద్ద ఉన్న గొంగడి వేసుకుని, కట్టె చేత పట్టుకుని కాసేపు గొర్రెల మంద వెంట తిరిగారు. ఆశ్చర్యానికి గురైన నాయకులు, యాదవులు సరదాగా కాసేపు నవ్వుకుని మంత్రిని అనుసరించారు.......

హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న రాజధాని బస్సులో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌ శివార్లలోని పెద్దంబర్‌పేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న బీహెచ్‌ఈఎల్‌ డిపోకు చెందిన రాజధాని బస్సులో పెద్దంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అయితే మంటలను గమనించిన డ్రైవర్‌.. వెంటనే బస్సును ఆపి, అందులోనుంచి ప్రయాణికులను దించివేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

అయితే మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏసీలో మంటలు చెలరేగడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు...

నేడు షిరిడీ సాయిని ద‌ర్శించుకోనున్న భార‌త రాష్ట్ర‌ప‌తి

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము శుక్ర‌వారం షిరిడీ సాయినాథుడిని ద‌ర్శించుకుకోనున్నారు. ప్రత్యేక విమానంలో షిరిడీ రానుండ‌డంతో అధికారులు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. రాష్ట్రపతి ముర్ము సుమారు మూడు గంటల పాటు షిర్డీలో ఉంటార‌ని, మధ్యాహ్నహారతికి హాజరవుతార‌ని సంస్థాన్ సీఈవో పి. శివ‌శంక‌ర్ తెలిపారు.

సాయి సమాధి వద్ద రాష్ట్ర‌ప‌తి పూజ చేస్తార‌ని, ఆ తర్వాత సాయిబాబా రాకను గుర్తుచేసే గురుస్థాన్ ఆలయాన్ని, నిమ్మాక్ చెట్టును సందర్శించే అవ‌కాశం ఉంద‌న్నారు. బాబా నివసించిన సర్వమత సమానత్వానికి ప్రతీక అయిన ద్వారకామాయిలో కూడా ముర్ము సంద‌ర్శించ‌నున్నారు.

కాగా, సాయి సంస్థాన్ సీఈవో పి. శివశంకర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది టూర్‌ ప్లాన్‌లో బిజీగా ఉన్నారు. ఇక‌.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు గవర్నర్ రమేశ్ బైస్, మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్, ఎంపీలు సదాశివ లోఖండే, డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ కూడా రాష్ట్ర‌ప‌తితో పాటు రానున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. గ‌తంలో భార‌త రాష్ట్ర‌ప‌తులుగా ఉన్న వారిలో నీలం సంజీవ్‌రెడ్డి, శంకర్‌దయాళ్‌ శర్మ, ప్రతిభా పాటిల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, రామ్‌నాథ్‌ కోవింద్‌ సాయిదర్శనం సందర్భంగా షిర్డీని సందర్శించారు..