బీసీలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా ఈ నెల 15 న హైదరాబాదులో "బీసీల రాజకీయ ప్లీనరీ"
ప్లీనరీలో బీసీల రాజకీయ పాలసీని ప్రకటిస్తాం
బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేస్తే సహించేది లేదు.
హైదరాబాదులో బీసీల రాజకీయ ప్లీనరీ
నల్గొండ ఉమ్మడి జిల్లా నుండి వేలది మంది బీసీ ప్రతినిధులు పాల్గొనాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్
బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్ కూర్మ
తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలు రాజకీయంగా అనుసరించవలసిన విధానంపై చర్చించి, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించడానికి జూలై 15వ తేదీన హైదరాబాదులోని ఎల్బీనగర్ లోని కేబిఆర్ కన్వెన్షన్ లో పదివేల మంది బీసీ ప్రతినిధులతో "బీసీల రాజకీయ ప్లీనరిని" నిర్వహిస్తామని వారు తెలిపారు.
నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అధ్యక్షతన జరిగిన బీసీ సంక్షేమ, యువజన, విద్యార్థి సంఘాల జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇస్తామని చెప్పకుండా రాయితీలు, సంక్షేమ పథకాలతో "బీసీ డిక్లరేషన్" ప్రకటనల అంటూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేయాలని చూస్తున్నామని వారు ఆరోపించారు. బీసీలకు రాయితీలతో రాజీ పడకుండా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా, సీఎం పీటమే అజెండాగా బీసీ రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెడతామని, బీసీలను మోసం చేసే పార్టీలను ఎండగట్టి, బీసీల రాజకీయ చైతన్యం రగిలించడానికి ఈ ప్లీనరీ ని ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు, ప్లీనరీలో చర్చించి అవసరమైతే బీసీలకు కూడా ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తామని, బీసీలకు రాజకీయ సంఘటిత శక్తిని చాటి 2023 ఎన్నికలు బీసీ ఎజెండాగా జరగడానికి, బీసీలు ఆశించే స్థాయి నుండి రాజకీయంగా శాసించే స్థాయికి ఎదగడానికి ఈ ప్లీనరీ ఉపయోగపడుతుందని, పార్టీలకతీతంగా ఈ ప్లీనరీ లో పాల్గొని విజయవంతం చేయాలని వారు నల్గొండ జిల్లా బీసీలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపధ్యక్షులు బూడిద మల్లికార్జున్,విశ్వనాథ చారి, శంకర్ ముదిరాజ్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జజుల లింగం గౌడ్, బిసి యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగి శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర నాయకులు పానుగంటి విజయ్, నాగరాజ్ గౌడ్, పాలకురి కిరణ్, వరికుప్పాల మధు, నర్సింహ నాయక్, జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ఆంజనేయులు యాదవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Jul 04 2023, 18:36