/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ప్రజా గర్జనకు కెసిఆర్ భయపడుతున్నాడు : రేణుక చౌదరి Yadagiri Goud
ప్రజా గర్జనకు కెసిఆర్ భయపడుతున్నాడు : రేణుక చౌదరి

ఖమ్మం జిల్లా:జులై 02

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభ కు తన ఇంటి నుంచి బయలుదేరారు.

అయితే ఖమ్మం నగరంలోని కరుణగిరి వద్ద రేణుక చౌదరి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బారికేడ్లను నెట్టుకుని నేరుగా ఖమ్మం సభా ప్రాంగణానికి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా రేణుక చౌదరి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు బారికేడ్లు పెడితే నేను అగుతానా? అని అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది ఇంకొకటని విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నిజ స్వరూపం బయటపడిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వస్తుండడంతో కేసీఆర్ భయపడుతున్నారన్నారు. తాను కాంగ్రెస్ కార్యకర్తనని.. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని రేణుక చౌదరి స్పష్టం చేశారు.

పరిస్థితి చెయ్యి దాటితే మీదే బాధ్యత.. డీజీపీకి రేవంత్ రెడ్డి ఫోన్..!

ఖమ్మం సభకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి సభకు బయలుదేరిన వాహనాలను అడ్డుకోవడంపై సీరియస్ అయ్యారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండి పడ్డారు.

ఈ అంశంపై డీజీపీతో ఫోన్లో మాట్లాడిన రేవంత్, మధుయాష్కీ గౌడ్.. సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని కోరారు. అడ్డుగోడలు దాటుకునైనా సభకు హాజరవుతామని స్పష్టం చేశారు. పరిస్థితి చేయి దాటితే బాధ్యత మీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం సభకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడంతో హైదరాబాద్ నుంచి హుటాహుటిన రేవంత్ రెడ్డి, మధుయాష్కి‌లు బయలుదేరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఇవాళ వాహనాల తనిఖీలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు మండలం లలితపురం, టేకులపల్లి మండలంలో వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. బూర్గంపాడు, భద్రాచలం వద్ద ఆర్టీవో అధికారులు, పోలసులు కలిసి చెకింగ్ చేస్తున్నారు. ఖమ్మం సభ దృష్ట్యానే పోలీసులు తనిఖీలు చేపట్టారని అశ్వారావుపేటలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు....

ఖమ్మం నుండే కేసీఆర్ పతనం: బీఆర్ఎస్ పై పొంగులేటి ఫైర్

ఖమ్మం: కేసీఆర్ పతనం ఖమ్మం సభ నుండి ప్రారంభం కానుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.ఆదివారంనాడు ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు.

రాహుల్ గాంధీ సభకు అధికార బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన రాహుల్ గాంధీ సభను విజయవంతం చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. నిన్న రాత్రి నుండి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గతంలో ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన సభను తలదన్నేలా రాహుల్ గాంధీ సభ ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

తమ పార్టీ నేత మువ్వా విజయ్ కుమార్ ను హత్య చేస్తామని వెలిసిన పోస్టర్లపై విజయ్ కుమార్ భార్య ఖమ్మం సీపీని కలిసేందుకు ప్రయత్నిస్తే ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.ఒక ఆడబిడ్డకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. తమను బెదిరిస్తూ వెలిసిన పోస్టర్లపై పోలీసుల తీరుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు..

కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 1700 ప్రైవేట్ వాహనాలను సీజ్ చేశారన్నారు. రాహుల్ గాంధీ సభకు వెళ్తే పథకాలు రావని బెదిరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసినా కూడ తాను సత్యాగ్రహ మార్గంలో పనిచేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు..

గోల్కొండ కోటలో నేడు ఆషాడ మాసం నాలుగో బోనం

హైదరాబాద్ :జులై 02

ఆషాఢ మాసం గోల్కొండ బోనాలలో నాలుగో బోనం ఆదివారం జరగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ ఆరెళ్ల జగదీశ్‌ యాదవ్‌, ఈవో శ్రీనివాస రాజులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆదివారం జరుగనున్న నాలుగో బోనం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వరకు తొట్టెలలను ఊరేగింపుగా తెస్తారు. లంగర్‌హౌస్‌ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపులు ఘనంగా జరుగుతాయి. తొట్టెలను తెచ్చే వారికి స్వాగతం పలకడానికి స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తారు. నాలుగో బోనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టనున్నామని దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీకిరణ్ ఖారే ప్రభాకర్‌ తెలిపారు.

తెలంగాణ సంసృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులతో డా.బీఆర్‌.అంబేదర్‌ సచివాలయం లో సమీక్ష నిర్వహించారు. బోనాలు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, తొమ్మిదేండ్లుగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. బోనాల ఉత్సవాలకు ఈ ఏడాది రూ.15 కోట్లు కేటాయించారని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుని బోనాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం డిప్యూటీ స్పీకర్‌, మంత్రులు, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, తదితరులు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

9న సికింద్రాబాద్‌ మహంకాళి..16న పాతబస్తీ బోనాలు..

ఈ నెల 9న సికింద్రాబాద్‌ మహంకాళి బోనాలు 16న హైదరాబాద్‌ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. ఉత్సవాలకు వారం రోజుల ముందు నుంచే ఆలయాల్లో ఏర్పాట్లకు ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్కులు అందజేయాలని అధికారులకు సూచించారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల వద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలన్నారు. సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కళా బృందాలతో కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్రీన్‌లతో పాటు లేజర్‌ షో ఏర్పాటు చేయాలని, బోనాలను విశిష్టతను తెలియజేసేలా విసృ్తత ప్రచారం నిర్వహించాలని ఐఅండ్‌పీఆర్‌, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనీల్‌కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, దేవాదాయ, పర్యాటక, సమాచార, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.......

అధికార పార్టీకి చుట్టం ప్రతిపక్షానికి చట్టమా ❓️

ఖమ్మం జిల్లా :జులై 02

కాంగ్రెస్ జన గర్జన సభ పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకొని ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు పెట్టింది. ఖమ్మం జిల్లాలో పలు చోట్ల చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. వాహనాలను సభకు వెళ్లకుండా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. జూలూరుపాడు వద్ద వాహనాలను నిలిపివేసి కేసులు నమోదు చేశారు. అలాగే నల్గొండ జిల్లా నుంచి కిరాయికి వచ్చిన వాహనాలు నిలిపివేశారు. పత్రాలున్నా కావాలనే కేసులు నమోదు చేస్తూన్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ జన గర్జన సభకు జనం వెళ్లకుండా ప్రభుత్వ పెద్దలు దురుద్దేశ్యంతో వాహనాలను ఆర్టీఏ, పోలీస్ సిబ్బంది అడ్డుకుంటున్నారని పొంగులేటి వర్గం మండిపడుతోంది.

కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘చట్టం మీకు చుట్టమా కేసీఆర్? ఎంతమందిని చంపుతారో చంపండి’ అని అన్నారు. శనివారం ఉదయం నుంచి ఖమ్మం నగరంలో ఆయనను హెచ్చరిస్తూ వెలసిన పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. తనకు కానీ.. తన కార్యకర్తలకు కానీ ఏం జరిగినా కూడా సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని అన్నారు.

బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు భయపడేది లేదని పొంగులేటి అన్నారు. తన కార్యకర్తలు ప్రతిఒక్కరినీ కాపాడుకుంటానన్నారు. తన కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ భయపడవద్దన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పోరాడుతానన్నారు. కొంతమంది అధికారులకు చెబుతున్నా.. కావాలంటే మీరు పింక్ కలర్ షర్ట్ వేసుసుకోండని సూచించారు. కొంత మంది అధికారులు రేపు శిక్షకు గురికాక తప్పదని.. తాను న్యాయపోరాటం చేస్తానని.. ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడేదిలేదని పొంగులేటి స్పష్టం చేశారు......

నకిలీ మావోయిస్టుల అరెస్టు

•మావోయిస్టు లెటర్ ప్యాడ్ తో డబ్బులు డిమాండ్

భూపాలపల్లి జిల్లా:జులై 02

నకిలీ మావోయిస్టుల పేరుతో సర్పంచ్ ను బెదిరించి డబ్బుల వసూళ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. భూపాల్ పల్లి జిల్లా కాటారం డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డి కథనం ప్రకారం సబ్ డివిజన్ పరిధిలోని పలిమెల పోలీసులు చాకచక్యంగా నిందితులను అదపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

పంకెన గ్రామానికి చెందిన ఎర్రని సోమయ్య హైదరాబాద్ లో పని చేసినప్పుడు పాలకుర్తి మండలంలోని ఎరుకలపల్లి గ్రామానికి చెందిన చిలుముల తిరుపతితో పరిచయం ఏర్పడింది.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇద్దరు ఎర్ని సోమయ్య, చిలుముల తిరుపతి కలిసి ఎలాగైనా డబ్బు సంపాదించాలని కంకణం కట్టుకున్నారు. మావోయిస్టుల పేరు చెప్పి డబ్బున్న వ్యక్తులను బెదిరించి సొమ్ము చేసుకోవాలని వ్యూహం రచించారు . యూట్యూబ్ లో మావోయిస్టుల కరపత్రాలను పరిశీలించి ఒక పథకాన్ని రచించారు. గోదావరిఖనికి చెందిన ఈర్ల రామచందర్, టేకుల సుధీర్, పేర్ని సోమయ్య చిలుముల తిరుపతిలో కలిసి మావోయిస్టుల పేరుతో కరపత్రాలు తయారు చేశారు.

జూన్ 15న మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పంకెన సర్పంచ్ బొచ్చు శ్రీనివాస్ కు, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ కు రూ.5లక్షలు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని పోస్ట్ ఆఫీస్ నుంచి లెటర్లు పోస్ట్ చేశారు. కొన్ని రోజుల రోజుల తరువాత పంకెన సర్పంచ్ బొచ్చు శ్రీనివాస్ కు నిందితులు ఫోన్ చేసి రూ.5 లక్షలు కరీంనగర్ బస్టాండ్ లో అప్పజెప్పాలని బెదిరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన పంకేన సర్పంచ్ బొచ్చు శ్రీనివాస్ 29న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పంకెన గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఏర్ని సోమయ్య హైదరాబాద్ నుంచి పంకేనకు 29న వెళ్లారు.

పలిమెల పోలీసులకు అందిన సమాచారంతో ఎర్ని సోమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పథకంలో భాగంగా నిందితులు ముగ్గురిని తిరుపతిని హైదరాబాద్ లో, రామచందర్, సుధీర్ లను గోదావరి ఖనిలో పలిమేల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరస్థులను పట్టుకునేందుకు పలిమేల పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నకిలీ మావోయిస్టు కేసును ఛేదించిన పంకెన పోలీసులను డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి అభినందించారు.నకిలీ మావోయిస్టులను అరెస్టు చేసిన కేసులో కాలేశ్వరం, పలిమెల ఎస్ఐలు లక్ష్మణ్ రావు, అరుణ్, శివ, పోలీస్ కానిస్టేబుళ్లు బాల్ సింగ్, శ్యామ్, మధు, సమ్మయ్య ,అరుణ్, సంతోష్, హోంగార్డు తిరుపతిని భూపాలపల్లి జిల్లా ఎస్పీ జే.సురేందర్ రెడ్డి అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు అభినందించారు.....

నేడే ఖమ్మం గుమ్మం లో జన గర్జన సభ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణకు రానున్నారు. ఈ సాయంత్రం ఖమ్మంలో జరగనున్న తెలంగాణ జన గర్జన సభకు ఆయన హాజరవుతారు. ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం రానున్నారు. ఖమ్మం సభ తర్వాత రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు.

కాగా సీఎల్పీ నేత భట్టి విక్రమాక్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభ ఏర్పాటు చేశారు. అలాగే రాహుల్‌ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. సుమారు వంద ఎకరాల్లో బహిరంగ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా రాహుల్‌గాంధీ రెండోసారి ఖమ్మం రాబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ టీడీపీ, సీపీఐ కూటమి విజయం కోసం ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచారం సాగించారు. ఈ బహిరంగసభకు హాజరైన రాహుల్‌గాంధీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ జన గర్జన పేరుతో జరిగే సభకు ఖమ్మం పర్యటనకు రానున్నారు........

సాయిచంద్ మృతి తరువాత అ స్థానం ఎవ్వరిది ❓️

తెలంగాణా ఉద్యమ కళాకారుడు సాయిచంద్ మృతితో కళాకారుడి కోసం కేసీఆర్ వెతుకులాట స్టార్ట్ చేశారు. స్టేజ్ మేనేజ్ మెంట్ చేసే వ్యక్తి కావాలని నేతలకు సూచించారు. పలువురి పేర్లను సైతం అధినేత పరిశీలించినట్లు సమాచారం. కొంతమంది కళాకారులకు ఇతర పార్టీలకు మద్దతుగా ఉండటంతో వారిని తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కళాకారులే కీలకమని గులాబీ బాస్ భావిస్తున్నారు.

సాయిచంద్ తర్వాత ఎవరు..?

సాయిచంద్ అకాల మృతితో మరో కళాకారుడి కోసం చూస్తున్నారు. గిద్దె రాంనర్సయ్య, ఏపూరి సోమన్న, మద్దెల రామ్మూర్తి, కిషోర్, వంగపల్లి ఉష, సందీప్, మధుప్రియతో పాటు పలువురి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. పోడుపట్టాల పంపిణీని పురస్కరించుకొని ఆసిఫాబాద్‌లో నిర్వహించిన సభలో సాయిచంద్ లేనిలోటు స్పష్టంగా కనిపించిందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మధుప్రియతో పాటలు పాడించినప్పటికీ అంతగా ఆకట్టుకోలేదని స్టేజ్ మేనేజ్ మెంట్ సైతం చేయలేకపోయిందని నేతలు పేర్కొంటున్నారు.

రసమయి, గోరటి ఉన్నా?

పార్టీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీగా గోరటి వెంకన్న ఉన్నప్పటికీ వీరు పదవుల్లో ఉండటంతో వీరిసేవలను వినియోగించుకుంటే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక మెసేజ్ పోతుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పట్టున్న కళాకారులకు పార్టీ భారీ నజరానా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర అవతరణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కళాకారుల్లో ఎక్కువమంది బీఆర్ఎస్‌లో కళాకారుడి నుంచి ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి వ్యవహారశైలి నచ్చకపోవడంతో దూరమయ్యారు. వారు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా? అనే చర్చ పార్టీలోనే మొదలైంది....

9మంది సీఐల బదిలీలు.. ఉత్తర్వులు జారీ!!

హైదరాబాద్ :జులై 02

9మంది సీఐలను బదిలీ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసారు. చేవెళ్ల సీఐగా ఉన్న వెంకటేశ్వర్లును ఆమన్ గల్‌కు ట్రాన్స్‌ఫర్ చేసారు. శంకర్ పల్లి డీఐని చేవెళ్ల సీఐగా నియమించారు.

సైబర్ క్రైమ్స్‌లో ఉన్న నాగేశ్వర్ రావును ఆల్వాల్ ట్రాఫిక్ సీఐగా బదిలీ చేసారు. మొయినాబాద్ సీఐగా ఉన్న లక్ష్మి రెడ్డిని షాద్ నగర్ రూరల్ సీఐగా ట్రాన్స్‌ఫర్ చేసారు. అక్కడ ఉన్న సత్యనారాయణను క్రైమ్స్ వింగ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసారు.

షాబాద్ సీఐ గురువయ్యను క్రైమ్స్ వింగ్‌కు బదిలీ చేసారు. ఇక, సైబర్ క్రైమ్స్‌లో ఉన్న భూపాల్ శ్రీధర్‌ను శంషాబాద్ ఎస్బీకి ట్రాన్స్‌ఫర్ చేసారు. అక్కడ ఉన్న విజయ్ కుమార్‌ను రాజేంద్రనగర్ ఎస్బీకి బదిలీ చేసారు. సీఏటీలో ఉన్న యాదయ్య గౌడ్‌ను షాబాద్ సీఐగా నియమించారు..........

నేడు వరంగల్ జిల్లా లో బీజేపీ నేతల పర్యవేక్షణ

హైదరాబాద్:జులై 02

తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్ ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి జితేందర్ రెడ్డి తదితరులు ఆదివారం వరంగల్‌కు వెళ్లనున్నారు. ఉప్పు నిప్పుగా ఉన్న ఈటల, బండి ఒకే వేదిక పంచుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు సన్నాహక సమావేశం ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు మోదీ రానున్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. వరంగల్ సభతో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. ఖమ్మంలో నేటి కాంగ్రెస్ సభకు దీటుగా వరంగల్‌లో మోదీ సభను నిర్వహించాలని కమలం నేతలు నిర్ణయించారు.

కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు 8న‌ హైదరాబాద్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.

కాగా ఆదివారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే కాబినెట్ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ప్రచారం నేపథ్యంలో.. రేపటి కాబినెట్ కౌన్సిల్ మీటింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది...