నకిలీ మావోయిస్టుల అరెస్టు
•మావోయిస్టు లెటర్ ప్యాడ్ తో డబ్బులు డిమాండ్
భూపాలపల్లి జిల్లా:జులై 02
నకిలీ మావోయిస్టుల పేరుతో సర్పంచ్ ను బెదిరించి డబ్బుల వసూళ్లకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. భూపాల్ పల్లి జిల్లా కాటారం డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డి కథనం ప్రకారం సబ్ డివిజన్ పరిధిలోని పలిమెల పోలీసులు చాకచక్యంగా నిందితులను అదపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
పంకెన గ్రామానికి చెందిన ఎర్రని సోమయ్య హైదరాబాద్ లో పని చేసినప్పుడు పాలకుర్తి మండలంలోని ఎరుకలపల్లి గ్రామానికి చెందిన చిలుముల తిరుపతితో పరిచయం ఏర్పడింది.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఇద్దరు ఎర్ని సోమయ్య, చిలుముల తిరుపతి కలిసి ఎలాగైనా డబ్బు సంపాదించాలని కంకణం కట్టుకున్నారు. మావోయిస్టుల పేరు చెప్పి డబ్బున్న వ్యక్తులను బెదిరించి సొమ్ము చేసుకోవాలని వ్యూహం రచించారు . యూట్యూబ్ లో మావోయిస్టుల కరపత్రాలను పరిశీలించి ఒక పథకాన్ని రచించారు. గోదావరిఖనికి చెందిన ఈర్ల రామచందర్, టేకుల సుధీర్, పేర్ని సోమయ్య చిలుముల తిరుపతిలో కలిసి మావోయిస్టుల పేరుతో కరపత్రాలు తయారు చేశారు.
జూన్ 15న మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పంకెన సర్పంచ్ బొచ్చు శ్రీనివాస్ కు, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ కు రూ.5లక్షలు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని పోస్ట్ ఆఫీస్ నుంచి లెటర్లు పోస్ట్ చేశారు. కొన్ని రోజుల రోజుల తరువాత పంకెన సర్పంచ్ బొచ్చు శ్రీనివాస్ కు నిందితులు ఫోన్ చేసి రూ.5 లక్షలు కరీంనగర్ బస్టాండ్ లో అప్పజెప్పాలని బెదిరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన పంకేన సర్పంచ్ బొచ్చు శ్రీనివాస్ 29న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పంకెన గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఏర్ని సోమయ్య హైదరాబాద్ నుంచి పంకేనకు 29న వెళ్లారు.
పలిమెల పోలీసులకు అందిన సమాచారంతో ఎర్ని సోమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పథకంలో భాగంగా నిందితులు ముగ్గురిని తిరుపతిని హైదరాబాద్ లో, రామచందర్, సుధీర్ లను గోదావరి ఖనిలో పలిమేల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరస్థులను పట్టుకునేందుకు పలిమేల పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నకిలీ మావోయిస్టు కేసును ఛేదించిన పంకెన పోలీసులను డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి అభినందించారు.నకిలీ మావోయిస్టులను అరెస్టు చేసిన కేసులో కాలేశ్వరం, పలిమెల ఎస్ఐలు లక్ష్మణ్ రావు, అరుణ్, శివ, పోలీస్ కానిస్టేబుళ్లు బాల్ సింగ్, శ్యామ్, మధు, సమ్మయ్య ,అరుణ్, సంతోష్, హోంగార్డు తిరుపతిని భూపాలపల్లి జిల్లా ఎస్పీ జే.సురేందర్ రెడ్డి అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు అభినందించారు.....
Jul 02 2023, 11:20