Festivals: ఒకే రోజు రెండు పండగలు.. ఆలయాలు, ఈద్గాల్లో భక్తుల రద్దీ
తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. తొలి ఏకాదశి, బక్రీద్ పండగలు ఒకే రోజు కావడంతో ప్రార్థనలు, పూజలతో భక్తులు నిమగ్నమైపోయారు. ఆలయాల వద్ద భక్తులు..
మసీదుల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తూ కొంతమంది ఉపవాస దీక్ష ఉంటున్నట్లు తెలిపారు. వర్షం కారణంగా కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని భక్తులు చెప్పారు.
పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు నిర్ణయించారు. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగే మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే రూట్లకు మళ్లించనున్నారు. ప్రయాణికులు సహకరించి వారు సూచించిన మార్గాల్లో ప్రయాణం సాగించాలని పోలీసులు కోరారు..
ఆలయాలు, మసీదుల దగ్గర పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛానీయ సంఘటనలు జరుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఒకే రోజు హిందూ-ముస్లిం పండగలు రావడం సంతోషంగా ఉందని పలువురు తెలిపారు..
Jun 29 2023, 10:59