రూ.1,25,000 రివార్డు ఉన్న వాంటెడ్ క్రిమినల్ హతం!!
కౌషంబి:జూన్ 27
హత్యలు, దోపిడీలు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వాంటెడ్ క్రిమినల్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు మట్టుబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌషంబి జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఎన్‍కౌంటర్ చోటుచేసుకుంది.
మృతుడిని మొహమ్మద్ గుర్ఫాన్‌గా గుర్తించారు. మాంఝాన్‌పూర్‌లోని సాండ సుగర్ మిల్లు సమీపంలో లక్నో ఎస్‌టీఎఫ్ గాలింపు జరుపుతుండగా జరిగిన ఎదురెదురు కాల్పుల్లో వాంటెండ్ క్రిమినల్ గుర్ఫాన్ హతమైనట్టు కౌషంబి ఎస్‌పీ బ్రిజేష్ శ్రీవాత్సవ తెలిపారు.
గుర్ఫాన్ తలపై రూ.1,25,000 రివార్డు ఉందని చెప్పారు. గాయపడిన గుర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన గుర్ఫాన్‌పై 13 క్రిమినల్ కేసులు ఉన్నట్టు వివరించారు....
Jun 27 2023, 09:42