సీఎం జగన్ పై అసభ్యకర పోస్టులు..NRI అరెస్ట్
సోషల్ మీడియాల్లో సిఎం జగన్ పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడని ఎన్ఆర్ఐ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యూఎస్ లో 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి తన సొంత గ్రామం గన్నవరం లో తల్లి దండ్రులు ఇంటికి వచ్చాడు కోటిరత్నం అంజన్. ట్విట్టర్ లో సీఎం జగన్ పై అసభ్యంగా పోస్ట్ పెట్టడంతో నిన్న సాయంత్రం అంజన్ అరెస్ట్ చేశారు గన్నవరం పోలీసులు.
అంజన్ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..అంజన్ ఫోన్, ల్యాప్ ట్యాప్,బ్యాంక్ లావాదేవీలు అడిగి తెలుసుకున్నారు. అంజన్ కి ట్విట్టర్ , సోషలో మీడియాలో పై ఆసక్తి ఎక్కువ అని తెలిపారు తల్లి రత్నకుమారి. నిన్న సాయంత్రం అంజన్ నీ అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు..ఇప్పటి వరకు అంజన్ ఎక్కడ ఉన్నాడో తల్లి దండ్రులకు తెలుపలేదు. దీంతో పోలీసులు తీరు పై మండి పడుతున్నారు అంజన్ తల్లి దండ్రులు.











Mar 30 2023, 15:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.9k