/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడే కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ Yadagiri Goud
నేడే కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ

•ఇవాళైనా హాజరవుతారా? లేదా..?

నేడే కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ఇవాళైనా హాజరవుతారా? లేదా..? అని ఉత్కంఠ నెలకొంది.

ఈడీ విచారణ ఉన్నందున కవిత నిన్న (మార్చి 19) సాయంత్రమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం అయ్యారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణల వల్ల ప్రస్తుతం ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఈడీ ఎదుట విచారణకు నేడు హాజరు కావాల్సి ఉంది.

మూడు రోజుల క్రితమే (మార్చి 16న) హాజరు కావాల్సి ఉండగా, ఆమె విచారణకు వెళ్లకపోవడంతో నేడు (మార్చి 20) రావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ కూడా ఆమె ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది.

MLC Elections 2023: ఎమ్మెల్యేలపై ఇంటెలిజెన్స్ నిఘా..! ఎందుకో తెలుసా..?

MLC Elections 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి.. ఈ నెల 23వ తేదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే దీనిపై తమ ఎమ్మెల్యేలకు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా విప్ జారీ చేసింది..

ఈ రోజు తేదీన అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని.. 23వ తేదీ పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని విప్ జారీ చేసింది వైసీపీ.. అయితే, విప్ ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. మరోవైపు.. ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది..

23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కదలికలపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టించిందట.. అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా? అని జిల్లాల్లో ఆరా తీస్తోంది వైసీపీ అధిష్టానం.. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏడు మాత్రమే ఖాళీగా ఉన్నా.. ఇప్పడు 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు..

అనూహ్యంగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టింది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్క ఓటు చే జారినా ఫలితాలపై ప్రభావం పడనుంది.. అయితే, ఈ మధ్యే వైసీపీకి రెబల్‌గా మారిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి.. ఆత్మ ప్రభోదానుసారం ఓటేస్తాం అని ప్రకటించడంతో.. వారి ఓట్లు వైసీపీకి పడడం డౌట్‌గానే ఉంది.. ఇక, ఆ ఇద్దరు ఎమ్మెల్యేల దారిలో ఇంకెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తోంది వైసీపీ అధిష్టానం.. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది..

తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య

•భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు

తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు. జర్నలిస్టుల జర్నలిజం ద్వారా మన సమాజానికి ప్రతినిత్యం అన్ని రకాల సమాచారం అందిస్తూ అనునిత్యం ప్రజలతో మమేకమైనటువంటి తీన్మార్ మల్లన్న

న్యూస్ ఆఫీస్ పై 25 మంది దుండగులు ఎవరైతే దాడి ఆఫీస్ ఫర్నిచర్ కంప్యూటర్లు ధ్వంసం చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన శిక్షను విధించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిజాన్ని తొక్కి పట్టి తనకు అనుకూలంగా మాట్లాడే పత్రికలను చూపించే టీవీ ఛానల్ ను

మాత్రమే ప్రచారం చేసుకునే విధంగా స్వార్థ పూరితమైనటువంటి కుట్ర వ్యవహారాలని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు ఖండించారు . తీన్మార్ మల్లన్న క్యు న్యూస్ ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి స్కాముల బాగోతం బట్ట బయలు అయితున్నందుకు తట్టుకోలేక

కేసీఆర్ ప్రభుత్వం ఇటువంటి హేమమైన దుర్మార్గమైన చర్యలు చేస్తున్నాయన్నారు. కాబట్టి ఇట్టి దాడిని యావత్ తెలంగాణ ప్రజానీకం వ్యతిరేకిస్తున్నది. జర్నలిజం ద్వారా ప్రజల మేలుకొలుపు ఉంటుంది తప్ప ఎవరికి వత్తాసు పడకుండా ప్రజల పక్షాన నిలబడుతున్న తీన్మార్ మల్లన్నకు పూర్తిస్థాయిగా మా మద్దతు ఉంటుందని భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు తెలియజేస్తున్నారు.

తీన్మార్ మల్లన్న Qన్యూస్ ఆఫీస్ పై దాడి చేయడం హేయమైన చర్య

•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

తీన్మార్ మల్లన్నకు సంబంధించిన Qన్యూస్ ఛానల్ ఆఫీస్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం హేయమైన చర్య అని ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిసి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అన్నారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను నిరంతరం ఎప్పటికప్పుడు తన Qన్యూస్ చానల్ ద్వారా ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్న బడుగు బలహీనవర్గాలకు చెందిన జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పై కక్ష గట్టి

తనకు సంబంధించిన Qన్యూస్ ఛానల్ ఆఫీస్ పై గుర్తు తెలియని గుండాలు దాడి చేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేయడం అంటే ఇది పూర్తిగా జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడమే అన్నారు. ప్రభుత్వం తక్షణమే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, శేరి రవీందర్, సురేందర్, అనిల్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరో టీఎస్పీఎస్సీగా మారనున్న ఎంజి యూనివర్సిటీ

•బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

ఆదివారం బి.సి విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కూడా మరో టిఎస్పిఎస్సి గా మారకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నాము. ఎందుకంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఆరేళ్లుగా ఒకరే పరీక్ష అధికారిగా కొనసాగుతున్నారు పరీక్షల ఫలితాల్లో వెల్లడిలో ఎన్నోసార్లు అవకతవకలు జరిగాయి.

దాంతో వేల మంది విద్యార్థులు ఆందోళనల చెందారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇలాగనే కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరం తక్షణమే పరీక్షల విభాగంలో ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరో టీఎస్పీఎస్సీగా మారకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

పరీక్షల విభాగ అధికారి కొన్ని ప్రైవేట్ కళాశాల యజమానులతో ప్రతి సెమిస్టర్ కి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఆరోపిస్తున్నారు. అసలు రిజిస్టర్ కి అతనికి సంబంధించిన సబ్జెక్టు యూనివర్సిటీ పరిధిలో లేకపోయినా అతన్ని కావాలని వీసి తన సొంత స్వలాభం కోసం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న వీసీ, రిజిస్టర్ మరియు ఓ.ఎస్.డి ముగ్గురు కలిసి యూనివర్సిటీ నిధులని తమ ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. జల్సాలకు వినియోగించుకుంటున్నారు.

అంతేకాకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అనేక విభాగాలలో అవకతవకలకు పాల్పడుతున్నారు. వీటన్నిటి పైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని బి.సి విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో బి.సి విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, యువజన సంఘం జిల్లా నాయకుడు రావుల రాజేష్ గౌడ్, సుధాకర్, లక్ష్మణ్,పండ్ల హరికృష్ణ గౌడ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు......

ఈదురు గాలులు,అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి

...AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి

గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులతో నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత రైతు- కూలీ సంఘం (AIKMS) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అకాల వర్షాల కారణంగా నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరి, మామిడి, మిర్చి, నిమ్మ,బత్తాయి, మొక్కజొన్న, బొప్పాయి తదితర తోటలు నేలమట్టం అయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు.ఇప్పటికే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక,తెచ్చిన అప్పులు తీర్చలేక మధ్య దళారులతో విసిగి వేసారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

మార్కెట్లో కల్తీ పురుగుల మందులు,నాసిరకం విత్తనాలతో పంటలు పండక,పండిన పంటకు ధరలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ప్రకృతి(విపత్తు) వైపరిత్యాలతో మరింత నష్టపోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరానికి లక్ష రూపాయలు ఏక్సిగ్రెసియా చెల్లించాలని అన్నారు.

దేశానికి రైతే వెన్నెముక అంటున్నా పాలకులు రైతాంగాన్నీ తీవ్ర సంక్షోభంలో నెడుతున్నారని,వ్యవసాయ రంగానికి అన్నిరకాల సబ్సిడీపై ఎరువుల,విత్తనాలు,వ్యవసాయ పనిముట్లు అందించాలని,ఏక కాలంలో లక్ష రూపాయలను రుణమాఫీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంన్నారని దుయ్యబట్టారు.వెంటనే రైతాంగానికి చేయూత నివ్వాలని కొరారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఏక్సిగ్రెసియా వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam)లో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది

సుప్రీంకోర్టు (Supreme Court)లో ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకు ఈడీ విజ్ఞప్తి చేసింది. ఈనెల 24న కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కేవియట్ పిటిషన్ దాఖలుతో కవిత తరపు వాదనలు, ఈడీ తరపు వాదనలు సుప్రీంకోర్టు విననుంది.

ఈడీ (ED) తనను విచారణకు పిలవడాన్ని సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా... 24న విచారిస్తామని కోర్టు తెలిపిన విషయం తెలిసిందే. మార్చి 16న ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించింది. అయితే కవిత పిటిషన్‌ను తాము ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని.. దాంట్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ (Petition) విచారణ జరిగేంత వరకూ ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ఏకంగా లేఖాస్త్రాన్ని సంధించారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ తాజా సమన్లలో ఎక్కడా పేర్కొనలేదని అందులో ప్రస్తావించారు. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. దర్యాప్తు న్యాయపరంగా, చట్టప్రకారం జరగడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఈ నెల 24 ఈ నెల 24న తన కేసు విచారణకు స్వీకరించే దాకా వేచి చూడాలని, ఏమైనా సమాచారం కావాలంటే తన అధికారిక ప్రతినిధికి చెప్పాలని, లేకపోతే తనకు ఈ-మెయిల్‌ చేయవచ్చని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు.

సాధ్యమైనంత వరకు ఈడీ దర్యాప్తు తప్పించుకోవాలని కవిత ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులైన అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఆడిటర్‌ బుచ్చిబాబులను ముఖాముఖి కూర్చోబెట్టి ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకరితో ధ్రువీకరింపచేయాలని, అనంతరం అరుణ్‌ పిళ్లైని కవితతో ముఖాముఖి కూర్చోబెట్టి వాస్తవాలను అంగీకరింపచేయాలని ఈడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.

TSPSC: టీఎస్‎పీఎస్సీ బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం?

హైదరాబాద్: TSPSC బోర్డు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ లీకేజ్‌పై(Paper leakage) ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) సీరియస్‎గా ఉన్నట్లు తెలుస్తోంది.

TSPSC చైర్మన్ జనార్ధన్‌రెడ్డిని(Janardhan Reddy) ప్రగతిభవన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన హుటాహుటిన ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ (kcr) మంత్రులు హరీష్‌రావు(Harish Rao), కేటీఆర్ (KTR)తో భేటీ అయ్యే అవకాశం ఉంది..

కాగా, గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‎పీఎస్సీ)TSPSC ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1తోపాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

శుక్రవారం TSPSC (టీఎస్‎పీఎస్సీ) అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయంతో మొత్తం ఆరు పరీక్షలను రద్దు చేసినట్లయింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. వాతావరణ శాఖ సూచన

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని తెలిపింది..

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్‌ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..

Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రెండు డీసీఎంలు దగ్ధం..

హైదరాబాద్‌: నగరంలో మరో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. రెండు డీసీఎంలతో పాటు గోదాంలో విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది..