/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రాహుల్ గాంధీపై రాజస్థాన్ కేబినెట్ మంత్రి కుమారుడి ఘాటైన వ్యాఖ్య Yadagiri Goud
రాహుల్ గాంధీపై రాజస్థాన్ కేబినెట్ మంత్రి కుమారుడి ఘాటైన వ్యాఖ్య

బ్రిటన్‌ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనపై రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓ వైపు విదేశాలకు వెళ్లి దేశ అంతర్గత వ్యవహారాలపై ప్రకటనలు చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ.. మరోవైపు ఇప్పుడు సొంత వాళ్లే చుట్టుముట్టారు.. వచ్చారు.. రాజస్థాన్ ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రి విశ్వేంద్ర సింగ్, కుమారుడు అనిరుధ్ సింగ్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. బహుశా వేరే దేశానికి చెందిన పార్లమెంట్‌కు వెళ్లి భారత్‌ను అవమానించే పిచ్చివాడిలా తయారయ్యాడని ట్విట్టర్‌లో రాశాడు. రాహుల్ గాంధీకి అనిరుధ్ కూడా ఇటలీని తన మాతృభూమిగా భావిస్తున్నట్లు రాశాడు.

లండన్‌లోని బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ గ్రాండ్ కమిటీ రూమ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ను ఉటంకిస్తూ ఓ వార్తాకథనాన్ని ట్యాగ్ చేస్తూ.. 'మా పార్లమెంట్‌లోని మైక్‌లు సైలెంట్‌గా ఉన్నాయి' అని అనిరుధ్ ట్వీట్ చేశాడు.రాహుల్ గాంధీ ఇలా మాట్లాడి ఆత్మవిశ్వాసం పెంచుకున్నారా, తమను అవమానించే వారు. మరొక దేశం యొక్క పార్లమెంటులో దేశం. బహుశా అతను ఇటలీని తన మాతృభూమిగా పరిగణించవచ్చు.

సచిన్ పైలట్‌కి అనిరుధ్ సన్నిహితుడు.

మంత్రి విశ్వేంద్ర సింగ్ కుమారుడు అనిరుధ్ సింగ్ తరచుగా వివాదాల్లో ఉంటాడు మరియు అతను సచిన్ పైలట్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తాడని మీకు తెలియజేద్దాం.సచిన్ పైలట్‌కు మద్దతుగా బహిరంగంగా మాట్లాడడమే కాకుండా, ఆయనను సీఎం చేయడానికి సోషల్ మీడియాలో లాబీయింగ్ కూడా చేస్తున్నాడు.

అనిరుధ్ తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేశాడు

అనిరుధ్ సింగ్ ఒక విషయంలో వివాదంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. మీడియా కథనాల ప్రకారం, అనిరుధ్ తన తండ్రితో అస్సలు కలిసి ఉండడు. మే 2021లో, అనిరుధ్ తన తండ్రి తన తల్లి పట్ల హింసాత్మకంగా ప్రవర్తించాడని ఆరోపించాడు. తన తండ్రి మద్యానికి బానిస అని అనిరుధ్ కూడా చెప్పాడు. విశ్వేంద్ర సింగ్‌ను ఆరోపిస్తూ, అనిరుధ్ మాట్లాడుతూ, నేను 6 వారాలుగా మా నాన్నతో కాంటాక్ట్‌లో లేను. అతను మా అమ్మపై హింసాత్మకంగా మారాడు, మద్యం సేవించడం ప్రారంభించాడు మరియు నా స్నేహితుల వ్యాపారాన్ని కూడా నాశనం చేశాడు. ఇది కేవలం రాజకీయ సిద్ధాంతాల తేడా కాదు.

MLC Kavitha: దిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షకు అనుమతి నిరాకరణ

•ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడెలా రద్దు చేస్తారని కవిత ఆగ్రహం

దిల్లీ: చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌తో భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన నిరసన దీక్షకు దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.

శుక్రవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమతి రద్దు చేస్తున్నట్లు కవితకు పోలీసులు తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతుండగానే సమాచారం అందించారు. ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎలా రద్దు చేస్తారని కవిత ప్రశ్నించారు.

తమ దీక్షలో మార్పు లేదని.. యథావిధిగా నిరసన కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. దీనిపై దిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు..

TDP: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థిని దించే యోచనలో తెదేపా!

అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) పోటీ చేసేందుకు తెదేపా(TDP) సిద్ధమవుతోంది. అభ్యర్థిని పోటీకి దించాలని భావిస్తోంది..

ఈ విషయంపై పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 13తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని నిలిపే అంశంపై నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. ఒక్కో స్థానంలో అభ్యర్థి గెలవాలంటే 22 నుంచి 23 ఓట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం తెదేపా తరఫున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వారిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి వైకాపాకు మద్దతు ప్రకటించారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో విప్‌ జారీ చేయాలని తెదేపా భావిస్తోంది. ఆయా ఎమ్మెల్యేలు విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకే విప్‌ను ఉల్లంఘిస్తే ఆయా ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని తెదేపా భావిస్తోంది..

నేడు కరీంనగర్‌లో కాంగ్రెస్‌ భారీ సభ..

హైదరాబాద్‌: కరీంనగర్‌ కేంద్రంగా గురువారం కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది.

హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రల్లో భాగంగా తొలిదశలో మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి యాత్రలు పూర్తయిన సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నారు..

సభకు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌భగేల్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే తదితరులు హాజరు కానున్నారు. కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించే ఈ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు టీపీసీసీ వర్గాలు వెల్లడించారు..

రేపు భారాస విస్తృతస్థాయి సమావేశం

•సీఎం అధ్యక్షతన పార్లమెంటరీ పక్ష, శాసనసభ, రాష్ట్ర కార్యవర్గ భేటీ

•కవితకు నోటీసుల నేపథ్యంలో సమావేనికి ప్రాధాన్యం

హైదరాబాద్‌: భారాస పార్లమెంటరీ, శాసనసభాపక్ష, రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని శుక్రవారం (ఈ నెల 10న) మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ నేతలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు, డీసీఎంఎస్‌లు, డీసీసీబీల ఛైర్మన్‌లు హాజరుకానున్నారు. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్లడం.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో తనిఖీలు, మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సిబ్బందిని విచారించడంతోపాటు ఇటీవల ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడం, తాజాగా ఈడీ నోటీసుల అంశాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. కవితకు నోటీసుల అంశంపై మంత్రులు, భారాస నేతలందరూ పెద్దఎత్తున కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ తరుణంలో సీఎం పార్టీ విస్తృతస్థాయి భేటీ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిని ఎండగట్టడంతోపాటు పార్టీ ఎన్నికల కార్యాచరణనూ వెల్లడించే వీలుంది.

నేడు మంత్రిమండలి భేటీ

మరోవైపు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొత్త క్రీడావిధానం, పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సహా పలు కీలక అంశాలపై చర్చించి మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోనుంది. దీంతోపాటు రాష్ట్రంలో గవర్నర్‌ కోటాలో ఇద్దరు నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పేర్లను ఖరారు చేయనుంది. కవితకు ఈడీ నోటీసులపై రాజకీయంగా వేడిరాజుకున్న నేపథ్యంలో మంత్రిమండలి సమావేశ నిర్ణయాలపైనా అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరు?

గవర్నర్‌ కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న డి.రాజేశ్వర్‌రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌ల పదవీకాలం మే నెలలో ముగుస్తోంది. ఈ రెండు స్థానాలకు ఇద్దరి పేర్లను ఎంపిక చేసి గవర్నర్‌కు సిఫార్సు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయిలో కసరత్తు చేశారు. రాజేశ్వర్‌రావు, ఫారుఖ్‌ హుస్సేన్‌లు మరో అవకాశాన్ని కోరుతున్నారు. దళిత, క్రైస్తవ, ముస్లిం కోటా కింద తమకు అవకాశం ఇవ్వాలని మరికొందరు ముఖ్యనేతలు సీఎంను కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో మూడు స్థానాలను ఓసీలకే ఇచ్చినందున ఈసారి రెండు స్థానాల్లో ఒకటి బీసీలకు ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తోపాటు వీజీ గౌడ్‌, దాసోజు శ్రవణ్‌ తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు.

TS: నామినేషన్‌ వేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు..

నామినేషన్‌ వేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు..

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఉదయం దేశపతి శ్రీనివాస్‌, వెంకట్రామ్‌రెడ్డి, నవీన్‌ కుమార్‌ నామినేషన్‌ వేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ సందర్భంగా మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు..

నోకియా కొత్త లోగో

నోకియా గత 60 ఏళ్లలోనే తొలిసారిగా తన లోగోను మార్చింది. కొత్త లోగోతో మార్కెట్లోకి మళ్లీ బలమైన అరంగేట్రం చేయాలని యోచిస్తున్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది.

నోకియా కొత్త లోగోలో ఐదు రకాల డిజైన్‌లు ఉన్నాయి, అవి కలిసి NOKIA అనే ​​పదాన్ని రూపొందిస్తున్నాయి.

ఈ సారి లోగో రంగుల పరంగా మెరుగ్గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకుముందు ఇది నీలం రంగులో మాత్రమే ఉండేది, కానీ కొత్త లోగో చాలా ఆకర్షణీయంగా కనిపించేలా అనేక రంగులతో రూపొందించారు.

తిరుమల సమాచారం...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

7 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు...

టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 7 గంటల సమయం...

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,941 మంది భక్తులు...

తలనీలాలు సమర్పించిన 23,141 మంది భక్తులు...

నిన్న హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు...

Maoist Vs Police : సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్..

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (Sukma) జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో దాదాపు ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం.

గాయపడినవారు సంఘటన స్థలం నుంచి పారిపోతుండగా చూసినట్లు భద్రతా దళాలు తెలిపినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ సంయుక్త బృందానికి మావోయిస్టులు ఎదురుపడటంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలం నుంచి బీజీఎల్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నక్సలైట్ల కోసం గాలింపు కొనసాగుతోంది.

సుక్మా జిల్లా అత్యంత సమస్యాత్మక ప్రాంతం అనే సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత మిలిటరైజ్డ్ జిల్లాల్లో ఇదొకటి. నక్సలైట్-మావోయిస్ట్ తిరుగుబాట్ల ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది..

ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్.. ఈజీగా లక్షపొందండి ఇలా

ఆడ పిల్ల తన తల్లిదండ్రులకు భారం కాకూడదని, ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన..మహిళలు ఆర్థికంగా ఎదగడానికి

ఆడ పిల్ల తన తల్లిదండ్రులకు భారం కాకూడదని, ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది. అందులో ఒకటి సుకన్య సమృద్ధి యోజన..మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి పెడితే అవి ఉన్నత చదువుల కోసం ఉపయోగపడుతాయి.అందువలన ఉమెన్స్ డే సందర్భంగా ఈ పథకం గురించి తెలుసుకుందాం.

సుకన్య సమృద్ధి యోజన పథకం అర్హతలు :

ఈ పథకాన్ని ఓపెన్ చెయ్యాలంటే భారత పౌరురాలు అయి ఉండాలి

అకౌంట్‌ను ఓపెన్ చేసే సమయానికి అమ్మాయి వయసు పదేళ్లకు మించి ఉండరాదు.

సుకన్య సమృద్ధి యోజన ఖాథఆ కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మాత్రమే తెరుస్తారు.

బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతను తెరవవచ్చు.

ఎస్ఎస్‌వై ఖాతాలకు 7.6 శాతం వడ్డీ వస్తుంది. మీరు మీ పెట్టుబడి, వ్యవధి ఆధారంగా మీ లాభన్ని తెలుసుకోవచ్చు.

పథకం ముఖ్యమైన వివరాలు :

సుకన్య పథకంలో అకౌంట్ తీసుకోవాలంటే కనీస మొత్తం రూ.250తో ఖాతా ప్రారంభించాలి. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈ ఖాతా దాచుకోవచ్చు. ఒక వేళ మీరు పది సంవత్సరాల కాలానికి 7.6 శాతం వడ్డీరేటుతో నెలకు రూ.8333 పెట్టుబడి పెడితే అది సంవత్సరానికి రూ. 100000 అవుతంది. అయితే మెచ్యూర్ అయ్యాక వడ్డీతో కలిపి రూ.15,29,458 లాభాన్ని మీరు పొందవచ్చు.