కేంద్ర ప్రభుత్వ పథకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు సరికాదు : పల్లపు బుద్ధుడు
![]()
కేంద్ర ప్రభుత్వ పథకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు సరికాదని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వివక్షత చూపిస్తున్నారని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంత్యోదయ సిద్ధాంతంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆహారం అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్నారు. మరి ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య చికిత్సల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని నరేంద్ర మోడీ గారు ఐదు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినారు.
ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా 1665 రకాల రోగాలకు చికిత్స ఉచితంగా ఉంటుందన్నారు. ఇట్టి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంపై వివక్షత చూపిస్తూ పేద ప్రజలకు చేరకుండా అడ్డుకాలు వేసి ఇప్పటివరకు ఈ పథకాన్ని ఎవరికీ చేరువ కాకుండా చేసినారు ఇంతటి దుర్మార్గపు పరిపాలన దొర నిరంకుశ పరిపాలన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టినారు.
![]()
పేద ప్రజలు ఉండడానికి ఇల్లు కట్టుకోవాలని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, పల్లెపకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, సుకన్య సమృద్ధి యోజన, ఫసల్ బీమా యోజన, పిఎం కిసాన్ యోజన, తెలంగాణ రాష్ట్రానికి రహదారులు, నీళ్ల కోసం నిధులు, ఎరువుల కర్మాగారాలు, విద్యుత్ కర్మాగార కేంద్రాలు, విద్య, వైద్యం, ఈ సంజీవని ఆర్గానిక్ మెడిసిన్స్ రకరకాలుగా అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాలు ఇస్తూ రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంపై వివక్షత చూపిస్తూ కేంద్రం నుంచి వస్తున్న పథకాలను ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడం జరుగుతుంది ఇకనైనా కేంద్రం నుంచి వస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పేద ప్రజలకు అందే విధంగా చూడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నారు.
Mar 05 2023, 18:44