కేటీఆర్ నా పేరు ప్రకటించారు.. హుజూరాబాద్‌లో భారాస జెండా ఎగరేస్తా: కౌశిక్‌రెడ్డి
![]()
హైదరాబాద్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో భారాస పార్టీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అక్కడ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించారని తెలిపారు. తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ విప్‌గా కౌశిక్‌రెడ్డి శనివారం తమ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్ తదితరులు హాజరై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘నాకు విప్‌గా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. నాకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలకు ధన్యవాదాలు.
![]()
నాపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ భారాస అభ్యర్థిగా కేటీఆర్ నాపేరును ప్రకటించి, ఇప్పటి నుంచే పని చేయాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తాను. ఈటలను ఇంటికి పంపిస్తాను’’ అని అన్నారు.
శాసనమండలి విప్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కౌశిక్‌రెడ్డి శనివారం రాత్రి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Mar 05 2023, 10:08