/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి Yadagiri Goud
తితిదే ధర్మప్రచార పరిషత్‌ సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి

తిరుమల: ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) తితిదే ధర్మ ప్రచార పరిషత్‌ (TTD) సలహాదారు పదవిని తిరస్కరించారు. తితిదేకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అక్కర్లేదని ఆయన అన్నారు.

‘‘తితిదేకి నా సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తాను’’ అని చాగంటి వ్యాఖ్యానించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జనవరి 20న ధార్మిక పరిషత్‌ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో తితిదే ధార్మిక సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, చాగంటి పదవిని తిరస్కరించిన అంశానికి సంబంధించి తితిదే నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల బడ్జెట్‌ ఆమోదం కోసం సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌..ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత..

రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు అదే రోజు ఆమోదముద్ర వేసింది. అయితే, మరిన్ని అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

సొంత ఇళ్ల స్థలాలు ఉండి.. ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

దీనికి సంబంధించిన విధివిధానాలపై కేబినెట్‌ చర్చించే అవకాశముంది. ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై కేబినెట్‌లో చర్చించే అవకాశముంది. ఈ అంశానికి సంబంధించి.. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించింది. అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశముంది.

సోమవారం నల్గొండ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా

తప్పుల తడాఖాగా డబుల్ బెడ్ రూమ్ వెరిఫికేషన్

భారతీయ జనతా పార్టీ పిలుపు

నల్గొండ పట్టణ ప్రజలు డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు చేసుకున్న వాళ్లకి అండగా నిలుస్తూ సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

కనుక డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తు చేసుకున్న వాళ్లు ప్రతి ఒక్కరు రావలసిందిగా భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుంది. 

భారత్ మాతాకీ జై 

భారతీయ జనతా పార్టీకి జై

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

•బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు అన్నారు.

పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని పేదల ఆరోగ్య ఉచిత వైద్య చికిత్సల కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ప్రారంభించారు.

గ్రామంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అవకాశం కల్పించాలని ఈ యొక్క సదా అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక ఉద్యమంలా ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా అహర్నిశలు కృషి చేయాలని పేద ప్రజల జీవన అభివృద్ధి కోసం మనందరం తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి శక్తి కేంద్రo ఇంచార్జ్ అంతటి వెంకటేష్ గౌడ్ బూత్ కమిటీ అధ్యక్షుడు బత్తుల వెంకన్న గౌడ్, నాగేంద్ర చారి, శ్రీనివాస్, మహేష్, బత్తుల అనిల్ గౌడ్, ఈదుల పవన్, వెంకటేష్,నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Chandrababu Naidu: పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తా..

ఎన్టీఆర్ భవన్ సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్ టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. గత నాలుగేళ్లల్లో టీడీపీ శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై చర్చ జరిగింది..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం అనుసరించవలసిన విధానాలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వైసీపీ నేతల దాడుల్లో తాము పడ్డ ఇబ్బందులను.. లీగల్ సెల్ అందించిన సాయాన్ని సదస్సులో వివరించారు బాధిత కుటుంబాల సభ్యులు. రావణున్ని యుద్దంలో ఓడించడానికి రాముడొక్కడే చాలు..

కానీ ధర్మ పరిరక్షణ కోసం రాముడు అందరి సాయం తీసుకున్నారు. ఉడుత కూడా ధర్మ పరిరక్షణ కోసం సాయం చేసింది. పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తా. అధికార పార్టీకి సహకరించే పోలీసులను హెచ్చరిస్తున్నా. తప్పుడు పనులకు పోలీసులు సహకరించకూడదు. నాలుగేళ్లల్లో విశాఖలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు. విశాఖలో రూ. 40 వేల కోట్లను దోచుకున్నారు. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్నారు. పోర్టు.. భూములను బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని మండిపడ్డారు చంద్రబాబు..

ప్రభుత్వానికి లాయర్ల అవసరం ఉంది.అధికారంలోకి వచ్చాక టీడీపీ లీగల్ సెల్ లాయర్ల సేవలు వినియోగించుకుంటాం.ఇప్పటి వరకు నాపై ఎలాంటి కేసులు లేవు.నాపై కేసులు పెట్టేందుకు ఎవ్వరూ సాహసించ లేదు.ఇప్పుడు నాపై ఎన్ని కేసులున్నాయో నాకే తెలీదు.నాపై ఏమైనా కేసులున్నాయా..? అని డీజీపీకి లేఖ రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు చంద్రబాబు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించాలి.వైసీపీ పతనం ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి.ఓటర్ల జాబితా మొదలుకుని.. ఏజెంట్ల నియామకం వరకు లీగల్ సెల్ సేవలు అవసరం.ఏజెంట్ల నియామకం విషయంలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి.డెకాయిట్లు రాజకీయాల్లో ఉండకూడదంటే.. వచ్చే ఎన్నికల్ని సీరియస్సుగా తీసుకోవాలి.ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్ సేవలు అవసరం అన్నారు చంద్రబాబు..

Bill Gates: మోదీతో మాట్లాడాక.. మరింత ఆశతో ఉన్నా: బిల్‌గేట్స్‌

దిల్లీ: టెక్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. అన్ని రంగాల్లో దేశం పురోగతి చెందుతోందని, సృజనాత్మకత రంగంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి అద్భుతాలు సాధించగలమో చెప్పేందుకు ఈ దేశమే నిదర్శనమని కొనియాడారు..

ఈ సందర్భంగా భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ టెక్నాలజీ గురించి బిల్‌గేట్స్‌ ప్రస్తావించారు. సాంకేతికతతో ప్రభుత్వం పనితీరు మెరుగవుతుందని చెప్పేందుకు గతిశక్తి ఉత్తమ ఉదాహరణ అని అన్నారు. ఇక, జీ-20 (G-20) సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించడంపై స్పందిస్తూ.. ''దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచం ఎలా ప్రయోజనం పొందొచ్చే చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం'' అని ప్రశంసించారు.

''ప్రధానితో మాట్లాడిన తర్వాత.. ఆరోగ్యం, అభివృద్ధి, పర్యావరణ రంగాల్లో భారత్‌ (India) సాధిస్తోన్న పురోగతి గురించి గతంలో కంటే మరింత ఆశావాహ దృక్పథంతో ఉన్నా. మనం సృజనాత్మకత రంగంలో పెట్టుబడులు పెడితే ఏం సాధించగలమో భారత్‌ నిరూపిస్తోంది. ఈ పురోగతి ఇలాగే కొనసాగాలని, భారత్‌ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నా'' అంటూ గేట్స్‌ (Bill Gates) తన బ్లాగ్‌ను ముగించారు.

Kishan Reddy: కుటుంబ పార్టీల కారణంగా ఏపీలో అభివృద్ధి కుంటుపడుతోంది..

Kishan Reddy In Global Investors Summit 2023: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని, కుటుంబ పార్టీల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక్క బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీ ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు.

అయితే.. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పర్యాటక అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని రాజధానిలో నిర్వహించే సభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారన్నారు. ఇదే సమయంలో కిషన్ రెడ్డి నోటి వెంట ఏపీ రాజధాని ప్రస్తావన కూడా వచ్చింది. విశాఖపట్టణం రాజధాని ప్రాంతం అని, జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీగా మాధవ్‌ని ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాధవ్ వంటి వారుంటే.. ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు..

తప్పుల తడకగా డబల్ బెడ్ రూమ్ ల వెరిఫికేషన్
నల్లగొండ పట్టణ 36 వ వార్డులో తప్పుల తడకగా డబల్ బెడ్ రూమ్ ల వెరిఫికేషన్. అధికారుల నిర్లక్ష్య వైఖరి తో సొంత ఇల్లు ఉన్నవారికి ఎలిజిబుల్ లిస్టులో పేరు... అర్హులైన నిరుపేదలకు ఎలిజిబుల్ లిస్టులో దక్కని చోటు?
ఈశాన్య రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించి భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ పథకాలకు ఆకర్షితులై ఈశాన్య రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కి బ్రహ్మరథం

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో ఉరుమడ్ల గ్రామంలో

బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి హర్షం

ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించారు. భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి పథకాలకు ఆకర్షితులై ఈశాన్య రాష్ట్ర ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో త్రిపుర నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తపరిచారు.

ఈ భారత దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఈ ఎన్నికలు నిగ్గు తేల్చాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టిన నరేంద్ర మోడీ గారి దీక్ష దక్షిత భారత దేశంలోని ప్రతి రాష్ట్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని ఈ ఎన్నికల ద్వారా నిరూపించారు. యావత్తు భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ వార్డ్ సభ్యులు రూపాని నరసింహ, ఉయ్యాల లింగస్వామి గౌడ్, పాలకూరి వెంకన్న గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, సుంకరి మల్లేష్ గౌడ్, చింతకాయల రాము, పాకాల దినేష్, పల్లపు వెంకటేష్, పాకాల అర్జున్ తదితరులు పాల్గొన్నారు

Andhra News: ఈనెల 13న ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు

ఈనెల 13న ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు

అమరావతి: ఏపీలో ఈనెల 13న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 13వ తేదీ సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌-సీఈవో) ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు..

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు..