/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి. Yadagiri Goud
శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి.

•విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసు, హత్యా కేసు నమోదు చేయాలి.

•బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడు అవుతాడని భావించిన తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి విద్యాసంస్థల చైర్మన్ బిఎస్ రావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ కళాశాల యాజమాన్య వేధింపులు ఒత్తిడి తట్టుకోలేక ఓ ముక్కు పచ్చలారని విద్యార్థి జీవితం బలయిందన్నారు. పది రోజుల క్రితమే ఉప్పల్ ఫిర్జాదిగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల లో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆత్మహత్య ఘటన మరవకముందే హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన

నాగుల సాత్విక్ అనే ఇంటర్ మీడియట్ చదివే విద్యార్థి తన తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ముక్కు పచ్చలారని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థి సాత్విక్ ను పెద్ద ఎత్తున ఒత్తిడికి గురిచేయడం తిట్టడం కొట్టడం వల్లే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. యాజమాన్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని తక్షణమే శ్రీచైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి...కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం....

•CPI (M-L) న్యూడెమోక్రసీ

కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను అమాంతంగా గృహ వినియోగదారులకు 50/రు,,లు, కమర్ష్యాల్ 350 లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం (బస్టాండ్)వద్ద రాస్తారోకో నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా CPI (ML)న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఇందూరు సాగర్, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్,పాల్గొని మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం రోజు రోజుకు వంట గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే పెట్రోల్,డీజిల్ ధరలను పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు.

పేద,మధ్య తరగతి,సాధారణ ప్రజలు ధరల పెరుగుదలతో హార్దికం ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.దేశభక్తి ముసుగులో దేశ సంపదను కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు,ఆదాని,అంబానీ లాంటి బడా పెట్టుబడి దారులకు కట్టబెడుతూ..ప్రజలకు మాత్రం ధరల భారాన్ని మోపుతున్నారని దుయ్యబట్టారు. గ్యాస్ ధరలు పెంచడం మూలంగా మధ్యతరగతి ప్రజల జీవితాలను హార్దికం గా దెబ్బతింతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి,పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలె పవన్, IFTU జిల్లా నాయకులు బొంగరాల నర్సింహ,సీపీఐ (యం.యల్) న్యూడెమోక్రసీ,IFTU నాయకులు రావుల వీరేష్,కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహా,మామిడాల ప్రవీణ్,నాంపల్లి శంకర్, నర్సింహా,బొమ్మపాల అశోక్,రాంనగర్ శంకర్,మోడీకట్టి సురేందర్, మహేష్,చింత యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.

నాగాలాండ్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు 60 ఏళ్ల తర్వాత తొలిసారి

నాగాలాండ్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు 60 ఏళ్ల తర్వాత తొలిసారి

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అభ్యర్థి గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ఎన్డీపీపీ అభ్యర్థి హేకానీ జఖాలు విజయం సాధించారు. గత 60 ఏళ్లలో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థి గెలుపు ఒక చరిత్ర అని చెప్పుకుంటున్నారు..

ఉరుమడ్ల గ్రామంలో ఘనంగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి జన్మదిన సంబరాలు

•బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ, బువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉరుమడ్ల గ్రామంలో ప్రభుత్వ హాస్టల్ వసతి గృహం లో బిజెపి జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బుద్ధుడు గారు మాట్లాడుతూ మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ గారు ముందు ముందు ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి తెలంగాణ ప్రజలకు అనునిత్యం అందుబాటు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ నిత్యం ప్రజాసేవకే తన జీవితం అంకితం అన్నట్టు ఉండాలని ఆశిస్తూ ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉయ్యాల లింగస్వామి గౌడ్ పాలకూరి వెంకన్న గౌడ్ బూత్ కమిటీ అధ్యక్షుడు ఈధుల పవన్ చింతకాయల రాము కొండ మహేష్ గౌడ్ సుంకరి మల్లేష్ గౌడ్ గుంటూరు పవన్ రావుల దినేష్ మరియు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

MLC kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దిల్లీలో దీక్ష చేస్తా : కవిత

హైదరాబాద్‌: మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా రిజర్వేషన్ బిల్లు (Women reservation bill)ను పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) డిమాండ్‌ చేశారు..

ఈ అంశంపై భాజపా తన ఎన్నికల ప్రణాళికలో రెండుసార్లు హామీ ఇచ్చి మాట తప్పుతోందని ఆమె ఆరోపించారు. ఇందుకు నిరసనగా భారత జాగృతి ఆధ్వర్యంలో దిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఈనెల 10వ తేదీన ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు కవిత ప్రకటించారు..

''అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న దీక్ష చేపడదామనుకుంటే హోలీ పండగ ఉన్నందున 10వ తేదీన దీక్ష చేపడుతున్నా. ఈ దీక్షకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నాం. మార్చి 13 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సెషన్‌లోనే మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తామని భాజపా నేతలు చెప్పారు. 2019లో కూడా అదే మాట చెప్పి విస్మరించారు. భాజపా అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా జనాభా గణనను చేపట్టకపోవడం చాలా దురదృష్టకరం'' అని కవిత అన్నారు.

Ganta Srinivasa Rao: రాజధానే లేనప్పుడు పెట్టుబడిదారులకు నమ్మకం ఎలా?: గంటా

విశాఖపట్నం: రేపటి నుంచి విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్‌కు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు..

పెట్టుబడుల సదస్సుకు ముందు కొన్ని ప్రశ్నలను సీఎంకు ఆయన సంధించారు. రాష్ట్రానికి రాజధానే లేనప్పుడు పెట్టుబడిదారులకు నమ్మకం ఎలా వస్తుందని గంటా ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 'లులు', 'అమర్‌రాజా' వంటి సంస్థలను వెళ్లగొట్టామని చెప్తారా? అని వ్యంగ్యంగా ఆయన వ్యాఖ్యానించారు..

అదానీ డేటా సెంటర్‌కు గతంలోనే శంకుస్థాపన జరిగినప్పటికీ ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

అదే కంపెనీకి మళ్లీ భూమి కేటాయించడం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలే ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. పెట్టుబడుల సదస్సు పేరుతో హడావుడి వెనుక కారణాలేంటో ప్రజలకు వివరించాలన్నారు..

'ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు'

న్యూఢిల్లీ: ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను కేంద్రం ప్రశంసించిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు..

జియో ట్యాగ్ సిస్టం ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ పీడీఎస్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.

'రైస్ మిల్లులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బియ్యం రీసైకిల్ కాకుండా చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు డబ్బులు మూడు రోజులలో రైతుల ఖాతాలలో వేస్తున్నాం. రూ.1,702 కోట్ల పాత బకాయిలు చెల్లింపునకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేరళ కోసం జయ బొండం బాయిల్డ్ రైస్‌కు కేంద్రం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చింది. ఒక లక్ష అంత్యోదయ కార్డుల మంజూరుకు కేంద్రం ఒప్పుకుంది..

రైతులకు ధాన్యం డబ్బులు ఎప్పటికప్పడు ఇస్తున్నాం. కేంద్రం సకాలంలో చెల్లింపులు చేస్తోంది. రేషన్ కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి కూడా ఇస్తున్నాం. వచ్చే రెండు నెలల్లో జొన్నలు, రాగులు కూడా పీడీఎస్ కింద సరఫరా చేస్తాం. పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా దాడులు చేస్తున్నాం. రేషన్ కార్డులు తొలగించం. పార్టీలు, కులాలు చూడకుండా పథకాలు ఇస్తున్నాం.' అని కారుమూరి పేర్కొన్నారు..

Yuvagalam-Nara Lokesh: తెదేపా అధికారంలోకి వస్తే ముస్లింలకు 'ఇస్లామిక్‌ బ్యాంక్‌': నారా లోకేశ్‌

చంద్రగిరి: తెదేపా (TDP) అధికారంలోకి వస్తే ముస్లింకు ఆర్థికంగా అండగా ఉంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు..

'యువగళం' పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ముస్లింలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెదేపా అధికారంలోకి రాగానే ముస్లింల కోసం ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని లోకేశ్‌ ప్రకటించారు. జగన్‌ పాలనలో ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేశారని..

ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు సీఎం అవ్వగానే గతంలో ఇచ్చిన విధంగా రంజాన్‌ తోఫా, దుల్హన్‌, విదేశీ విద్య సహా అన్ని రకాల సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని లోకేశ్ తెలిపారు.

Supreme Court: అమరావతి కేసులపై విచారణ మార్చి 28నే.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

దిల్లీ: రాజధాని అమరావతి(Amaravati)కి సంబంధించిన కేసుల అంశంలో ఏపీ ప్రభుత్వానికి (AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది..

విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి చేసిన విజ్ఞప్తిని.. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది వరకు పేర్కొన్నట్లుగా మార్చి 28నే విచారణ చేపడతామని తేల్చిచెప్పింది. 28వ తేదీ ఒక్కటే సరిపోదని.. మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. మార్చి 29, 30 తేదీలు బుధ, గురువారాలని.. నోటీసులు ఇచ్చిన కేసులను ఆ తేదీల్లో విచారణ జరపరాదని ధర్మాసనం తెలిపింది. దీనిపై సీజేఐ సర్క్యులర్‌ ఉందని గుర్తుచేసింది. ఆ రెండు రోజుల్లో విచారణ తన చేతుల్లో లేదని.. ఆ విషయంలో సీజేఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ చెప్పారు..

అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని.. అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ అన్నారు. అలా చేస్తేనే సార్థకత ఉంటుందని చెప్పారు. దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయన్నారు. అంతకుమించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా ధర్మాసనం నిరాకరించింది.

అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గత సోమవారమే జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. స్పందించిన ధర్మాసనం మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 3 రోజులు తిరగక ముందే మరోసారి కేసులు త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు..

Election Results: నాగాలాండ్‌, త్రిపురలో భాజపా హవా.. హంగ్‌ దిశగా మేఘాలయ

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya)లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి.

ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. త్రిపుర, నాగాలాండ్‌లో భాజపా (BJP) హవా కొనసాగుతుండగా.. మేఘాలయ ఫలితం మాత్రం హంగ్ దిశగా ఉంది. ఉదయం 9.45 గంటల వరకు వెలువడిన ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా ఉన్నాయి.

✧ త్రిపుర (Tripura)లో భాజపా కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ (Congress)- వామపక్షాల కూటమి 19 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ (తిప్రా మోథ్రా పార్టీ) 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది..

✧ నాగాలాండ్‌ (Nagaland)లో భాజపా (BJP)-ఎన్‌డీపీపీ (NDPP) కూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. ఇప్పటి వరకు ఈ కూటమి ఒక చోట విజయం సాధించగా.. మరో 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్‌ 6, కాంగ్రెస్‌ 1, ఎన్‌పీపీ 3, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.

✧ మేఘాలయ (Meghalaya)లో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఇక్కడ సీఎం కాన్రాడ్‌ సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ 15, తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) 15 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఇతరులు 16 స్థానాల్లో, భాజపా 6, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ 31 సీట్లు.