/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Yuvagalam-Nara Lokesh: తెదేపా అధికారంలోకి వస్తే ముస్లింలకు 'ఇస్లామిక్‌ బ్యాంక్‌': నారా లోకేశ్‌ Yadagiri Goud
Yuvagalam-Nara Lokesh: తెదేపా అధికారంలోకి వస్తే ముస్లింలకు 'ఇస్లామిక్‌ బ్యాంక్‌': నారా లోకేశ్‌

చంద్రగిరి: తెదేపా (TDP) అధికారంలోకి వస్తే ముస్లింకు ఆర్థికంగా అండగా ఉంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు..

'యువగళం' పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ముస్లింలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెదేపా అధికారంలోకి రాగానే ముస్లింల కోసం ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని లోకేశ్‌ ప్రకటించారు. జగన్‌ పాలనలో ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేశారని..

ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు సీఎం అవ్వగానే గతంలో ఇచ్చిన విధంగా రంజాన్‌ తోఫా, దుల్హన్‌, విదేశీ విద్య సహా అన్ని రకాల సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని లోకేశ్ తెలిపారు.

Supreme Court: అమరావతి కేసులపై విచారణ మార్చి 28నే.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

దిల్లీ: రాజధాని అమరావతి(Amaravati)కి సంబంధించిన కేసుల అంశంలో ఏపీ ప్రభుత్వానికి (AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది..

విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి చేసిన విజ్ఞప్తిని.. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది వరకు పేర్కొన్నట్లుగా మార్చి 28నే విచారణ చేపడతామని తేల్చిచెప్పింది. 28వ తేదీ ఒక్కటే సరిపోదని.. మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. మార్చి 29, 30 తేదీలు బుధ, గురువారాలని.. నోటీసులు ఇచ్చిన కేసులను ఆ తేదీల్లో విచారణ జరపరాదని ధర్మాసనం తెలిపింది. దీనిపై సీజేఐ సర్క్యులర్‌ ఉందని గుర్తుచేసింది. ఆ రెండు రోజుల్లో విచారణ తన చేతుల్లో లేదని.. ఆ విషయంలో సీజేఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ చెప్పారు..

అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని.. అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ అన్నారు. అలా చేస్తేనే సార్థకత ఉంటుందని చెప్పారు. దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయన్నారు. అంతకుమించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా ధర్మాసనం నిరాకరించింది.

అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గత సోమవారమే జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. స్పందించిన ధర్మాసనం మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 3 రోజులు తిరగక ముందే మరోసారి కేసులు త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు..

Election Results: నాగాలాండ్‌, త్రిపురలో భాజపా హవా.. హంగ్‌ దిశగా మేఘాలయ

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya)లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి.

ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. త్రిపుర, నాగాలాండ్‌లో భాజపా (BJP) హవా కొనసాగుతుండగా.. మేఘాలయ ఫలితం మాత్రం హంగ్ దిశగా ఉంది. ఉదయం 9.45 గంటల వరకు వెలువడిన ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా ఉన్నాయి.

✧ త్రిపుర (Tripura)లో భాజపా కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ (Congress)- వామపక్షాల కూటమి 19 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ (తిప్రా మోథ్రా పార్టీ) 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది..

✧ నాగాలాండ్‌ (Nagaland)లో భాజపా (BJP)-ఎన్‌డీపీపీ (NDPP) కూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. ఇప్పటి వరకు ఈ కూటమి ఒక చోట విజయం సాధించగా.. మరో 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్‌ 6, కాంగ్రెస్‌ 1, ఎన్‌పీపీ 3, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.

✧ మేఘాలయ (Meghalaya)లో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఇక్కడ సీఎం కాన్రాడ్‌ సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ 15, తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) 15 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఇతరులు 16 స్థానాల్లో, భాజపా 6, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ 31 సీట్లు.

Global Investors' Summit: హై సెక్యూరిటీ జోన్‌గా మారిపోయిన విశాఖ.. ట్రాఫిక్‌ ఆంక్షలు

Global Investors' Summit: ఆంప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం..

ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మంత్రులు, కార్పొరేట్‌ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి.. నిన్న ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000 కిపైగా నమోదు కావడం గమనార్హం.

దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది.. ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు.

మార్చి 3న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశాల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొనబోతున్నారు..

Hyderabad: బట్టలు విప్పి.. బెల్టుతో కొడుతూ.. రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్‌ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు..

కిరాణా దుకాణంలో కూర్చున్న బాలుడిని బలవంతంగా సమీపంలోని గుట్టల వద్దకు తీసుకెళ్లారు. గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడి బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారు. గంజాయి గ్యాంగ్‌ నుంచి ఎలాగో తప్పించుకొని బాలుడు తన ఇంటికి చేరుకున్నాడు.

ఒంటిపై గాయాలు చూసిన బాలుడి కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్‌తోపాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ''నీకు దిక్కున్న చోట చెప్పుకో.. ఇప్పటికే ఇద్దరిని హత్య చేశాం'' అని గ్యాంగ్‌ సభ్యులు బాలుడిని బెదిరించినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు.

ఉమెన్స్‌ డే సందర్భంగా దేశ మహిళలకు మోదీ కానుక ఇదేనా?: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: గ్యాస్‌ ధరల (Gas cylinder Price) పెంపునకు నిరసనగా ఎల్లుండి (శుక్రవారం) అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ (Minister KTR) పిలుపునిచ్చారు.

మంత్రులు, భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా దేశ మహిళలకు కానుకగా ప్రధాని మోదీ (PM Modi) సిలిండర్‌ ధరలు (Gas Cylinder) పెంచారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే గ్యాస్‌ ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఆరోపించారు.

గృహావసరాల సిలిండర్‌ ధరను రూ.50, కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.350 మేర పెంచడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.1200లకు చేరుకుందన్నారు. పెరుగుతున్న గ్యాస్‌, నిత్యావసర సరకుల ధరలతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పార్టీ నేతలకు కేటీఆర్‌ వివరించారు.

ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా, కేంద్రాన్ని నిలదీస్తూ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం ధరలు పెంచుతున్న తీరును ప్రజలకు వివరించాలన్నారు. ఒకవైపు ఉజ్వల స్కీం పేరుతో మాయ మాటలు చెప్పిన భాజపా ప్రభుత్వం.. మరోవైపు గ్యాస్‌ ధరలను భారీగా పెంచుతూ ప్రజలకు సిలిండర్‌ను దూరం చేస్తోందని మండిపడ్డారు. ఉజ్వల పథకంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళ కూడా ఇప్పుడు సిలిండరు కొనలేక పొయ్యిపై వంట చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

TS: మోడల్‌ స్కూళ్ల దరఖాస్తు గడువు పెంపు

TS: మోడల్‌ స్కూళ్ల దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు గడువును మూడోసారి పెంచారు.

ఇంతకు ముందు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. తాజాగా దాన్ని ఈనెల 8వ తేదీ వరకు మరోసారి పొడిగించినట్లు ఆదర్శ పాఠశాలల అదనపు సంచాలకురాలు ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 64,350 మంది దరఖాస్తు చేశారని ఆమె పేర్కొన్నారు.

మూడు రాష్ట్రాల ఎన్నికలు.. కాసేపట్లో కౌంటింగ్‌

అగర్తల: మూడు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయల్లో ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. నాగాలాండ్‌, మేఘాలయల్లో ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ సీటు ఏకగ్రీవమయ్యాయి. నాగాలాండ్‌లో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 4 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది.

బుధవారం ఈ స్టేషన్లలో రీపోలింగ్‌ జరిగింది. నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించిన 59 సీట్లకు 183 మంది పోటీ పడ్డారు. 

మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్‌ జరిగింది. ఎన్నికల్లో 259 మంది పోటీ పడ్డారు.

గంజాయి కేసులో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ 6 కేజీల గంజాయి స్వాధీనం:

•నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో

గత కొంతకాలంగా నలగొండ పట్టణంలో గంజాయికి బానిసై, జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలని ఐదుగురు యువకులు పథకం వేసి ఒరిస్సా నుండి తెచ్చి లోకల్ లో అమ్మాలని నిర్ణయించుకున్నారు .

ఈ రోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు విద్యుత్ నగర్ కాలనీలోని ఒక రూమ్ లో యువకులు గంజాయి అమ్ముతున్నారని సమాచారం రాగా, నల్గొండ టూ టౌన్ సిఐ చంద్ర శేకర్ రెడ్డి ఆదేశాను సారం నలగొండ టూ టౌన్ SI లు రాజశేఖర్ రెడ్డి ,సైదులు వారి సిబ్బంది శంకర్ ,బాలకోటి , సత్యనారాయణ వెళ్లి అక్కడ ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, రాకను గమనించి పారిపోతుండగా వెంబడించి పట్టుకొని విచారించి 3kg ల గంజాయి స్వాధీనం చేసుకుని, MRO నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించడం జరిగింది.

వారు చెప్పిన వివరాల ప్రకారం అర్జల బావి దాబా దగ్గర గల ఒక రూములో మరొక ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి మరొక 3 Kg ల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

అరెస్టు కాబడిన వ్యక్తుల వివరాలు

(1) బోట్ల విశ్వంత్ తండ్రి కృష్ణయ్య గ్రామం: వూత్కుర్ , శాలిగౌరారం,

(2) విశ్వనాధుల ఈశ్వర్ తండ్రి Late, బ్రహ్మచారి ,R/o శ్రీరామ్ నగర్, కాలనీ నల్గొండ

(3) వాడపల్లి శివ తండ్రి రాములు ,R/o గాంధీనగర్ ,నల్గొండ

(4) గోసుకొండ శివ తండ్రి జనార్ధన్ R/o పానగల్, నల్గొండ

(5) కొక్కు రమేష్ తండ్రి బిక్షపతి R/o శ్రీరామ్ నగర్ కాలనీ నల్గొండ.

వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపనయినది.

పట్టణ ప్రజలకు విజ్ఞప్తి

మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఏవైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే 100 నెంబర్ కు గాని పోలీస్ స్టేషన్కు గాని తెలియచేయగలరు.

ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతాం: ఏపీ డీజీపీ

తూర్పుగోదావరి: గత ఏడాది వ్యవధిలో 77 వేల కేసులు తగ్గించామని, రాష్ట్రంలో పోలీసు శాఖపై ప్రజలకు విశ్వసనీయత పెరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

బుధవారం ఆయన రాజమండ్రిలో పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మహిళా పోలీసులతో చిన్న గొడవలు పరిష్కారం అవుతున్నాయన్నారు.

''శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీసుల పని అని, ప్రతిపక్షాల గొంతుకు మేమెందుకు నొక్కుతామని డీజీపీ ప్రశ్నించారు.

నిర్దేశించిన ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాలని సూచించాం. ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామన్నారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్నారు.