' చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి '
NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మునుగోడు నియోజకవర్గంలోని పలు మండలాలలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమాలలో భాగంగా
మర్రిగూడ మండల కేంద్రంలోని శ్రీ విజయ గార్డెన్స్ లో, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మాధగోని మధు.. సోదరుడు మాధగోని సైదులు–దీపిక దంపతుల చిన్నారుల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారులను ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మేతరి యాదయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రవీందర్ రావు, రాంరెడ్డిపల్లి సర్పంచ్ లపంగి నర్సింహ, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల రాములు గౌడ్,
మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాధగోని కృష్ణయ్య, బినమోని యాదయ్య, కారింగు నరసింహ, మాతంగి నవీన్, మాధగోని మహేష్ గౌడ్, సెలివేరు యాదయ్య మల్లోజి ,సిరిపంగి శ్రీనివాస్, వల్లముల మణి, తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
Oct 12 2026, 20:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.6k