నేడు కార్తిక పౌర్ణమి..! భక్తులతో కిటకిటలాడునున్న శివాలయాలు.
తెలంగాణ/ఆంధ్రప్రదేశ్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు వేముల వాడ, కాలేశ్వరం, ధర్మపురి, వంటి దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ఇక, శివాలయాల్లో అయితే దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తున్నారు. సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అర్చిస్తారు. కానీ.. కార్తీక మాసంలో ప్రతి రోజు లక్ష్మీదేవిని ఆరాధి స్తుంటారు. ఈ తరుణంలో మహిళలందరూ ఎదురు చూస్తున్న కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 05వ తేదీన వచ్చింది. అంటే.. కార్తీక పౌర్ణమి.ఈ రోజు చాలా విశిష్టమైన రోజు కాబట్టి కొన్ని ఆచారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ తరుణంలో దేవాలయంలో కానీ, రావి లేదా తులసి చెట్టు వద్ద గానీ, నదీతీరంలో 365 వత్తులతో దీపారాధన చేస్తే మంచిదని పురణాలు చెబుతున్నాయి. అంతేకాదు.. పగలంతా ఉపవాసం ఉండి.. సూర్యా స్తమయంలో దీపారాధన చేసి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధన గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కార్తీక పౌర్ణమి తో పాటు గురు నానక్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.

ఆసిఫాబాద్ జిల్లా : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రం తో పాటు ఎలుక పెళ్లి, ఏటి గూడ గ్రామాల్లో మంగళవారం డ్రై డే పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి తుకారాం మాట్లాడుతూ వారంలో రెండు రోజులు అనగా మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమంలో భాగంగా నీరు నిల్వ ఉండే పాత్రతో పాటు ప్రదేశాలను శుభ్రం చేయాలని సూచించారు. నీరు నిల్వ ఉండడంతో క్రిమి కీటకాలు దోమలు వృద్ధి చెంది వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు ఇట్టి కార్యక్రమాన్ని ఇంటి పరిసర ప్రాంతాల్లో తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి తుకారంతోపాటు అంగన్వాడి కార్యకర్తలు తిరుపతమ్మ ,ఆశా కార్యకర్తలు సునీత ,బానక్క, శారద సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా ;కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమీని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం పెంచికలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం వైద్య అధికారి సిబ్బంది తో కలిసి నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 130 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యాధికారి సతీష్ ,మెడికల్ ఆఫీసర్ అనర్ది హాల్దార్ ,ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజు, ఫార్మసిస్ట్ రమేష్ ,హెచ్ వి ధర్మారావు ఏఎన్ఎంలు హేరా లక్ష్మి ,సునీత ,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పండ్రం బిక్షమయ్య ,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల అన్నారు. సోమవారం కాగజ్ నగర్ లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కొరకు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు సమన్వయంతో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో 66 దరఖాస్తులు అందాయని, వీటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణ కేంద్రం లోనీ ఎమ్మెల్సీ నివాసంలో గురువారం రోజున ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానీకి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు అర్షద్ హుస్సేన్ కొండపల్లి మాజీ సర్పంచ్ సుధాకర్ కోట శంకర్ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
బలవంతంగా వినాయకుని చందా..!
Nov 05 2025, 09:48
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1