నేడు కార్తిక పౌర్ణమి..! భక్తులతో కిటకిటలాడునున్న శివాలయాలు.
తెలంగాణ/ఆంధ్రప్రదేశ్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు వేముల వాడ, కాలేశ్వరం, ధర్మపురి, వంటి దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. ఇక, శివాలయాల్లో అయితే దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తున్నారు. సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అర్చిస్తారు. కానీ.. కార్తీక మాసంలో ప్రతి రోజు లక్ష్మీదేవిని ఆరాధి స్తుంటారు. ఈ తరుణంలో మహిళలందరూ ఎదురు చూస్తున్న కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 05వ తేదీన వచ్చింది. అంటే.. కార్తీక పౌర్ణమి.ఈ రోజు చాలా విశిష్టమైన రోజు కాబట్టి కొన్ని ఆచారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ తరుణంలో దేవాలయంలో కానీ, రావి లేదా తులసి చెట్టు వద్ద గానీ, నదీతీరంలో 365 వత్తులతో దీపారాధన చేస్తే మంచిదని పురణాలు చెబుతున్నాయి. అంతేకాదు.. పగలంతా ఉపవాసం ఉండి.. సూర్యా స్తమయంలో దీపారాధన చేసి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధన గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కార్తీక పౌర్ణమి తో పాటు గురు నానక్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.
Nov 05 2025, 08:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.4k