ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ని కిమ్స్ మల్టిస్పెషలిటీ ఆసుపత్రిలో శ్రీ కొత్తపల్లి వెంకట లక్ష్మీ - చంద్రయ్య మెమోరియల్ సర్విస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలకు 26 మంది హాజరు కాగా వారిలో 9 మందికి శస్త్రచికిత్స అవసరమని ఈ సందర్భంగా డా. కొత్తపల్లి శ్రీనివాస్  మాట్లాడుతూ కంటి పరీక్షలకు వచ్చిన వృద్దులను అధైర్య పడవద్దని లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్ లు చేపిస్తామని ఈ ఉచిత కంటి శిబిరం ప్రతి మంగళవారం నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని ప్రజాలందురు సద్వినియోగ పర్చుకోగలరని అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్తమలజిస్ట్ శ్రీనాథ్, ఐ క్యాంప్ ఇన్చార్జి గోపి పాల్గొన్నారు.
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి: ఏవో.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : సబ్సిడీ వరి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగజ్ నగర్ వ్యవసాయ అధికారి రామకృష్ణ అన్నారు. మంగళవారం కాగజ్నగర్లోని పీఏసీఎస్లో చైర్మన్ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన వరి విత్తనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తోందన్నారు. సాగు విషయంలో ఏ సందేహాలున్నా అధికారులను సంప్రదించి, అధిక దిగుబడి పొందాలని సూచించారు.

బెజ్జూర్ లో డ్రై డే పై అవగాహన.


ఆసిఫాబాద్ జిల్లా : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రం తో పాటు ఎలుక పెళ్లి, ఏటి గూడ గ్రామాల్లో మంగళవారం డ్రై డే పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి తుకారాం మాట్లాడుతూ వారంలో రెండు రోజులు అనగా మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమంలో భాగంగా నీరు నిల్వ ఉండే పాత్రతో పాటు ప్రదేశాలను శుభ్రం చేయాలని సూచించారు. నీరు నిల్వ ఉండడంతో క్రిమి కీటకాలు దోమలు వృద్ధి చెంది వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు ఇట్టి కార్యక్రమాన్ని ఇంటి పరిసర ప్రాంతాల్లో తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి తుకారంతోపాటు అంగన్వాడి కార్యకర్తలు తిరుపతమ్మ ,ఆశా కార్యకర్తలు సునీత ,బానక్క, శారద సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సోమినీ గిరిజన పాఠశాల లో వైద్య శిబిరం.


ఆసిఫాబాద్ జిల్లా ;కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమీని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం పెంచికలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం వైద్య అధికారి సిబ్బంది తో కలిసి నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 130 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలని పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యాధికారి సతీష్ ,మెడికల్ ఆఫీసర్ అనర్ది హాల్దార్ ,ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజు, ఫార్మసిస్ట్ రమేష్ ,హెచ్ వి ధర్మారావు ఏఎన్ఎంలు హేరా లక్ష్మి ,సునీత ,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పండ్రం బిక్షమయ్య ,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తాం: సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల.


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా :  ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల అన్నారు. సోమవారం కాగజ్ నగర్ లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కొరకు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు సమన్వయంతో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో 66 దరఖాస్తులు అందాయని, వీటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకుడు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణ కేంద్రం లోనీ ఎమ్మెల్సీ నివాసంలో గురువారం రోజున ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానీకి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు అర్షద్ హుస్సేన్ కొండపల్లి మాజీ సర్పంచ్ సుధాకర్ కోట శంకర్ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

బలవంతంగా వినాయకుని చందా.. అడిగినంత ఇవ్వకుంటే చెప్పులతో దాడి..!

బలవంతంగా వినాయకుని చందా..!


అడిగినంత ఇవ్వకుంటే చెప్పులతో దాడి..!


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : సిర్పూర్ నియోజక వర్గం లోని వెంకట్రావ్ పెట్ గ్రామం నుండి మహారాష్ట్రకు వెళ్ళే అంతరాష్ట్ర మార్గంలో అదే గ్రామానికి చెందిన యువకులు వచ్చేవాళ్ళ దగ్గర,పోయేవారి దగ్గర వినాయకుని పేరు మీద బలవంతంగా చందాలు వసూలు చేస్తున్నారు.అడిగినంత ఇవ్వకుంటే దాడి చేస్తున్నారు. గురువారం రోజున కౌటాల మండలం గుడ్లభోరి గ్రామానికి చెందిన ధంద్రే బాలాజీ, శంకర్ లు వైద్యం కోసం చంద్రపూర్ వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వాహన్నాని ఆపి వినాయకుని చందా ఇవ్వాలి అని అడిగారు.సదరు ప్రయాణికులు మా దగ్గర మీరు అడిగినన్ని డబ్బులు లేవు ఎంతో కొంత ఇస్తామంటే, చందాదారులు ఆగ్రహించి రాళ్ళతో, చెప్పులతో దాడి చేసారు. ఇది ఎంతవరకు న్యాయమో గ్రామస్తులే చెప్పాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు భాదితులు దాడి చేసిన వారిపై పిర్యాధు చేశారు.

నేతన్నల మేలు కోసం రుణమాఫీ, నేతన్నల హర్షం. ముఖ్యమంత్రి, మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం


కాగజ్ నగర్,సెప్టెంబర్11 : రాష్ట్రం లోని నేతన్నల మేలు కోసం రుణ మాఫీ ప్రకటించడం, ఇండియన్ ఇన్స్టట్యూట్ ఆఫ్ హ్యండ్లుమ్స్ కు పద్మశాలి బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం గొప్ప విషయమని, దీనికి చొరవ చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పద్మశాలి లు రుణపడి ఉంటానని పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర నాయకులు నల్లా కనకయ్య అన్నారు. రుణమాఫీ తో పాటు చేనేత కార్మికుల అభ్యున్నతికి నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా బుధవారం రోజున కాగజ్ నగర్ మండలం లోని కోసిని బెజ్జుర్ చేనేత సహకార సంఘం అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలాభిషేకం చేశారు. వారు చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు, పద్మశాలీలు పాల్గొన్నారు.
టైరు పేలి బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ కారు
అదిలాబాద్ జిల్లా: సెప్టెంబర్09 కారు ముందు టైర్లు పేలి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది ఈ సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి అదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడింది. ఈ సంఘటన లో ఆరుగు రికి తీవ్రంగా గాయాలయ్యా యని పోలీసులు తెలిపారు ఇక వెంటనే అక్కడికి చేరు కున్న పోలీసులు.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది...

అదిలాబాద్ జిల్లా: సెప్టెంబర్09 కారు ముందు టైర్లు పేలి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది ఈ సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి అదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ

టైరు పేలి బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ కారు