చట్టాలపై అవగాహణ సదస్సు
నల్గొండ: పట్టణంలోని అరోర లీగల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్గొండ  సహకారంతో కళాశాలలో శనివారం లీగల్ సర్వీసెస్ అథారిటి న్యాయ సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో థర్డ్ ఏడిజె మరియు ఫ్యామిలీ కోర్టు జడ్జ్ దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులకకు లీగల్ సర్వీసెస్ పై, కోర్టు వ్యవహారాలపై విస్తృతమైన అవగాహన కల్పించారు.

DLSA సెక్రటరీ, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ బి.దీప్తి, NALSA స్కీమ్స్ గురించి వివరిస్తూ, న్యాయవాద వృత్తిలో పాటించవలసిన నియమాలను క్లుప్తంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యాదగిరి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ధనలక్ష్మి, శ్రీనివాస్, కళాశాల విద్యార్థులు, జిల్లా కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ: మీడియా సమాజానికి అద్దం లాంటిదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి చౌరస్తాలో జిల్లా ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు.

ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో మంచి తో పాటు కొన్ని లోపాలు ఉంటాయని.. వాటిని తమ దృష్టికి తీసుకువస్తే  జిల్లా యంత్రాంగం తరఫున తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీడియా సమాజానికి పారదర్శకంగా, స్ఫూర్తితో పనిచేసి సమాజానికి మంచి చేసేందుకు కృషి చేయాలన్నారు.

మీడియా ప్రతినిధులకు సంబంధించిన సమస్యలను  సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని, జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయం తనతో పాటు, రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టిలో ఉందని, ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాకు శాశ్వత ప్రెస్ క్లబ్ భవనం వస్తుందని అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర్లు, నల్గొండ ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గౌరవాధ్యక్ష్యులు కృష్ణారెడ్డి, ట్రెజరర్ గుండాల యాదగిరి, సీనియర్ పాత్రికేయులు, పలువురు బ్యూరో రిపోర్టర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: లబ్ధిదారునికి సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, దామెర భీమనపల్లి  గ్రామానికి చెందిన మాడుగుల శ్రీను కు  33,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కు.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  సహకారంతో మంజూరు అయ్యింది. శనివారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గొడ్డేటి నరసింహ ద్వారా లబ్ధిదారుడు మాడుగుల శ్రీను కు సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.

కార్యక్రమంలో మునగాల జగ్గల్ రెడ్డి, జిల్లా శంకర్, మలిగిరెడ్డి వెంకటరెడ్డి, ఎలుగపల్లి లింగయ్య, సిలువేరు నరేష్, మునగాల అంతిరెడ్డి, కర్నాటి యాదయ్య, మామిడి ప్రేమ్ కుమార్, గొడేటి శివ తదితరులు పాల్గొన్నారు.
NLG: సదర్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మునుగోడు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శుక్రవారం, మునుగోడు మండల గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదర్ ఉత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కు గొల్ల కురుమ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.. యాదవ సోదరులతో కలిసి సంప్రదాయబద్ధంగా దున్నపోతును ఆడించి యాదవ సోదరులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. యాదవ సోదరులు నీతికి నిజాయితీకి మారుపేరని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలలో యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో గొల్ల కురుమ సంఘ భవనం కోసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి స్థలం కేటాయింపు జరిగేలా చూస్తానని, భవన నిర్మాణానికి తనవంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, రాజ్ గోపాల్ రెడ్డి అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

NLG: దైవ చింతనతో మానసిక ప్రశాంతత: పులిమామిడి నరసింహారెడ్డి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామంలో అయ్యప్ప స్వాములు  పడి లేదని భక్తులు అడిగిన వెంటనే 18 మెట్ల ఇత్తడి పడి, అయ్యప్ప విగ్రహం, దీపం, చమ్మ లను 38,000 రూపాయలు ఖర్చు చేసి, శుక్రవారం యరగండ్లపల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పులిమామిడి నరసింహారెడ్డి, ఏడుదోడ్ల కృష్ణా రెడ్డి ఇప్పించారు.

ఈ మేరకు పులిమామిడి నరసింహారెడ్డి మాట్లాడుతూ..  దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.

యరగండ్లపల్లి గ్రామములో దైవ కార్యము అంటే ముందుండే మొదటి వ్యక్తి పులిమామిడి నరసింహారెడ్డి 
అతనికి, వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుచూ అయ్యప్ప స్వాములు నరసింహ రెడ్డి, కృష్ణా రెడ్డి లను శాలువాతో సత్కరించి సన్మానించారు.

కార్యక్రమంలో పలువురు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.
NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రులు
నల్గొండ: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం మండలంలోని కొత్తపల్లి గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి, సత్వరమే రైతులకు డబ్బులు చెల్లించడం పట్ల మంత్రులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ అద్భుతంగా ఉందన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.
NLG: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్
మునుగోడు నియోజకవర్గం,మర్రిగూడ మండలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  సహకారం తో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, శుక్రవారం మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ పంపిణి చేశారు.                                                                        

యరగండ్లపల్లి గ్రామవాసి వాస భారతమ్మ భర్త నర్సింహ కు రూ. 60,000/-, తమ్మడపల్లి గ్రామవాసి కొట్టం కవిత భర్త జంగయ్య కు రూ. 60,000/- చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మర్రిగూడ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు వీరగోని వెంకటేష్, తమ్మడపల్లి మాజీ సర్పంచ్ కొట్టం మాధవి రమేష్,వీరగోని కృష్ణయ్య, కొట్టం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి
నల్గొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల మరియు  ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో విద్యార్థులకు త్రాగునీరు కోసం, కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సౌజన్యంతో..  వాటర్ ప్లాంట్, వాటర్ కూలర్ లను ఏర్పాటు చేసి శుక్రవారం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ చేయూత
నల్లగొండ జిల్లా:
గుర్రంపోడు: మండలంలోని కొప్పోలు, నడికూడ,చేపూర్,పాల్వాయి,గుర్రంపోడ్,తేనెపల్లి,పోచంపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, గురువారం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్  కస్తూరి శ్రీ చరణ్ చేతుల మీదగా నోట్ బుక్స్, స్టేషనరీ సామగ్రి ,గ్రామర్ బుక్స్,డిక్షనరీ వంటి విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు శ్రీ చరణ్ ను ఘనంగా సన్మానించారు. శ్రీ చరణ్  మాట్లాడుతూ.. పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుండి అనేక  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కస్తూరి ఫౌండేషన్ ద్వారా ఒక విద్యారంగాన్ని బాగుపర్చడమే కాకుండా వివిధ రంగాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.

మన ఊరి బడులను మనమే బాగుపర్చుకోవాలని,తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందన్నారు.మనలో బలమైన సంకల్పం ఉంటే ఏదైన సాధించగలమని, అదే సంకల్పంతో విద్యార్థులు కష్ట పడి చదివితే మంచి మార్కులు సాధిస్తారు అని తెలిపారు. ఈ మేరకు ఉపాధ్యాయులు శ్రీ చరణ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మహేష్, నవీన్ రెడ్డి నరేందర్ రెడ్డి, జహంగీర్,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు, ముక్కముల సైదులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: జిల్లా సభ, రాష్ట్ర సభలను విజయవంతం చేయాలి: దళిత రత్న నూనె సురేష్
నల్గొండ జిల్లా:
నవంబర్ 23 న నల్లగొండ పట్టణ కేంద్రంలో జరిగే మాల-మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం మరియు డిసెంబర్ 1 న చలో హైదరాబాద్ 'మాలల సింహ గర్జన' విజయవంతం చేయాలని దళిత రత్న అవార్డు గ్రహీత, అడ్వకేట్ నూనె సురేష్, అసెంబ్లీ ఎన్నికల కంటస్టెడ్ అభ్యర్థి అన్నారు.

గురువారం దేవరకొండ మండలం, తూర్పుపల్లి (బోడ్డుపల్లి) గ్రామంలో సభలను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

తూర్పుపల్లి మాల మహానాడు గ్రామ అద్యక్ష , కార్యదర్శి లు ఎన్నమల్ల రామస్వామి, నూనె గణేష్, ఎన్నిమల్ల విష్ణు, వల్లవోజు నర్సీంహ, ఎన్నిమల్ల చంటి, నూనె కళ్యాణ్, గాదరి ప్రభుదాస్, వల్లవోజు అంజయ్య,  రాములమ్మ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.