NLG: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ చేయూత
నల్లగొండ జిల్లా:
గుర్రంపోడు: మండలంలోని కొప్పోలు, నడికూడ,చేపూర్,పాల్వాయి,గుర్రంపోడ్,తేనెపల్లి,పోచంపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, గురువారం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్  కస్తూరి శ్రీ చరణ్ చేతుల మీదగా నోట్ బుక్స్, స్టేషనరీ సామగ్రి ,గ్రామర్ బుక్స్,డిక్షనరీ వంటి విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు శ్రీ చరణ్ ను ఘనంగా సన్మానించారు. శ్రీ చరణ్  మాట్లాడుతూ.. పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుండి అనేక  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కస్తూరి ఫౌండేషన్ ద్వారా ఒక విద్యారంగాన్ని బాగుపర్చడమే కాకుండా వివిధ రంగాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.

మన ఊరి బడులను మనమే బాగుపర్చుకోవాలని,తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందన్నారు.మనలో బలమైన సంకల్పం ఉంటే ఏదైన సాధించగలమని, అదే సంకల్పంతో విద్యార్థులు కష్ట పడి చదివితే మంచి మార్కులు సాధిస్తారు అని తెలిపారు. ఈ మేరకు ఉపాధ్యాయులు శ్రీ చరణ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మహేష్, నవీన్ రెడ్డి నరేందర్ రెడ్డి, జహంగీర్,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు, ముక్కముల సైదులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: జిల్లా సభ, రాష్ట్ర సభలను విజయవంతం చేయాలి: దళిత రత్న నూనె సురేష్
నల్గొండ జిల్లా:
నవంబర్ 23 న నల్లగొండ పట్టణ కేంద్రంలో జరిగే మాల-మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం మరియు డిసెంబర్ 1 న చలో హైదరాబాద్ 'మాలల సింహ గర్జన' విజయవంతం చేయాలని దళిత రత్న అవార్డు గ్రహీత, అడ్వకేట్ నూనె సురేష్, అసెంబ్లీ ఎన్నికల కంటస్టెడ్ అభ్యర్థి అన్నారు.

గురువారం దేవరకొండ మండలం, తూర్పుపల్లి (బోడ్డుపల్లి) గ్రామంలో సభలను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

తూర్పుపల్లి మాల మహానాడు గ్రామ అద్యక్ష , కార్యదర్శి లు ఎన్నమల్ల రామస్వామి, నూనె గణేష్, ఎన్నిమల్ల విష్ణు, వల్లవోజు నర్సీంహ, ఎన్నిమల్ల చంటి, నూనె కళ్యాణ్, గాదరి ప్రభుదాస్, వల్లవోజు అంజయ్య,  రాములమ్మ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
NLG: 'ప్రగతి చక్ర అవార్డు'ల పంపిణీ
నల్లగొండ: ఆర్టీసీ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్లు కీలకమని ఉమ్మడి జిల్లా రీజినల్ మేనేజర్ రాజశేఖర్ అన్నారు.

నల్గొండ రీజినల్ ట్రైనింగ్ హల్లో ఏర్పాటు చేసిన రీజినల్ స్థాయి 'ప్రగతి చక్ర అవార్డు'ల పంపిణీకి ముఖ్య అతిథిగా వారు పాల్గొని మాట్లాడారు.

ఈ మేరకు రీజినల్ పరిధిలోని 7 డిపో లలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీజెన్స్, హెల్పర్లు, ప్రైవేటు బస్ డ్రైవర్లు, మెకానిక్ లను సన్మానించారు.
NLG: మునాస ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచం మత్స్యకార దినోత్సవం

నల్లగొండ: పట్టణంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో, నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గంగపుత్ర భవన్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు పై చర్చించారు. అనంతరం మహిళా అధ్యక్షులను, సీనియర్ సభ్యులను శాలువాలు కప్పి సత్కరించి స్వీట్లు పంపిణి చేసుకున్నారు.

కార్యక్రమంలో పిల్లి సత్తయ్య, మునాస వెంకన్న, కొప్పు కృష్ణయ్య, మంగిలిపల్లి కిషన్, సింగం వెంకటయ్య గడిగ శ్రీను కౌన్సిలర్, గుండు వెంకటేశ్వర్లు, మునాస సత్యనారాయణ, మంగిలిపల్లి శంకర్, వడ్డెబోయిన వెంకటరామకృష్ణన్, మునాస వినయ్, అంబటి శివకుమార్, అంబటి అనురాధ, సింగం లక్ష్మి, అంబటి గంగ, తదితరులు పాల్గొన్నారు.

NLG: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచుకట్ల సంపత్
నల్గొండ జిల్లా, గట్టుప్పల్ మండల కేంద్రంలో గీత కార్మికుడు పెద్దగాని లచ్చయ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచుకట్ల సంపత్ నామాపురం మాజీ సర్పంచ్, ఇవాళ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.  10,000/-  ఆర్థిక సహాయం అందించారు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నామని జగన్నాథం మాట్లాడుతూ.. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నానుడి దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయడం ఎంతో అభినందనీయమని  అన్నారు.

గట్టుప్పల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నామని బుచ్చయ్య, సామల యాదయ్య, పగిళ్ల శంకర్, గట్టుప్పల రైతు సమన్వయ వేదిక మండల నాయకులు చెరుపల్లి ఆంజనేయులు, పెదగాని రాఘవేంద్ర, గౌడ్ కంచుకట్ల సుభాష్ రాష్ట్ర కన్వీనర్ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి,  వార్డు మెంబర్ మాదగాని ఆంజనేయులు, నామాపురం మాజీ సర్పంచ్ భీమనపల్లి రాములు, గట్టుప్పల గౌడ సంఘం నాయకులు మాదగాని గోపాల్ గౌడ్, యాదయ్య గౌడ్, ఎండి రఫీ, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఆర్థిక సహాయం అందించిన సయ్యద్ గఫార్
నల్గొండ జిల్లా:
నాంపల్లి: మండలం నేరళ్ళపల్లి  గ్రామం లో  ఎం.డీ.సఖీన అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గఫార్, మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10000/- ఆర్థిక సహాయం అందజేశారు.

గ్రామంలో ఏ సమస్య వచ్చినా గఫార్ ముందుంటారని, గ్రామస్తులు గఫర్ సహాయ గుణాన్ని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చనబోయిన రమేష్, మాద రమేష్, గునేబోయిన యాదయ్య, మల్లయ్య, రాములు, బచ్చనబోయిన కొండల్ , సత్తయ్య, వెంకన్న, వంగూరి సైదులు, ఉడుత పర్వతాలు, ఎడ్ల వెంకన్న , శ్రీరాములు, మేకల రాజు, కర్నాటి అంజి, పల్లె క్షత్రయ్య, చాంద్ పాషా, సైదుసేన్, హస్సేన్, కొన్రెడ్డి రామస్వామి, బారి యాదయ్య, వడ్డపల్లి యాదయ్య, చాపల వెంకన్న,ఎడ్ల చంద్రయ్య, పొలగొని నాగరాజు, పెద్దులు ఆక నర్సింహ, ఆక లింగయ్య, ఆక ప్రభు, నరసమ్మ, తదితరులు ఉన్నారు.
NLG: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
మర్రిగూడెం మండలం, తిరుగండ్లపల్లి గ్రామం సమీపంలో బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మరణించిన ఘటన జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం  బైక్ పై ఇద్దరు యువకులు హైదరాబాద్  నుండి మర్రిగూడెం కు వస్తుండగా, తిరుగండ్లపల్లి వద్ద బైక్ అదుపుతప్పి బైక్ నడుపుతున్న వ్యక్తి మరణించారు.

మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: రేపు ప్రజాపాలన విజయోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాలు
నల్గొండ: ఈ నెల 22 వ తేదీ సాయంత్రం 6 గంటలకు, పట్టణంలోని ఎన్.జి కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున ప్రజా పాలన విజయోత్సవాల జిల్లాస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

ప్రజా పాలన విజయోత్సవాల ఈవెంట్ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
NLG: సర్వే ప్రక్రియలో డేటా ఎంట్రీ కీలకం: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ: జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటా గోప్యతను కాపాడాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. సర్వే ప్రక్రియలో డేటా ఎంట్రీ వివరాలు కీలకం అని, సర్వే వివరాలను బహిర్గతం చేయడం లేదా దుర్వినియోగం చేసినా సీఆర్పిసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా డేటా ఎంట్రీ సైతం పూర్తి చేయాలని ఆపరేటర్లకు సూచించారు.
NLG: పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి: ధర్మసమాజ్ పార్టీ
నల్లగొండ జిల్లా:
గుర్రంపోడు: పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.

పేద, మధ్య తరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ మేరకు సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మామిడి జగన్ మహరాజ్ మాట్లాడుతూ.. పేదలందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ప్రభుత్వమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని చెప్పారు. మండల కన్వీనర్ మహేష్ మహరాజ్, తదితరులు పాల్గొన్నారు.