మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ.
ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శనివారం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సామల తిరుపతి, కనుకుట్ల వెంకటేష్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కాలుష్య నివారణ లో భాగంగా మండల ప్రజలకు ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా మట్టి వినాయక విగ్రహాలకు పూజలు చేసి కాలుష్య నివారణకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం యువజన అధ్యక్షులు సామల రవికాంత్, సంఘం సభ్యులు కనుకుట్ల శ్రీనివాస్ ,పర్ష రమేష్ ,జోర్రీ గల శ్రీనివాస్ ,పడాల సదాశివ్, బొద్దున విజయ్, దోమల అనిల్ ,కుషణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Sep 12 2024, 13:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.7k