జీపీఎస్ కలిగి ఉండి, గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాల్లోనే ఇసుక రవాణాకు అనుమతించాలి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్..
పుట్టపర్తి, సెప్టెంబర్ 4:జీపీఎస్ కలిగి ఉండి, గనులశాఖవద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాల్లోనే ఇసుక రవాణాకు అనుమతించాలిజిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారంజిల్లాలో ఉచిత ఇసుక కార్యకలాపాల అమలుపై లైన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, జిల్లా మైన్స్ అధికారి రామ్మోహన్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఇసుక వినియోగదారుల బుకింగ్, రవాణా వ్యవస్థలను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టాక్ యార్డ్ నుండి ఇసుకను తీసుకోవాలని తెలిపారు . సాధారణ వినియోగదారులు సొంతంగా వాహనాన్ని పంపించవచ్చు. ప్రభుత్వం సమకూర్చిన వాహనంలోనే ఇంటికి డెలివరీ కావాలనుకుంటే, బుకింగ్ సమయం లోనే ఆప్షన్ ఇవ్వాలి. వాహనం, దూరాన్ని బట్టి రవాణా చార్జీలను జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్ఎస్ఎసీ) నిర్ణయిస్తుంది. బల్క్ బుకింగ్ దారులు సొంతంగా వాహనాలు సమకూర్చుకోవాలి.సరఫరాచేసే వాహనాలకు 'ఉచిత ఇసుక రవాణా వాహనం' అనే బ్యానర్ ఏర్పాటు చేయాలి. రీచ్లు, స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పా టుచేసి పర్యవేక్షించాలని అధికారులు ఆదేశించారు. ఆర్డిఓ స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. రేపటి రోజు ధర్మా వరం డివిజన్ కార్యాలయం నందు సంబంధిత అధికారులతోసమీక్షసమావేశంనిర్వహించుకోవాలని తెలిపారు. ప్రతి స్టాక్ యార్డ్ నందు పోలీసు మరియు రెవిన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఉండాలని తెలిపారు, రాత్రి నందు ఎలాంటి వాహనాలు అనుమతించకూడదు. ఈనెల ఆరో తేదీన గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బంది ఇసుక బుకింగ్ ఎలా నిర్వహించాలో వాటిపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మైనింగ్ శాఖ ఏడిని ఆదేశించారు, ఇసుక స్టాక్ యార్డ్ నందు ఎలాంటి వాహనం ఉండకూడదు, చెక్పోస్ట్ నుండి ఇసుక రవాణా యార్డ్ నుండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చార్జి నెంబర్ వెహికల్ నెంబర్ మ్యాచింగ్ కలిగా ఉండాలని తెలిపారు. రోజుకు 80 వెహికల్స్ మాత్రమేఇసుకరవాణాకుఅనుమతించాలని తెలిపారు. ప్రతి కేటగిరీ వాహనంపై కిలో మీటరుకు, మెట్రిక్ టన్నుకు రవాణా ఛార్జీలను ఖరారు చేయాలన్నారు. ఇసుక రవాణా చేసే వాహనాలను కమిషనర్‌ మరియు మైన్స్ & జియాలజీ పోర్టల్ నమోదు చేయాలన్నారు. ఇసుక రవాణ ఛార్జీలు వినియోగదారునికి భారం కాకుండా చూడాలని నోటిఫై చేసిన ఇసుకను రవాణా ధరల కంటే..ఎక్కువ వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో పులివెందులలోని పిబిసి డాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్, జలవనరుల శాఖ ప్రతినిధి ఎం మల్లికార్జునరావు, ఎస్ నాగరాజు, నరేష్, ఎస్సీ ఈ మోహన్ రెడ్డి, ధర్మా వరం ఆర్డీవో వెంకట శివ సాయి రెడ్డి, ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ ఏ మల్లికార్జునప్ప, హిందూపురం ఆర్టీవో కరుణ సాగర్ రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన సాకే సంతోష్ ..
జాతీయస్థాయి ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలకు నార్పల మండలం దుర్గం గ్రామానికి చెందిన సాకే మారెన్న, బి. సరస్వతి గార్ల కుమారుడు సాకే సంతోష్ ఎంపిక కావడంతో దుర్గం గ్రామస్తులు మరియు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దళిత కుటుంబంలో పుట్టిన సాకే సంతోష్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొమ్మిదవ తరగతి చదువుతూ ఆర్చరీ క్రీడల్లో పట్టు సాధించారు. ఇదివరకే జిల్లా స్థాయిలో నాలుగు సార్లు ఆర్చరీ క్రీడల్లో పాల్గొన్నారు. అదేవిధంగా అంతర్ రాష్ట్రాల్లోని జార్ఖండ్లో ఆర్చరీ క్రీడల్లో పాల్గొని, రాష్ట్రస్థాయిలో మూడుసార్లు క్రీడల్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. అదే విధంగా ఈ నెల 26న ఢిల్లీలో జరగబోయే జాతీయస్థాయి ఆర్చరీ( విలువిద్య) పోటీలకు తమ కుమారుడు సంతోష్ ఎంపిక కావడంపై ఆనందంగా ఉందని తల్లిదండ్రులు మారెన్న, సరస్వతి లు ఆనంద వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాకే సంతోష్ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించాలని ఉందని, ఆర్చరీపై గురు పెట్టి నిత్యము సాధన చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రస్థాయిలో పోటీపడి ఆడుతున్నానని, జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించడానికి శిక్షణ తీసుకుంటున్నానని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నానని సంతోష్ తెలిపారు.
హిందూపురం పార్లమెంట్ MP బి.కె పార్థసారథి గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ముంటిమడుగు కేశవరెడ్డి, కాటప్పగారి రామలింగారెడ్డి
సత్య సాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ MP బి.కె పార్థసారథి గారి జన్మదిన సందర్భంగా అనంతపురం లోనీ వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు,అనిల్ చౌదరి గారు,మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు మరియు. ఈ కార్యక్రమంలో తదితర టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, కేశన్న, వెంకటాపురం అక్కులప్ప, దాదు, చెదుళ్ళ నారాయణస్వామి, చెరుకూరి నారాయణస్వామి, బాబయ్య, రామకృష్ణ,రాజు, చితంబరి మరియు మండల నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
హిందూపురం పార్లమెంటు సభ్యులు బి.కె పార్థసారథి జన్మదిన వేడుకలకు హాజరైన.. దండు శ్రీనివాసులు..
సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు సభ్యులు బి.కె పార్థసారథి అన్నగారికి సెలవా కప్పి బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుళ్ళాయప్ప, టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి బండి పరుశురాం శింగనమల నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, పామురాయి రఘు,యూనిట్ ఇన్చార్జి ప్రకాష్ రాయల్ , బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు ఆమర్ నాథ్, దండు జగన్, సతీష్ రాయల్, రంగస్వామి,సోము, తదితరులు పాల్గొన్నారు.
దేశమంతా మనరాష్ట్రం వైపు చూసే విధంగా సంక్షేమం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ద్విసభ్య కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో కుండపోత వర్షాలు పడుతున్న ఈ సెప్టెంబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఒక రోజు ముందుగా 31 వ.. తేదిన అందిస్తూ. అవ్వ తాతల వితంతువుల. వికలాంగుల కళ్ళల్లో ఆనందం చూచి సంతోషం వ్యక్త పరుస్తున్న కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటుంటుందని ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, శింగనమల MLA బండారు శ్రావణి గారు, మరియు అనంతపురం MP అంబికా లక్ష్మి నారాయణ గారి ఆదేశాలు మేరకు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఈ రోజు31-8-2024న ఉదయం 6గంటలకు జోరు వానలో కూడా ఇంటి ఇంటి దగ్గరకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తూన్న *టీడీపీ శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు మరియు మండల కన్వీనర్ అశోక్ కుమార్ గారు* ఈ కార్యక్రమంలో EX.MPP వెంకటేష్, మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ, S. నారాయణ స్వామి, బాబాయ్య, హరి,రంగమ్మ, బాబా వలి, మల్లికార్జున, బుక్కరాయసముద్రం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వివాహానికి 10వేల రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు..
వివాహానికి 10వేల రూ.లు ఆర్థిక సహాయం అందజేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు...

శింగనమల నియోజకవర్గం శింగనమల మండలం  తరిమెల గ్రామానివాసి శ్రీమతి మలిశెట్టి రమాదేవి శ్రీ మల్లి శెట్టి పెద్దయ్య గార్ల కూతురు ఎం రాజేశ్వరి  వివాహానికి ₹10,000/పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గంపయ్య మునయ్య పాల్గొన్నారు.
గత వైసిపి ప్రభుత్వంలో మూల పడిన జనరేటర్, ఆర్వో ప్లాంట్ ను తమ సొంత నిధులతో మరమ్మత్తులు చేయించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
గత వైసిపి ప్రభుత్వంలో మూల పడిన జనరేటర్, ఆర్వో ప్లాంట్ ను తమ సొంత నిధులతో రిపేరు చేయించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు

శింగనమల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని నెలలుగా మూల పడిన జనరేటర్, ఆర్వో ప్లాంట్ పనిచేయలేదని కరెంటు కోతలతో పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని శింగనమల డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని తమ సొంత నిధులతో శింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న జనరేటర్, ఆర్.ఓ ప్లాంట్ ను రిపేరు చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రిపేరు చేయించినందుకు పేషెంట్లు, ప్రజలు ఆసుపత్రి సిబ్బంది , టిడిపి నాయకులు కార్యకర్తలు *శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ* గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, టిడిపి సీనియర్ నాయకులు సి వెంకటేష్, బోయ సత్యనారాయణ, మాసుల చంద్రమోహన్, కురాకు రాముడు, గ్రామ కమిటీ అధ్యక్షులు బండి వెంకటనారాయణ, ముంత వెంకటేష్, ఆదినారాయణ, సురేష్ యాదవ్ ,రాజబాబు, ఇస్మాల్, ఆర్మీ జిలాన్, మహేష్ యాదవ్, నరసింహ, ముంత గంగరాజు, విజయ్, మాసుల ప్రకాష్, శంకర, వడ్డే ఆంజనేయులు, బెస్త లక్ష్మయ్య, మసూద్ వలి, తదితరులు పాల్గొన్నారు.
సిద్దారంపురం గ్రామంలో తెలుగుభాష దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం..
MLA బండారు శ్రావణి గారు మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్ప గారి రామలింగారెడ్డి గారి ఆదేశాలు మేరకు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో తెలుగుభాష దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా ZPH స్కూల్ లో క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికీ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో *శ్రీనివాస బుక్ సెంటర్ లోకానాథ్ రెడ్డి , హెడ్ మాస్టారు నీరజ , ZPH స్కూల్ కమిటీ చైర్మన్ లింగమయ్య , ప్రాథమిక పాఠశాల కమిటీ చైర్మన్ అంజి , కాటమయ్య,నాగేంద్ర, రవి, నరసింహులు, చిన్నరాజు, మాధవయ్య* తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్త కుటుంబానికి అండగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం. తన వంతుగా రూ. లక్ష ఆర్థిక సహాయం అందించిన ఆలూరు సాంబ శివారెడ్డి.
కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం. తన వంతుగా రూ. లక్ష ఆర్థిక సహాయం అందించిన ఆలూరు సాంబ శివారెడ్డి. మృతిని కుటుంబానికి చెక్కు అందజేత. అనంతపురం వైస్సార్సీపీ నేత ఆలూరు సాంబ శివారెడ్డి. గత నెల జూన్ 27 వ తేదీ టీడీపీ కార్యకర్తల దాడిలో మృతి చెందిన వైస్సార్సీపీ నాయకుడు ఎరికలయ్య (55) కుటుంబానికి అండగా నిలుస్తూ వైస్సార్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో మృతుని కుటుంబానికి పార్టీ నుంచి వచ్చిన రూ.5 లక్షలు చెక్కును, తన వంతు సహాయంగా లక్ష రూపాయలను అనంతపురం వైస్సార్సీపీ నేత ఆలూరు సాంబ శివారెడ్డి పంపిణీ చేశారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి ఎరికలయ్య పార్టీ కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అన్నారు.వైస్సార్సీపీ ప్రతి కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ఎంపిపి రాఘవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
8వ రోజు సత్య సాయి కార్మికులు సమ్మె మద్దతు పలికిన సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలో సత్య సాయి కార్మికులు సమ్మె 8వ రోజు కు చేరుకున్నది 6 నెలల వేతనం విషయ ఇంత వరకు ఏమి తెలలేదు మన రాష్ట్ర CM గారు మంచినీటి ప్రాజెక్ట్ కు నిధులు కేటాంచడం లో ఎందుకు ఆలస్యం అవుతుంది నేను చూస్తాన్నాడు ఇక్కడ కార్మికుల ఆకలి బాధలు ఎక్కువ అవుచున్నది దయచేసి మమీద దయవుంచి సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ నిలబెట్టడం మీ వంతు సార్ లేదుంటే సత్య సాయి ట్రస్ట్ వారిని ఒక విన్నపం R J రాత్నాకర్ సార్ బాబా గారు పేరు చెడ్డ పేరు వస్తుంటే మీరు ఐనా జోక్యం చేసుకొని చూడాల్సి బాధ్యత లేదా సార్ ఆలోచన చేయండి మీ కళ్ళముందర జరుగుచున్న విషయాలను కార్మికులు పస్థులుండి పనిచేసి అడుగుకోవలసి పరిస్థి అట్లా జరగకుండా CM గారి తో మాట్లాడి ఇప్పించే టట్లు చూడాలని కోరుచున్నాము ఈ రోజు ప్రజా సంగం నాయకుడు 0 నల్లప్ప ఇఫ్ట్ నాయకుడు k ఉపేంద్ర కుమార్ మద్దత్తు తెలుపుతున్నారు కార్మిక సంఘం నాయకుడు k. రాఘవేంద్రచారి వర్కర్స్ దేవదాస్ కిష్టప్ప లక్ష్మన్న నాగరాజు పెద్దన్న నల్లప్ప భాస్కర్ నారాయణ విశ్వరూప విశ్వనాధ్ వలి నరేష్ సామెల్ మస్తానువాలి గంగప్ప కుమార్ నాయుడు పోతలయ్య