గత వైసిపి ప్రభుత్వంలో మూల పడిన జనరేటర్, ఆర్వో ప్లాంట్ ను తమ సొంత నిధులతో మరమ్మత్తులు చేయించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
గత వైసిపి ప్రభుత్వంలో మూల పడిన జనరేటర్, ఆర్వో ప్లాంట్ ను తమ సొంత నిధులతో రిపేరు చేయించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు
శింగనమల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని నెలలుగా మూల పడిన జనరేటర్, ఆర్వో ప్లాంట్ పనిచేయలేదని కరెంటు కోతలతో పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని శింగనమల డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని తమ సొంత నిధులతో శింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న జనరేటర్, ఆర్.ఓ ప్లాంట్ ను రిపేరు చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రిపేరు చేయించినందుకు పేషెంట్లు, ప్రజలు ఆసుపత్రి సిబ్బంది , టిడిపి నాయకులు కార్యకర్తలు *శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ* గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, టిడిపి సీనియర్ నాయకులు సి వెంకటేష్, బోయ సత్యనారాయణ, మాసుల చంద్రమోహన్, కురాకు రాముడు, గ్రామ కమిటీ అధ్యక్షులు బండి వెంకటనారాయణ, ముంత వెంకటేష్, ఆదినారాయణ, సురేష్ యాదవ్ ,రాజబాబు, ఇస్మాల్, ఆర్మీ జిలాన్, మహేష్ యాదవ్, నరసింహ, ముంత గంగరాజు, విజయ్, మాసుల ప్రకాష్, శంకర, వడ్డే ఆంజనేయులు, బెస్త లక్ష్మయ్య, మసూద్ వలి, తదితరులు పాల్గొన్నారు.
Sep 04 2024, 09:10