నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్ : డిఎస్పీ కరుణాకర్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు కాగజ్ నగర్ డిఎస్పి కరుణాకర్ తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అడీషనల్ ఎస్పీ ప్రభాకర్ రెడ్డి ల ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ పట్టణంలోని భట్పల్లి చౌరస్తా సమీపంలోని కాపువాడలో శనివారం ఉదయం 5 గంటల నుండి పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బస్తీలో మొత్తం ఒకేసారిగా 50 మంది పోలీసులు ఇంటింటికి తిరుగుతు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 100 మోటార్‌సైకిళ్లు, 3ఆటోలను సీజ్‌చేశారు.ఈ సందర్భంగా కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ మాట్లాడుతూ పోలీసులకు శాంతిభద్రతల పరిరక్షణ కోసం సహకరించాలని సూచించారు. కొత్తగా కిరాయిలకు వచ్చే వారి వివరాలను సేకరించాలని కోరారు. అనుమానితులు ఎవరికీ ఇల్లు ఇవ్వరాదని కోరారు.బస్తీలో ఎవరైన అనుమానస్పదంగా సంచురిస్తుంటే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు. పోలీసులకు సహకరించాలని కోరారు. బస్తీలో స్వచ్చందంగా సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకునేందుకు తగిన విధంగా దాతలు స్పందించాలని సూచించారు. ఫ్లై ఓవర్ కింద కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నారని అట్టి వారు కనిపిస్తె సమాచారం ఇవ్వాలని అన్నారు.మట్కా ఆన్‌లైన్ బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మొబైల్ కు వచ్చే లింకులను క్లిక్ చేయకూడదన్నారు. లింకులను ఓపెన్ చేయ వలన సెల్ ఫోన్లోని సమాచారమంతా సైబర్ నేరగాళ్ళకు వెళుతుంది అని, సైబర్ నేరాలకు గురి అయినవారు డయల్ 1930 నెంబర్ కు సంప్రదించగలరని సూచించారు.ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలపాలని కోరారు. పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్‌లు చేపట్టనున్నట్లు ప్రకటించారు. వాహనాలకు ఎలాంటి పత్రాలు లేకపోయిన సీజ్ చేస్తామని, ప్రతీ వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ టౌన్ సీఐ తుత్తూరు శంకరయ్య, రూరల్ సీఐ సత్యనారాయణ, కౌటాల, వాంకిడి సీఐలతో పాటు కాగజ్‌నగర్ టౌన్ ఎస్ఐ లు ధీకొండ రమేష్, సుధాకర్ లు, కౌటాల, చింతలమానేపల్లి, రెబ్బెన ఈస్గాం ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Aug 31 2024, 23:13
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.2k