ఆదివాసి గిరిజన లకు ఆరాధ్య దైవం పూలజి బాబా : జిల్లా ఎస్పీ

కుమ్రం బీం అసిపాబాద్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 30 :కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని పట్నాపూర్ లో సద్గురు పూలాజీబాబా 100 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జిల్లా ఎస్పీ డి వి శ్రీనివాస రావు , జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే తో కలిసి హాజరయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు , మహారాష్ట్ర లోని కిడ్మట్ ఎమ్మెల్యే భీంరావు తో పాటు జిల్లాలోని ఉన్నతాధికారులు, మహారాష్ట్ర తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ చేతుల మీదుగా ఫ్రీ మెడికల్ క్యాంపు ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మాట్లాడుతూ లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సద్గురు పూలాజీ బాబా అని అన్నారు. ఆయన బోధనలతో ఎంతోమంది వ్యసనాలను అసాంఘిక శక్తుల వైపు మళ్ల కుండా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంతమంది భక్తులను పొందడం బాబా గొప్పతనం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాబా సతీమణి దుర్భతాబాయి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఐటీడీఏ పీవో కుష్బూ , జిల్లా ఉన్నత అధికారులతో పాటు మహారాష్ట్ర తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జిల్లాలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కు పాదం.

కుమ్రం బీం అసిపాబాద్ జిల్లా ప్రతినిధి ఆగస్టు 30 : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు ఈస్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని విలేజ్ నెంబర్ 1 గ్రామం లో తణిఖీలు చేపట్టారు. గ్రామం లోని రాజకుమార్ సర్కార్ ఇంట్లో తనిఖీ చేపట్టగా అతని ఇంట్లో 55 గ్రాముల గంజాయి (విలువ 5000) లభించిందని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఈస్గోవ్ లోని విలేజ్ నో 1 లో నివాసం ఉండే రాజ్ కుమార్ సర్కర్ అనే వ్యక్తి కాగాజ్నగర్, చింతగూడ మరియు బుర్దగూడ లో నివాసం ఉండే విద్యార్థులు మరియు ఇతర యువకులకు గంజాయి నీ మహారాష్ట్ర నుండి తీసుకొని వచ్చి 5 గ్రాములు మరియు 10 గ్రాముల గంజాయి నీ చిన్న చిన్న ప్యాకెట్లు గా తయారు చేసి వారిని ఈస్గావ్ లోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి వారికి 500/- రూపాయలు ఒక్కా పాకెట్ చొప్పున విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి అన్న నమ్మదగిన సమాచారం తో టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ పక్క ప్రణాళికా తయారు చేసి రెండుటీంలను తయారు చేసి కాగజ్నగర్ కి చెందిన యువకులు గంజాయి తీసుకోవడానికి ఈస్గావ్ కి వచ్చే సమయానికి అక్కడ ఉండి గంజాయి చేతులు మారే సమయంలో ఒక్కసారిగా వారిని పట్టుకోవడం జరిగింది అని టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలియచేశారు. గంజాయిని అమ్ముతున్న మరియు కొంటున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అయినది. అదేవిధంగా జిల్లాలో ఎవరైనా అక్రమ కార్యకలపాలకు పాల్పడినట్టు గుర్తించినట్లయితే ,తమకు 8712670505 కి కాల్ చేసి సమాచారం అందివ్వాలని అదేవిధంగా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు. ఈ టాస్కులో టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, ఎస్సై వెంకటేష్ ,పీసీలు మధు,రమేష్ పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగేలా చూడాలి : ఎస్పీ

కుమ్రం బీం అసిపాబాద్ జిల్లా ప్రతినిధి ఆగస్టు 30, : గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా పరిధిలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను జిల్లా పోలీస్ శాఖ తరపున గణేష్ మండపాల ఏర్పాటు చేసుకునే నిర్వహకులకు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వుంటుందని,ఇందుకోసం ముందుగా నిర్వహకులు ఎవరు అయితే గణేష్ మండపానికి ఏర్పాటు చేయదలచారో వారిలో ఒకరి పేరు ద్వారా policeportal.tspolice.gov.in వెబ్సైట్ ద్వారా , ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,నిమజ్జనం తేదీ,ప్రదేశం మొదలైన సమాచారంతో రిజిస్టర్ చేసుకోవాలి. https://policeportal.tspolice.gov.in ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అనంతరం, దరఖాస్తు కాపీని సంబంధిత పోలీస్ స్టేషన్లో సమర్పించి, పర్మిషన్ పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది గణేష్ మండపాలను ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి. వృద్ధులు,చదువుకునే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేలను ఏర్పాటు చేయరాదు. గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేసుకోవాలి గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి. గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి. గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు,ఇసుక ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం,పేకాటఅడటం,లక్కీ డ్రాలు నిర్వహించడం,అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు,అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం,పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం. విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి,పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు,ప్లాస్టిక్ సంచులు,వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. అదేవిధంగా సోషల్ మీడియా గ్రూపులలో అసత్య ప్రచారాలను పోస్ట్ చేసిన లేదా వాటిని షేర్ చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలి : సిర్పూర్ ఎమ్మెల్యే.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,కాగజ్ నగర్,ఆగస్టు30 :ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలని సిర్పూర్ టి మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు,తెలంగాణ జల సాధన సమితి అధ్యక్షులు నైనాల గోవర్ధన్ లు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నైనాల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించడంలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) అధినేత కృష్ణారెడ్డి హస్తం ఉందని, రాష్ట్ర అప్పును 70 వేల కోట్ల నుంచి 7 లక్షల కోట్లకు పెంచడంలో ఆయన ఎనలేని కృషి చేశారని ఎద్దేవా చేశారు. తద్వారా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని, కేసీఆర్ కుటుంబం మొత్తంగా కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదన చేసిందని ఆరోపించారు.ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఈ వార్షిక బడ్జెట్లో కేవలం రూ.250కోట్లు ప్రాణహిత ప్రాజెక్టుకు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని, వెంటనే డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే హైదరాబాద్ నగరానికి, దక్షిణ తెలంగాణకు నీటిని తరలించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షులు ఎల్ములే శంకర్, ఎల్ములె మల్లయ్య, దుర్గం మోతిరాం, తుకారాం, నేరెళ్ళ అశోక్, ఒడ్డేటి నాని, దుర్గం ప్రశాంత్, సాయి, జావిద్ అహ్మద్, శ్రీను, నానాజీ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,కాగజ్ నగర్,ఆగస్టు30 : కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 128 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులను శుక్రవారం రోజున సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే 5 సంవత్సరాలు అర్హులైన ప్రతి ఒక్కరి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముభారక్ ఫైల్ తన వద్ద పెండింగ్ లో ఉండవని వెను వెంటనే సంతకాలు చేసి ఎమ్మార్వోలకు పంపుతామని, తనకు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ పని చేసి పెడతానని అన్నారు. అలాగే మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు కూడాతీసుకువస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కిరణ్, పుష్పలత, మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, భాజపా జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, జిల్లా కార్యదర్శి రాజేందర్ గౌడ్, సంజీవ్, మల్లేష్, చప్పిడి సంజీవ్, శ్రీనివాస్, అశోక్, రాజు, సుమన్, తిరుపతి, రాజు, రవీందర్, కోట వేణు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,కాగజ్ నగర్,ఆగస్టు30 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం గుంట్లపెట్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజున మిషన్ భగీరథ సిబ్బంది మండిగే మల్లేశ్ ఎలగది పెంటయ్య సహకారంతో 33 మంది విద్యార్థిని, విద్యార్థులకు పిల్లలకు సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ చేతుల మీదగా నోట్స్ బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ బుద్దిగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించి పేరు ప్రతిష్టలు,తెచ్చుకొని తల్లిదండ్రుల,ఉపాధ్యాయుల కు మంచి పేరు తేవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ తేజ్వెని,గ్రామస్తులు చౌదరి గుండయ్య, దనేశ్ లు పాల్గొన్నారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,కాగజ్‌నగర్‌, ఆగస్టు30 :కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది కళాశాలలోని ప్లేస్ మెంట్ విభాగం సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో ఐసిఐసిఐ బ్యాంకు ప్రతినిధులు అపోలో మెడికల్ కంపెనీ ప్రతినిధులు వివిధ ఉద్యోగాల కొరకు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగిందని జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే. శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థులు సైతం ఇలాంటి జాబ్ మేళాకు హాజరై తమ ప్రతిభ ద్వారా ఉద్యోగాలను సంపాదించి ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధి మహేందర్, అపోలో మెడికల్ కంపెనీ ప్రతినిధి రఘుపతి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, కళాశాల ప్లేస్ మెంట్ విభాగం ఇంచార్జ్ ఈ శారద పాల్గొన్నారు.
మిలాద్-ఉన్-నబి ఉత్సవాలు 19 కి వాయిదా..?

మిలాద్-ఉన్-నబి ఉత్సవాలు ఈనెల 19 కి వాయిదా?

హైదరాబాద్, ఆగస్టు 30: రాష్ట్రంలో వచ్చే నెల 16న జరగాల్సిన మిలాద్‌-ఉన్‌- నబి ప్రదర్శనలను 19వ తేదీన నిర్వహించుకు నేందుకు గానూ ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన విజ్ఞప్తి పట్ల మిలాద్‌ కమిటీ ప్రతినిధులు అంగీకరిం చారు. 

మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 16న మిలాద్‌ ఉన్‌ నబి వేడుకలు ఘనంగా నిర్వ హించాలని మిలాద్‌ కమిటీ ఇదివరకే నిర్ణయించింది.

ఆ మరుసటి రోజు 17 గణేష్‌ నిమజ్జనోత్సవాలు ఉన్న నేపథ్యంలో మిలాద్‌ ఉన్‌ నబి ఏర్పాట్లపై రాష్ట్ర గురువారం రాత్రి సచివాల యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్షా సమా వేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సెప్టెంబరు ఏడు నుంచి గణేష్‌ నవరా త్రోత్సవాలు, 17న గణేష్‌ నిమజ్జనం ఉన్న విషయంపై కమిటీ ప్రతినిధులతో చర్చించారు. మతపరమైన విభేదాలు తలెత్తకుండా చూసేందుకు, ఏ వర్గానికి కూడా ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు తేదీలో మార్పు అవసర మని ఆయన అభిప్రాయ పడ్డారు. 

అన్ని అంశాలపై కూలం కశంగా చర్చించిన అనంతరం మిలాద్‌ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మిలాద్‌ ఉన్‌ నబీ ప్రదర్శన లను వాయిదా వేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి, మంత్రులు మిలాద్‌ కమిటీ సభ్యులకు సూచించారు.

రైతుల కోసం రంగంలోకి కేసీఆర్..?


హైదరాబాద్,ఆగస్టు 30:బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నా రు. తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. 

రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ దిగనున్నారు. 

ఈ బీఆర్ఎస్ పోరాటంపై రేపు సాయంత్రం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోం ది. సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టాలని కేసీ ఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 

సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్‌పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించను న్నారు. 

కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలతో పార్టీ శ్రేణులు కొంత ఉత్సా హం పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిసింది.

ప్రమాదవశాత్తు కల్వర్ట్ ను ఢీ కొని పూర్తిగా కాలిపోయిన కారు

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా :కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం ప్రదాన రహదారి వేంపల్లి గ్రామ‌ సమీపంలో అర్ధ రాత్రి 2:30 గంటల ప్రాంతంలో కాగజ్‌నగర్‌ నుండి‌ కౌటల మండలం‌ రవీంద్ర నగర్ కు వెళ్లే క్రమంలో ప్రమాదం 

ఒకరి గాయాలు ఆసుపత్రి కి తరలింపు

 సకాలంలో రాత్రి ‌స్పందించి మంటలు‌ ఆర్పిన ఫైర్‌ సిబ్బంది తప్పిన ప్రమాదం