పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఒక మామిడి తోటలో రహస్యంగా పేకాట ఆడుతున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.రూ 19100/-(పంతొమ్మిది వేల ఒక వంద) నగదు, 8 సెల్ ఫోన్లు, 7 బైక్ లు స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా తాళ్ళ గురిజాల పోలీస్ స్టేషన్ పరిధి బుగ్గ గుట్ట సమీపం లోని మామిడి తోటలో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 8 మంది వ్యక్తులు, మరియు 19100/- రూపాయల నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఏడు బైక్ లు, పేక ముక్కలు పట్టుకోవడం జరిగింది. నిందితుల వివరాలు 1) తొంగల వెంకటేష్ s/o హనుమంతు, వయస్సు : 45 సంవత్సరాలు, కులం: పెరిక, occ: సింగరేణి ఉద్యోగి, R/o బెల్లంపల్లి ,కన్నాల గేట్ ఏరియా 2)చింతల రాజేందర్ s/o యాదగిరి వయస్సు: 46 సంవత్సరాలు, కులం: బుడగజంగం, occ: కూలీ, r/o గంగారాం నగర్ , బెల్లంపల్లి 3) ఉపేందర్ s/o ఐల్లయ్య, వయస్సు: 36, కులం: యాదవ్, occ: ప్రైవేట్ ఉద్యోగి, r/o బెల్లంపల్లి 4) ఎం.డి హకీం s/o రహీం, వయస్సు: 38 సంవత్సరాలు, కులం: ముస్లిం, occ: డ్రైవింగ్, r/o సుభద్ర కాలనీ, తాండూరు. 5) Sd. ఉస్మాన్ s/o జానిమియా, వయస్సు: 53, కులం: ముస్లిం, occ: సింగరేణి ఉద్యోగి, R/o.బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ దగ్గర. 6)మాచర్ల గట్టయ్య s/o నారాయణ, వయస్సు: 38 సంవత్సరాలు, కులం: యాదవ్, Occ: వ్యవసాయం, R/o గాంధీనగర్ , బెల్లంపల్లి. 7) నాగనవేని నరేష్ s/o చంద్రయ్య, వయస్సు: 33 సంవత్సరాలు, కులం: యాదవులు, occ: కూలీ, r/o గాంధీనగర్ ,బెల్లంపల్లి. 8) శ్రీనివాస్ s/o ఎర్రయ్య, వయస్సు : 50 సంవత్సరాలు, కులం : మాల, Occ: కూలి, R/o.బెల్లంపల్లి. పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, బైక్ లు, సెల్ ఫోన్లు మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ
కి అప్పగించడం జరిగింది.
Aug 31 2024, 00:24
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1