రైతుల కోసం రంగంలోకి కేసీఆర్..?
హైదరాబాద్,ఆగస్టు 30:బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నా రు. తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది.
రాష్టంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకు న్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రంగంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిగనున్నారు.
ఈ బీఆర్ఎస్ పోరాటంపై రేపు సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోం ది. సభలు లేదా కార్నర్ మీటింగ్‌లు పెట్టాలని కేసీ ఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కార్‌పై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించను న్నారు.
కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలతో పార్టీ శ్రేణులు కొంత ఉత్సా హం పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిసింది.

హైదరాబాద్,ఆగస్టు 30:బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రానున్నా రు. తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది.


ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి: వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క
తెలంగాణ : ఏడిపించడం, హేళన చేయడం, ఇతర ఇబ్బందులకు గురిచేయడం లాంటివాటికి ఆరు నెలల జైలుశిక్ష పడుతుంది. శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష పడుతుంది. అడ్డుకున్నా, గాయపర్చినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తారు. అపహరణ, అత్యాచారం, తీవ్రంగా గాయపర్చడానికి అయిదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా వేస్తారు. ర్యాగింగ్ వేధింపులతో మృతి చెందినా, ఆత్మహత్యకు కారణమైనా జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
బంధువుల పరస్పర దాడుల్లో 8 మంది ఆసుపత్రిపాలు.
కి అప్పగించడం జరిగింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా , కాగజ్‌నగర్, ఆగస్టు29: కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ని వంజరికి వెళ్ళే దారిలో గల ఓ ప్లాట్లో(69/1/1) ఇటీవల అక్రమంగా నిర్మించిన దుకాణామును తొలగించాలని కోరుతూ గురువారం రోజున యజమానులు నగునూరి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు, గ్రామపంచాయతిలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అట్టి కలెక్టర్ ఆదేశాల మేరకు షాపు యజమానికి గ్రామపంచాయతి నుండి పలుమార్లు నోటీసుకు జారీ చేసినా సదరు యజమాని షాపును తొలగించకుండా యజమానులపై దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై ఎక్స్ సర్వీస్మెన్/ హుమెన్ రైట్ ప్రొటక్షన్ సభ్యులు శివకుమార్ అట్టి అక్రమ నిర్మాణం వద్ద పత్రికా సమావేశం నిర్వహించారు. రేపటి వరకు షాపును తొలగించని పక్షంలో తామే అట్టి దుకాణంను తొలగిస్తామని అన్నారు. అట్టి దుకాణంలో బెల్ట్ షాప్ కూడా నిర్వహిస్తున్నారని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వదిలేయడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. సీఐ స్వయంగా తణిఖీ చేయగా మద్యం సీసాలు లభ్యం అయ్యాయని, అయినా వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం రూరల్ ఎస్ఐ మహేందర్ ను కలిసి తమకు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,కాగజ్ నగర్,ఆగస్టు29, : కాగజ్ నగర్ పట్టణంలోని న్యూ మారుతి నగర్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కు గురువారం రోజున సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు చేశారు.రూ.25 లక్షల అంచనాతో నిర్మించనున్న ఈ క్లినిక్ వలన కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న కుక్కల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. కుక్కలకు ఈ క్లినిక్ లో స్టెరిలైజేషన్ నిర్వహించి వదిలేస్తారని, దాని వలన కుక్కల సంతతి పెంపు కాకుండా అరికట్టవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కమిషనర్ అంజయ్య,స్థానిక కౌన్సిలర్లు, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, ముత్తు అశోక్ పాల్గొన్నారు.
Aug 30 2024, 12:06
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.1k