కార్యకర్త కుటుంబానికి అండగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం. తన వంతుగా రూ. లక్ష ఆర్థిక సహాయం అందించిన ఆలూరు సాంబ శివారెడ్డి.
కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం. తన వంతుగా రూ. లక్ష ఆర్థిక సహాయం అందించిన ఆలూరు సాంబ శివారెడ్డి. మృతిని కుటుంబానికి చెక్కు అందజేత. అనంతపురం వైస్సార్సీపీ నేత ఆలూరు సాంబ శివారెడ్డి. గత నెల జూన్ 27 వ తేదీ టీడీపీ కార్యకర్తల దాడిలో మృతి చెందిన వైస్సార్సీపీ నాయకుడు ఎరికలయ్య (55) కుటుంబానికి అండగా నిలుస్తూ వైస్సార్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో మృతుని కుటుంబానికి పార్టీ నుంచి వచ్చిన రూ.5 లక్షలు చెక్కును, తన వంతు సహాయంగా లక్ష రూపాయలను అనంతపురం వైస్సార్సీపీ నేత ఆలూరు సాంబ శివారెడ్డి పంపిణీ చేశారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి ఎరికలయ్య పార్టీ కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అన్నారు.వైస్సార్సీపీ ప్రతి కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ఎంపిపి రాఘవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
8వ రోజు సత్య సాయి కార్మికులు సమ్మె మద్దతు పలికిన సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలో సత్య సాయి కార్మికులు సమ్మె 8వ రోజు కు చేరుకున్నది 6 నెలల వేతనం విషయ ఇంత వరకు ఏమి తెలలేదు మన రాష్ట్ర CM గారు మంచినీటి ప్రాజెక్ట్ కు నిధులు కేటాంచడం లో ఎందుకు ఆలస్యం అవుతుంది నేను చూస్తాన్నాడు ఇక్కడ కార్మికుల ఆకలి బాధలు ఎక్కువ అవుచున్నది దయచేసి మమీద దయవుంచి సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ నిలబెట్టడం మీ వంతు సార్ లేదుంటే సత్య సాయి ట్రస్ట్ వారిని ఒక విన్నపం R J రాత్నాకర్ సార్ బాబా గారు పేరు చెడ్డ పేరు వస్తుంటే మీరు ఐనా జోక్యం చేసుకొని చూడాల్సి బాధ్యత లేదా సార్ ఆలోచన చేయండి మీ కళ్ళముందర జరుగుచున్న విషయాలను కార్మికులు పస్థులుండి పనిచేసి అడుగుకోవలసి పరిస్థి అట్లా జరగకుండా CM గారి తో మాట్లాడి ఇప్పించే టట్లు చూడాలని కోరుచున్నాము ఈ రోజు ప్రజా సంగం నాయకుడు 0 నల్లప్ప ఇఫ్ట్ నాయకుడు k ఉపేంద్ర కుమార్ మద్దత్తు తెలుపుతున్నారు కార్మిక సంఘం నాయకుడు k. రాఘవేంద్రచారి వర్కర్స్ దేవదాస్ కిష్టప్ప లక్ష్మన్న నాగరాజు పెద్దన్న నల్లప్ప భాస్కర్ నారాయణ విశ్వరూప విశ్వనాధ్ వలి నరేష్ సామెల్ మస్తానువాలి గంగప్ప కుమార్ నాయుడు పోతలయ్య
7వ రోజు చేరుకున్న సత్య సాయి కార్మికులు సమ్మె..
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్ర మండల కేంద్రంలో సత్య సాయి కార్మికులు సమ్మె 7వ రోజు కొనసాగుతున్నది. 6నెలలు నుండి వేతనలు రాక జిల్లా మొత్తం 600గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీనిపై సత్య సాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ బోర్డు SE గారు ఏమీ పట్టించుకోన లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రజల కు నీటి సరఫరా ఆగిపోయిన ఏంపర్వాలేదు మీరు మాత్రం ఆఫీస్ లో కూర్చొని పొతే కార్మికులకు వేతనం గురుంచి మాట్లాడే పరిస్థితి లేదు కలెక్టర్ గారు. ఎందుకు ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నారు వర్కర్స్ యొక్క ఆకలి బాధలు పట్టించుకోరా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
14వ బెటాలియన్ కమాండెంట్.. K. ప్రభు కుమార్ కమాండెంట్
కర్నూలు 2వ బెటాలియన్ నందు అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తూ కమాండెంట్ గా ప్రమోషన్ తీసుకొని 14వ బెటాలియన్ కమాండెంట్ గా ప్రభుత్వం నియమించడం జరిగింది. 28వ తేదీ రోజున 14వ బెటాలియన్ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతలూరు నందు K. ప్రభు కుమార్ కమాండెంట్ గారు ప్రమోషన్ తీసుకుంటూ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
ప్రతిష్టాత్మకంగా దులీప్ ట్రోఫీని నిర్వహించాలి,  లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..
అనంతపురం నగరంలోని ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ లో నిర్వహించే దులీప్ ట్రోఫీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ లో నిర్వహించే దులీప్ ట్రోఫీపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆర్డీటీ, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం నగరంలో మొట్టమొదటిసారి నిర్వహించే దులీప్ ట్రోఫీ కోసం జిల్లా యంత్రాంగం తరఫున అన్ని రకాల సహకారం అందించాలన్నారు. అనంతపురం క్రికెట్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ మధు ఆచారి మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే దులీప్ ట్రోఫీ భారత క్రికెట్ జట్టు క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుందని, ఇందుకు లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డిటి స్పోర్ట్స్ విలేజ్ కి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, 160 కెవి ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని, దాని నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఫైర్ సేఫ్టీ, డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజం పాటించాలన్నారు. క్రికెట్ మ్యాచ్ ల నేపథ్యంలో మెడికల్ అరేంజ్మెంట్స్ చేయాలని, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, పీహెచ్సీ సిబ్బందిని నియమించాలని సూచించారు. క్రికెట్ పోటీలను చూసేందుకు బీసీసీఐ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కామెంటేటర్లు, క్రీడాకారులు రావడం జరుగుతుందని, విఐపి జాబితాను సిద్ధం చేయాలన్నారు. మ్యాచ్ లను సదావుగా నిర్వహించేందుకు డిఎస్డివో పరిధిలోని కోచ్ లను వాలంటీర్లుగా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని, సెక్యూరిటీ ప్లాన్ పరిశీలించాలని డిఎస్పీని ఆదేశించారు. దులీప్ ట్రోఫీ ఏర్పాట్లను తహసిల్దార్, ఎంపీడీవో, ఏఈ, మున్సిపల్ కమిషనర్, డివిజన్ స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్, తదితరులు రోజువారీగా ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. క్రికెటర్లు ఉండే హోటల్స్ వద్ద పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీటీ స్టేడియాల్లోని గ్యాలరీల క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేపట్టాలని, పబ్లిక్ పార్కింగ్ ఏర్పాటు జాగ్రత్తగా చేయాలన్నారు. పాఠశాల విద్యార్థులకు రొటేషన్ పద్ధతిలో పాసులు అందించాలన్నారు. నాలుగు రోజులు జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం 4000 కెపాసిటీ కలిగిన ఆర్డీటీ స్టేడియంలో రోజువారీగా పాసులను ఉచితంగా అందించడం జరుగుతుందని, ఎంట్రీ ఉచితంగానే ఉన్నా.. పాసు ఉంటేనే అనుమతించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తెలిపారు. అయితే క్రౌడ్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.* - *ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ జి. రామకృష్ణారెడ్డి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచు ఫెర్రర్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఆదిత్య వర్మ, మున్సిపల్ కమిషనర్ పీవీఎస్ఎన్ మూర్తి, గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, డిఎస్డివో షఫీ, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డీఈవో వరలక్ష్మి, డీఎస్పీ ప్రతాప్ కుమార్, రంజీ క్రికెటర్ షాబుద్దీన్, కోచ్ యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.
దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కు ప్రెస్ అండ్ పబ్లిసిటీ మీడియా ఫోటోగ్రాఫర్స్ కమిటీ మెంబర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఎన్నిక..
అనంతపురం వేదికగా సెప్టెంబర్ 5 నుంచి 22 వరకు జరుగు దులీప్ ట్రోఫీ( భారత క్రికెట్ జట్టు పాల్గొనే) టోర్నమెంట్ కు ప్రెస్ అండ్ పబ్లిసిటీ మీడియా ఫోటోగ్రాఫర్స్ కమిటీ మెంబర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఎన్నిక అవ్వడం జరిగింది వారికి హృదయపూర్వక అభినందనలు.
బుక్కరాయసముద్ర సత్య సాయి కార్మికులు సమ్మె 6 వ రోజున విన్నుతనంగా కార్మికులు గడ్డి తింటూ నిరసనలు వ్యక్తం చేశారు.
బుక్కరాయసముద్ర సత్య సాయి కార్మికులు సమ్మె 6 వ రోజున విన్నుతనంగా కార్మికులు గడ్డి తింటూ నిరసనలు వ్యక్తం చేశారు.

గత 6 నెలల నుండి వేతనాలు ఇవ్వక పోగా జిల్లా మొత్తం 600 గ్రామాల కు నీటి సరఫరా ఆగిపోయింది దీనిపై బోర్డు అధికారులు ఏమీ పట్టించు కోలేదు కార్మికులు ఎంత ఇబ్బంది పడుచున్నారో ఆలోచన చేయలేదు వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఛైర్మెన్ కలెక్టర్ గారే బాద ను మానవతా దృపకత ము తో చేపట్టి వర్కర్స్ కి వేతనాలు ఇచ్చి అదుకోవాలన్నారు. ఆగిపోనా పంప్ హౌస్ లు బుక్కరాయసముద్రం పెద్దకోట్ల చిన్నకోట్ల మాల్యావంతం ముదిగుబ్బ తడిమర్రి తాడిపత్రి పుట్టపర్తి కేశపురం కల్లూరు పామిడి కొనాకొడ్ల గుత్తి గదేకల్లు గుడిసెలపల్లి తంబాలపల్లి యారగుంట్ల ఇంకా ఎన్నో పంప్ హౌస్ లు వున్నాయి వీటి అన్నిటికి ప్రజలకు ఏమీ సమాదానం చెప్పుతారు బోర్డు అధికారులు మరియు కలెక్టర్ గారు సమస్య ను పరిసకరించే విదంగా చూడాలని కోరుచున్నాము. ప్రాజెక్ట్ ను కార్మికులను కాపాడే బాధ్యత మన రాష్ట్ర CM గరిదే నని కార్మిక నాయకుడు k. రాఘవేంద్రచారి  తెలిపారు. కార్మికులు దేవదాస్ కిష్టప్ప లక్ష్మన్న నాగరాజు భాస్కర్ పెద్దన్న నల్లప్ప నారాయణ సాగర్ వలి నరేష్ విశ్వరూప విశ్వనాధ్ జగదీష్ ప్రకాష్ కుమార్ నాయక్ కుమార్ నాయుడు సామెల్ తదితరులు పాల్గొన్నారు.
అర్ధనగ్న ప్రదర్శనతో నాలుగవ రోజున నిరసన కార్యక్రమం చేపట్టిన సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు..
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సత్యసాయి వాటర్ పంప్ హౌస్ నందు నాల్గవవ రోజున LFTU జెండాలతో సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు అర్థనగ్న ప్రదర్శనతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆరు నెలల నుంచి వేతనాలు లేక కుటుంబ పోషణ భారమైంది అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి వాటర్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారుల స్పందించి సత్యసాయి వాటర్ కార్మికుల వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కార్మిక సంగం నాయకుడు K. రాఘవేంద్రచారి, కార్మికులు దేవదాస్, లక్ష్మన్న, కిష్టప్ప, నాగరాజు, నల్లప్ప, పెద్దన్న, సాగర్, భాస్కర్, నారాయణ, వలి, సామెల్, నరేష్, విశ్వనాధ్, విశ్వరూప్.
సాధారణ బదిలీలు కాకుండా మ్యూచువల్ రిక్వెస్ట్లు ఇవ్వాలని.. తిరుపతి సిఎండి సంతోష్ రావుకి వినతి పత్రం అందజేసిన.. ఏఐటీయూసీ అడిషనల్ సెక్రెటరీ ఇబ్రహీం
ఏపీ ఎస్పీడీసీఎల్ ఏపీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఏ ఐ టి యు సి అడిషనల్ సెక్రెటరీ ఇబ్రహీం 21/08/2024 న. ఏపీఎస్పీడీసీఎల్. సి ఎం డి సంతోష్ రావు గారు జనరల్ ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ జూన్ జూలై నెలలలో ట్రాన్స్ఫర్స్ వచ్చే టివి ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఆలస్యంగా ఆగస్టు 2024 న. ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఆలస్యంగా ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ ఇచ్చినందుకు ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఎందుకంటే జూన్ మాసంలో స్కూల్స్ రీఓపెనింగ్ కావడం వల్ల పిల్లలకు స్కూల్స్ లో అడ్మిషన్ ఇప్పించడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారు కావున జనరల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా మ్యూచువల్ రిక్వెస్ట్లు ఇవ్వాలని ఏపీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ (ఏఐటీయూసీ). ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి సంతోష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఏపీఎస్పీడీసీఎల్ (తిరుపతి )కార్యాలయానికి వెళుతున్నాం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది గారు లక్‌పత్ దీదీ లతో ఇంటరాక్షన్ ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న బుక్కరాయసముద్రము మండల ఎంపీపీ....
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన"లక్‌పత్ దీదీ లతో ఇంటరాక్షన్" ను ప్రత్యక్ష ప్రసారం లో వీక్షిస్తున్న బుక్కరాయసముద్రము మండల ఎంపీపీ శ్రీమతి సునీత, మండల సమాక్య ప్రధాన అధికారులు మరియు మహిళా సంఘ సభ్యులు..