కాసేపట్లో పెళ్లి..మటన్ కోసం లొల్లి..!

బంధువుల పరస్పర దాడుల్లో 8 మంది ఆసుపత్రిపాలు.

చిలికిచిలికి గాలివానలా మారిన మటన్ గొడవ.

నవీపేట: బలగం సినిమాలో నల్లిబొక్కల గొడవలాగే నిజ జీవితంలో ఓ ఘటన జరిగింది. అప్పటి వరకు వివాహ వేడుక కళకళలాడింది. వధూవరులను పెళ్లికి వచ్చిన అతిథులు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ' మొదలైంది 'ముక్కల' లొల్లి. భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ జరిగిన గొడవలో ఇరు పక్షాలకు చెందిన ఎనిమిది మందికి గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల కేంద్రానికి చెందిన వధువుకు నందిపేట మండలంలోని బాద్గుణకు చెందిన వ రుడితో పెళ్లి జరిగింది. తర్వాత జరిగిన పెళ్లి భోజనంలో తమకు మటన్, చికెన్ సరిగ్గా వడ్డించడం లేదని వరుడి తరఫు బంధువులు గొడవకు దిగారు. ముక్కలు తక్కువగా వేస్తున్నారంటూ పెళ్లి కూతురు తరపు బంధువులతో వాదనకు దిగారు. చిన్నగా మొదలైన గొడవ కాస్త ఒక్కసారిగా పెద్దగా మారింది. దీంతో అటు వధువు, ఇటు వరుడు తరఫు చెందిన వారు ఒకరినొకరు పిడిగుద్దులు కురి పించుకున్నారు. దొరికిన వాటితో దొరికినట్లుగా.. అంతటితో ఆగకుండా వంట గంటెలు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మొదట నవీపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఫంక్షన్ హాల్ బయట ఉన్న రోడ్డుపై సైతం ఇరు పక్షాలు దాడులు చేసుకుని న్యూసెన్స్ చేయడంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు.
పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఒక మామిడి తోటలో రహస్యంగా పేకాట ఆడుతున్న 8 మందిని  టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.రూ 19100/-(పంతొమ్మిది వేల ఒక వంద) నగదు, 8 సెల్ ఫోన్లు, 7 బైక్ లు స్వాధీనం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా తాళ్ళ గురిజాల పోలీస్ స్టేషన్ పరిధి బుగ్గ గుట్ట సమీపం లోని మామిడి తోటలో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 8 మంది వ్యక్తులు, మరియు 19100/- రూపాయల నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఏడు బైక్ లు, పేక ముక్కలు పట్టుకోవడం జరిగింది. నిందితుల వివరాలు 1) తొంగల వెంకటేష్ s/o హనుమంతు, వయస్సు : 45 సంవత్సరాలు, కులం: పెరిక, occ: సింగరేణి ఉద్యోగి, R/o బెల్లంపల్లి ,కన్నాల గేట్ ఏరియా 2)చింతల రాజేందర్ s/o యాదగిరి వయస్సు: 46 సంవత్సరాలు, కులం: బుడగజంగం, occ: కూలీ, r/o గంగారాం నగర్ , బెల్లంపల్లి 3) ఉపేందర్ s/o ఐల్లయ్య, వయస్సు: 36, కులం: యాదవ్, occ: ప్రైవేట్ ఉద్యోగి, r/o బెల్లంపల్లి 4) ఎం.డి హకీం s/o రహీం, వయస్సు: 38 సంవత్సరాలు, కులం: ముస్లిం, occ: డ్రైవింగ్, r/o సుభద్ర కాలనీ, తాండూరు. 5) Sd. ఉస్మాన్ s/o జానిమియా, వయస్సు: 53, కులం: ముస్లిం, occ: సింగరేణి ఉద్యోగి, R/o.బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ దగ్గర. 6)మాచర్ల గట్టయ్య s/o నారాయణ, వయస్సు: 38 సంవత్సరాలు, కులం: యాదవ్, Occ: వ్యవసాయం, R/o గాంధీనగర్ , బెల్లంపల్లి. 7) నాగనవేని నరేష్ s/o చంద్రయ్య, వయస్సు: 33 సంవత్సరాలు, కులం: యాదవులు, occ: కూలీ, r/o గాంధీనగర్ ,బెల్లంపల్లి. 8) శ్రీనివాస్ s/o ఎర్రయ్య, వయస్సు : 50 సంవత్సరాలు, కులం : మాల, Occ: కూలి, R/o.బెల్లంపల్లి. పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, బైక్ లు, సెల్ ఫోన్లు మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్‌ ఎస్ఐ కి అప్పగించడం జరిగింది.
అక్రమ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలి.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా , కాగజ్‌నగర్‌, ఆగస్టు29: కాగజ్‌నగర్‌ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ని వంజరికి వెళ్ళే దారిలో గల ఓ ప్లాట్లో(69/1/1) ఇటీవల అక్రమంగా నిర్మించిన దుకాణామును తొలగించాలని కోరుతూ గురువారం రోజున యజమానులు నగునూరి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు, గ్రామపంచాయతిలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అట్టి కలెక్టర్ ఆదేశాల మేరకు షాపు యజమానికి గ్రామపంచాయతి నుండి ‌పలుమార్లు నోటీసుకు జారీ చేసినా సదరు యజమాని షాపును తొలగించకుండా యజమానులపై దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై ఎక్స్ సర్వీస్మెన్/ హుమెన్ రైట్ ప్రొటక్షన్ సభ్యులు శివకుమార్ అట్టి అక్రమ నిర్మాణం వద్ద పత్రికా సమావేశం నిర్వహించారు. రేపటి వరకు షాపును తొలగించని పక్షంలో తామే అట్టి దుకాణంను తొలగిస్తామని అన్నారు. అట్టి దుకాణంలో బెల్ట్ షాప్ కూడా నిర్వహిస్తున్నారని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వదిలేయడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. సీఐ స్వయంగా తణిఖీ చేయగా మద్యం సీసాలు లభ్యం అయ్యాయని, అయినా వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం రూరల్ ఎస్ఐ మహేందర్ ను కలిసి తమకు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,కాగజ్ నగర్,ఆగస్టు29, : కాగజ్ నగర్ పట్టణంలోని న్యూ మారుతి నగర్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కు గురువారం రోజున సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు చేశారు.రూ‌.25 లక్షల అంచనాతో నిర్మించనున్న ఈ క్లినిక్ వలన కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న కుక్కల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. కుక్కలకు ఈ క్లినిక్ లో స్టెరిలైజేషన్ నిర్వహించి వదిలేస్తారని, దాని వలన కుక్కల సంతతి పెంపు కాకుండా అరికట్టవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కమిషనర్ అంజయ్య,స్థానిక కౌన్సిలర్లు, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, ముత్తు అశోక్ పాల్గొన్నారు.
విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు అందించాలి : జిల్లా అదనపు కలెక్టర్.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్,ఆగస్టు 28 : విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని కాగజ్ నగర్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయి సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి, మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాఠశాల తరగతి గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తిని నివారించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. త్రాగునీరు, ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆహారం తినే ముందు చేతులను తప్పనిసరిగా శుభ్రపరచుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసి ఉన్నత ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపవైద్యాధికారి సీతారాం నాయక్, వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కబ్జాలను తొలగించాలని వినతి.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోగల ప్రధానమైన నాల పైన కొందరు వ్యక్తులు కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టినారు. 60 ఫీట్ల ఉన్న నాలా కేవలం 10 సీట్లకే పరిమితమైంది దాని వలన వర్షాకాలం నీటి ప్రవాహం సరిగా లేక పలు కాలనీలో నీటి వరద రావడం వల్ల పేద ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు . పెట్రోల్ పంప్ ఏరియా గుండా ప్రవహిస్తున్న నాలా రైల్వే పట్టాల వరకు విస్తరించి ఉంది దానికి ఇరువైపులా అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి వారిపై కఠిన చర్యలు తీసుకొని అక్రమ కట్టడాలను తొలగించాలని కోరుతూ మంగళవారం రోజున మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు.
వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తక్షనమే తొలగించాలి.

బెజ్జూర్ మండల కేంద్రంలో సంపూర్ణ బంద్.

ఆదివాసి హక్కుల కోసం మా పోరాటం ఆగదు,

త్వరలోనే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.

ఆదివాసీ నాయకులు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా :  బెజ్జూర్ మండల కేంద్రంలో ఈరోజు తుడుం దెబ్బ పిలుపు మేరకు సంపూర్ణ బంద్ నిర్వహించడం జరిగింది. వ్యాపార సముదాయాలు మరియు పాశాలలు, విన్స్ ఇతర సముదాయాలు అలాగే విద్యాసంస్థలు బందు ను శాంతియుతంగా బంద్ నిర్వహించారు. అనంతరం ఆదివాసీ నాయకులు బెజ్జూర్ మండల సర్ మెడి కొడప శంకర్ మాట్లాడుతూ ఆదివాసి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఆదివాసీ హక్కులను సాధించేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని మరింత ఉద్యమాన్ని అతి త్వరలోనే ఉద్యమ కార్యచరణ రచించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రధానంగా ఆదివాసీ నివాసా గ్రామాలకి మండల కేంద్రానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి హక్కులైన ఆదివాసి చట్టాలను ఏజెన్సీ ప్రాంతాలలో పకడ్బందీగా అమలు చేయకుంటే స్వయం పరిపాలన చేస్తామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏజెన్సీ డిఎస్సి ప్రకటించాలని జీవో నెంబర్ 3 ను యధావిధిగా కొనసాగించాలని బ్యాక్ లాక్ పోస్టులను ఆదివాసీలచే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రధాన డిమాండ్ అయినా చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించి ఆదివాసీలకు న్యాయం చేయాలి. చేయకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాల్ని ఉవ్వెత్తున ఎగిసి ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.... ఈ కార్యక్రమంలో కోరెత తిరుపతి, పోర్తేతేటి సర్దార్ జి, కొడిపే పుల్లయ్య, మాడే మధునయ్య, ఆత్రం సాయి, ఆత్రం బక్కయ్య, మానేపల్లి మల్లేష్, ఏణుక శ్రీహరి, పేదం ఆనందరావు, పేదమ్ లచ్చిరావు, మేడి సతీష్, పోల్క వెంకటేష్, తోరేం వినోద్, సడిమేకా రమేష్, గవుడే ణేష్, తొర్రెం ప్రశాంత్, ఆత్రం అరుణ్ కుమార్, కొమరం కనకయ్య, ఎడ్ల మహేష్, చింతపూడి దేవాజీ, నాయిని మారుతి, పొర్తి ప్రభాకర్, తలండి మధునయ్య, నైతం మల్లేష్, మడవి శ్రావణ్ కుమార్, అలం మధునకర్, ఆత్రం సదాశివ్, ఆత్రం అరుణ్ కుమార్, మడే జళపతి, పోర్తేటి అక్షంతరావు, ఆత్రం విష్ణు, పొర్తేటి జగదీష్, ఆత్రం సాయి, తలండి సంజీవ్, పేధం తుకారం తదితరులు పాల్గొన్నారు.
పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,రెబ్బెన, ఆగస్టు 27 : రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్  తెలిపిన వివరాలు ప్రకారం గోలేటిలోని సింగరేణి క్వార్టర్స్ లో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు,వారితో పాటుగా 12 వేల రూపాయలను కూడా సీజ్ జరిగింది. వారి యొక్క వివరాలు 1. పంజల స్వామి 2. సుందరగిరి భాస్కర్ 3. చింత బుచ్చయ్య 4. ఓరుగంటి కుమారస్వామి సింగరేణి సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వీళ్ళు డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నందున వీరిని అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసారం జిల్లాలో ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాటుపడితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
ఆన్ లైన్ మట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్ట్.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,కాగజ్ నగర్,ఆగస్టు27, :కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల‌ మేరకు జిల్లాలో అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా మంగళవారం రోజున కాగజ్‌నగర్‌ పట్టణంలోనీ నౌగాం బస్తిలో టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ ఆధ్వర్యంలో తణిఖీలు చేపట్టారు. ఈ తణిఖీలలో నౌగాంబస్తికి చెందిన ఎస్కే ఆజిల్ ఆన్ లైన్ మట్కా ఆడుతూ పట్టుబడ్డాడు. అతని వద్దనుండి రూ రెండువేల నగదు, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనపరచుకుని అతనిపై కాగజ్ నగర టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమొదు చేసినట్లు సీఐ రాణాప్రతాప్ వెల్లడించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డ, నిషేధించిన ఆన్లైన్ గేమ్లు మట్కా లాంటివాడిన, అక్రమంగా పశువులను, పిడిఎస్ బియ్యం, గంజాయి రవాణా చేసిన ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డ వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం ఉంటే 8712670505 కి కాల్ చేసి సమాచారం ఇవ్వగలరని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, ఎస్ఐ వేంకటేశ్, పీసీలు మధు, రమేష్ లు పాల్గొన్నారు.
బోర్డు తిప్పేసిన లక్కీ మాయ లేడీ.. కోట్లతో ఉడాయించిన వైనం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి: అక్రమ సంపాదనే ధ్యేయంగా ఓ మాయ లేడి అనుమతిలేని లెక్కిస్కీoను ఎంచుకుంది. ఇల్లీగల్ గా కోట్లు గడించాలనే దురాశతో సదరు మహిళ కోట్ల రూపాయలు సభ్యుల నుంచి వసూలు చేసి ఊడయించిన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళలు జరిగిన మోసానికి లబోదిబోమంటూ ఒక్క రోక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి కాల్ టెక్స్ ప్రాంతంలో మూడు సంవత్సరాల క్రితం ఓ మహిళ జై గణేష్ ఎంటర్ప్రైజెస్ లక్కీ స్కీమ్ ను ఏర్పాటు చేశారు. సదరు మహిళ ఏర్పాటు చేసిన ఈ స్కీంలో మహిళలే అత్యధికంగా సభ్యులుగా చేరారు. ఈ స్కీమ్ విధి విధానాల ప్రకారం ప్రతి నెల సభ్యులు రూ.650 కట్టారు. ఇలా 20 నెలలు కట్టాలి. 999 సభ్యులు రూ.650 చొప్పున కట్టారు. ప్రతినెల లక్కీ డ్రా తీస్తారు. ఈ డ్రాలో విజేతకు ఖరీదైన ఆర్టికల్స్ వస్తువులు ఇస్తామని ఆశ చూపారు. ఈ లెక్కన రూ.6 కోట్ల వరకు స్కీం లో జమయ్యాయి. ఇంతవరకు సభ్యులకు ఖరీదైన వస్తువు ఇచ్చిన దాఖలు లేవు. సభ్యుల నుంచి నెలవారీగా జమ చేసిన పెద్ద మొత్తంలో స్కీం నగదును దిగమింగి తమ సొంతూరు నిర్మల్ జిల్లాకు సదరు స్కీమ్ ఓనర్ వెళ్ళిపోయింది. స్కీం లో చేరిన 999 సభ్యులు నిండా మోసానికి గురయ్యారు. జై గణేష్ ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ మాయమైంది. స్కీం నిర్వాహకురాలు ఎక్కడికి వెళ్లిందో కూడా తెలియక సభ్యులు తలలు పట్టుకున్నారు. స్కీం పేరిట తెగ మోసపోయామని గ్రహించారు. చేసేదేమీ లేక జరిగిన మోసాన్ని తలుచుకొని పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. మోసానికి ఏజెంట్లే... బెల్లంపల్లిలో లక్కీ స్కీం నిర్వాహకురాలు భారీ మోసానికి స్కెచ్ వేసింది. జై గణేష్ ఎంటర్ ప్రైజస్ లక్కీ స్కీమ్ కు ఏజెంట్లనే ఎరగా మలుచుకుంది. స్కీం లో పదిమంది ఏజెంట్లను నియమించుకుంది. ఒక్కో ఏజెంట్ 100 సభ్యులకు తగ్గకుండా చేర్పించడం టార్గెట్ గా పెట్టుకుంది. మాయలేడి వద్ద ఏజెంట్లుగా చేరిన యువకులు అత్యధికంగా సభ్యులను చేర్పించారు. లక్కీ స్కీమ్ లో మొత్తం 999 మంది సభ్యులను చేర్పించారు. ప్రతినెల ఒక్కో సభ్యులు రూ.650 చొప్పున 20 నెలలు పాటు కట్టారు.20 నెలలకు సభ్యులు కట్టిన డబ్బులు మొత్తం రూ.13000 అయ్యాయి. ప్రతి నెల లక్కీ డ్రా తీసి డ్రాలో పేరు వచ్చిన సభ్యులుకి ఆశగా చూపించిన గృహోపకరణ వస్తువుల్లో ఒకటి ఇవ్వడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశంగా చెప్పడం మోసానికి పరాకాష్ట. ఖరీదైన వస్తువులతో నమ్మించారు.. లక్కీ స్కీమ్ లో సభ్యులు చేరేందుకు అత్యంత ఖరీదైన వస్తువులతో ప్రచారం చేశారు. బ్రోచర్లు తయారు చేపించి ఆకర్షణీయమైన ఆర్టికల్స్ ఇవ్వనున్న ప్రచారంతో స్కీమ్ కు భారీ ఆర్థిక స్థాయి ఉన్నట్లు నమ్మించారు. లక్కీ స్కీమ్ లో డ్రా వస్తువులుగా మొబైల్, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, బైక్, బంగారం, ఇంకా ఎన్నో అత్యంత విలువైన వస్తువులను ఇస్తామని ఏజెంట్ల ద్వారా ప్రచారం చేశారు. ప్రచార వలలో పడి ఇబ్బడి ముబ్బడిగా చేరి సభ్యులు మోసపోయారు. సభ్యులను, ప్రజలను నమ్మించడానికి ఆఫీస్, ఉద్యోగుల నియామకం మోస పోవడానికి ప్రధాన భూమికగా పనిచేశాయి. అంతేకాకుండా ఎంటర్ ప్రైజెస్ లో వస్తువులకు జీఎస్టీ జి కడుతున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించి సభ్యులను మరి నమ్మించారు. మోసం చేశారు. లక్కీ స్కీమ్ మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు స్కీమ్ లో చేరిన సభ్యులకు రెండు, మూడు నెలలకు ఒకసారి ఏదైనా ఒక వస్తువు ఇచ్చి నమ్మబలికారు. లక్కీ స్కీం పై ఆశతో స్కీం నిర్వహకురాలి మోసపు గుట్టును గ్రహించలేకపోయారు. సదరు మహిళ ఎలా చెప్తే అలా తలూ పుకుంటూ పోయారు. బెల్లంపల్లి వాస్తవ్యురాలు అని ఆమెను నమ్మారు. స్కీం ప్రీమియం ప్రకారం ఏ సభ్యులకు తగిన లాభం దక్కలేదు. నెల వారిగా సభ్యుల నుంచి చెల్లింపులు మాత్రం ఆగలేదు. ఏడాది క్రితం బోర్డుతిప్పేసిన మహిళ ఘరానా మోసాన్ని బాదితులు ఎవరికి చెప్పకుండా ఉండిపోయారు. మాయ మాటలు చెప్పి స్కీం లో చేర్పించిన ఏజెంట్ల మెడకు ఉచ్చు బిగుసుకుంది. కట్టిన డబ్బులు, ఇస్తామన్న వస్తువులకు సభ్యులు నోచుకోలేకపోయారు. బెల్లంపల్లి కేంద్రంగా తొలిసారిగా ఓ మహిళ నెలకొల్పిన స్కీo బాగోతం జిల్లాలో చర్చనీయాoశంగా మారింది. కోట్ల రూపాయలను స్కీం పేరట జమచేసి అదృశ్యమైన మహిళ, ఏజెంట్ల పై సభ్యులు నిప్పులు చెరుగుతున్నారు. కోట్ల రూపాయలతో బెల్లంపల్లి నుంచి ఫరారై నిర్మల్ లో తలదాచుకుంటున్న లక్కీ స్కీమ్ నిర్వహకురాలిపై ఇప్పటికే కొందరు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అదే దారిలో మరికొందరు ఉన్నారు. తమకు జరిగిన మోసాలను పోలీసులకు విన్నవించుకుంటున్నారు.న్యాయం కోసం బాధిత మహిళలు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి మోసకారి కి తగిన బుద్ధి చెప్తామని బాధిత మహిళల్లో ఆక్రోషం వ్యక్తమవుతున్నది. లక్కీ స్కీం పేరిట కోట్ల రూపాయలు కైంకర్యం చేసిన మహిళ పై చర్య తీసుకొని న్యాయం చేయాలని బాధిత మహిళలు పోలీసులను వేడుకుంటున్నారు.