వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తక్షనమే తొలగించాలి.
బెజ్జూర్ మండల కేంద్రంలో సంపూర్ణ బంద్.
ఆదివాసి హక్కుల కోసం మా పోరాటం ఆగదు,
త్వరలోనే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
ఆదివాసీ నాయకులు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ మండల కేంద్రంలో ఈరోజు తుడుం దెబ్బ పిలుపు మేరకు సంపూర్ణ బంద్ నిర్వహించడం జరిగింది. వ్యాపార సముదాయాలు మరియు పాశాలలు, విన్స్ ఇతర సముదాయాలు అలాగే విద్యాసంస్థలు బందు ను శాంతియుతంగా బంద్ నిర్వహించారు. అనంతరం ఆదివాసీ నాయకులు బెజ్జూర్ మండల సర్ మెడి కొడప శంకర్ మాట్లాడుతూ ఆదివాసి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఆదివాసీ హక్కులను సాధించేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని మరింత ఉద్యమాన్ని అతి త్వరలోనే ఉద్యమ కార్యచరణ రచించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రధానంగా ఆదివాసీ నివాసా గ్రామాలకి మండల కేంద్రానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి హక్కులైన ఆదివాసి చట్టాలను ఏజెన్సీ ప్రాంతాలలో పకడ్బందీగా అమలు చేయకుంటే స్వయం పరిపాలన చేస్తామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏజెన్సీ డిఎస్సి ప్రకటించాలని జీవో నెంబర్ 3 ను యధావిధిగా కొనసాగించాలని బ్యాక్ లాక్ పోస్టులను ఆదివాసీలచే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రధాన డిమాండ్ అయినా చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించి ఆదివాసీలకు న్యాయం చేయాలి. చేయకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాల్ని ఉవ్వెత్తున ఎగిసి ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.... ఈ కార్యక్రమంలో కోరెత తిరుపతి, పోర్తేతేటి సర్దార్ జి, కొడిపే పుల్లయ్య, మాడే మధునయ్య, ఆత్రం సాయి, ఆత్రం బక్కయ్య, మానేపల్లి మల్లేష్, ఏణుక శ్రీహరి, పేదం ఆనందరావు, పేదమ్ లచ్చిరావు, మేడి సతీష్, పోల్క వెంకటేష్, తోరేం వినోద్, సడిమేకా రమేష్, గవుడే ణేష్, తొర్రెం ప్రశాంత్, ఆత్రం అరుణ్ కుమార్, కొమరం కనకయ్య, ఎడ్ల మహేష్, చింతపూడి దేవాజీ, నాయిని మారుతి, పొర్తి ప్రభాకర్, తలండి మధునయ్య, నైతం మల్లేష్, మడవి శ్రావణ్ కుమార్, అలం మధునకర్, ఆత్రం సదాశివ్, ఆత్రం అరుణ్ కుమార్, మడే జళపతి, పోర్తేటి అక్షంతరావు, ఆత్రం విష్ణు, పొర్తేటి జగదీష్, ఆత్రం సాయి, తలండి సంజీవ్, పేధం తుకారం తదితరులు పాల్గొన్నారు.
Aug 28 2024, 17:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.7k