దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కు ప్రెస్ అండ్ పబ్లిసిటీ మీడియా ఫోటోగ్రాఫర్స్ కమిటీ మెంబర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఎన్నిక..
అనంతపురం వేదికగా సెప్టెంబర్ 5 నుంచి 22 వరకు జరుగు దులీప్ ట్రోఫీ( భారత క్రికెట్ జట్టు పాల్గొనే) టోర్నమెంట్ కు ప్రెస్ అండ్ పబ్లిసిటీ మీడియా ఫోటోగ్రాఫర్స్ కమిటీ మెంబర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఎన్నిక అవ్వడం జరిగింది వారికి హృదయపూర్వక అభినందనలు.
బుక్కరాయసముద్ర సత్య సాయి కార్మికులు సమ్మె 6 వ రోజున విన్నుతనంగా కార్మికులు గడ్డి తింటూ నిరసనలు వ్యక్తం చేశారు.
బుక్కరాయసముద్ర సత్య సాయి కార్మికులు సమ్మె 6 వ రోజున విన్నుతనంగా కార్మికులు గడ్డి తింటూ నిరసనలు వ్యక్తం చేశారు.

గత 6 నెలల నుండి వేతనాలు ఇవ్వక పోగా జిల్లా మొత్తం 600 గ్రామాల కు నీటి సరఫరా ఆగిపోయింది దీనిపై బోర్డు అధికారులు ఏమీ పట్టించు కోలేదు కార్మికులు ఎంత ఇబ్బంది పడుచున్నారో ఆలోచన చేయలేదు వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఛైర్మెన్ కలెక్టర్ గారే బాద ను మానవతా దృపకత ము తో చేపట్టి వర్కర్స్ కి వేతనాలు ఇచ్చి అదుకోవాలన్నారు. ఆగిపోనా పంప్ హౌస్ లు బుక్కరాయసముద్రం పెద్దకోట్ల చిన్నకోట్ల మాల్యావంతం ముదిగుబ్బ తడిమర్రి తాడిపత్రి పుట్టపర్తి కేశపురం కల్లూరు పామిడి కొనాకొడ్ల గుత్తి గదేకల్లు గుడిసెలపల్లి తంబాలపల్లి యారగుంట్ల ఇంకా ఎన్నో పంప్ హౌస్ లు వున్నాయి వీటి అన్నిటికి ప్రజలకు ఏమీ సమాదానం చెప్పుతారు బోర్డు అధికారులు మరియు కలెక్టర్ గారు సమస్య ను పరిసకరించే విదంగా చూడాలని కోరుచున్నాము. ప్రాజెక్ట్ ను కార్మికులను కాపాడే బాధ్యత మన రాష్ట్ర CM గరిదే నని కార్మిక నాయకుడు k. రాఘవేంద్రచారి  తెలిపారు. కార్మికులు దేవదాస్ కిష్టప్ప లక్ష్మన్న నాగరాజు భాస్కర్ పెద్దన్న నల్లప్ప నారాయణ సాగర్ వలి నరేష్ విశ్వరూప విశ్వనాధ్ జగదీష్ ప్రకాష్ కుమార్ నాయక్ కుమార్ నాయుడు సామెల్ తదితరులు పాల్గొన్నారు.
అర్ధనగ్న ప్రదర్శనతో నాలుగవ రోజున నిరసన కార్యక్రమం చేపట్టిన సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు..
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సత్యసాయి వాటర్ పంప్ హౌస్ నందు నాల్గవవ రోజున LFTU జెండాలతో సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు అర్థనగ్న ప్రదర్శనతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆరు నెలల నుంచి వేతనాలు లేక కుటుంబ పోషణ భారమైంది అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి వాటర్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారుల స్పందించి సత్యసాయి వాటర్ కార్మికుల వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కార్మిక సంగం నాయకుడు K. రాఘవేంద్రచారి, కార్మికులు దేవదాస్, లక్ష్మన్న, కిష్టప్ప, నాగరాజు, నల్లప్ప, పెద్దన్న, సాగర్, భాస్కర్, నారాయణ, వలి, సామెల్, నరేష్, విశ్వనాధ్, విశ్వరూప్.
సాధారణ బదిలీలు కాకుండా మ్యూచువల్ రిక్వెస్ట్లు ఇవ్వాలని.. తిరుపతి సిఎండి సంతోష్ రావుకి వినతి పత్రం అందజేసిన.. ఏఐటీయూసీ అడిషనల్ సెక్రెటరీ ఇబ్రహీం
ఏపీ ఎస్పీడీసీఎల్ ఏపీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఏ ఐ టి యు సి అడిషనల్ సెక్రెటరీ ఇబ్రహీం 21/08/2024 న. ఏపీఎస్పీడీసీఎల్. సి ఎం డి సంతోష్ రావు గారు జనరల్ ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ జూన్ జూలై నెలలలో ట్రాన్స్ఫర్స్ వచ్చే టివి ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఆలస్యంగా ఆగస్టు 2024 న. ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఆలస్యంగా ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ ఇచ్చినందుకు ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఎందుకంటే జూన్ మాసంలో స్కూల్స్ రీఓపెనింగ్ కావడం వల్ల పిల్లలకు స్కూల్స్ లో అడ్మిషన్ ఇప్పించడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారు కావున జనరల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా మ్యూచువల్ రిక్వెస్ట్లు ఇవ్వాలని ఏపీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ (ఏఐటీయూసీ). ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి సంతోష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఏపీఎస్పీడీసీఎల్ (తిరుపతి )కార్యాలయానికి వెళుతున్నాం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది గారు లక్‌పత్ దీదీ లతో ఇంటరాక్షన్ ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న బుక్కరాయసముద్రము మండల ఎంపీపీ....
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన"లక్‌పత్ దీదీ లతో ఇంటరాక్షన్" ను ప్రత్యక్ష ప్రసారం లో వీక్షిస్తున్న బుక్కరాయసముద్రము మండల ఎంపీపీ శ్రీమతి సునీత, మండల సమాక్య ప్రధాన అధికారులు మరియు మహిళా సంఘ సభ్యులు..
గార్లదిన్నె తహసిల్దార్  కార్యాలయాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేసిన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్
అనంతపురం, ఆగస్టు 23 : గార్లదిన్నె తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రికార్డు రూము పరిశీలించి, ఒక రిజిస్టర్ ను మెయింటైన్ చేయాలని, అందులో రికార్డు రూమ్ లో ప్రవేశించే వారి పేరు, హోదా, విషయము, టైమింగ్ అందులో పొందుపరచాలని, రికార్డు రూమ్ కి సంబంధించిన తాళాలను బాధ్యత కల అధికారి వద్ద ఉంచాలని తహసిల్దార్ ఈరమ్మకు ఆదేశించారు. సీసీ కెమెరాలు  అనునిత్యం పనిచేసే విధంగా చూసుకోవాలని, రికార్డు రూమ్ కి సంబంధించి కిటికీలు, వర్షం పడితే పైనుండి నీరు రాకుండా రికార్డులు పాడవకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యాలయం సిబ్బందితో మాట్లాడుతూ కార్యాలయమునకు వచ్చే వారి సమస్యలు పరిష్కరించే విధంగా నడుచుకోవాలని, అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే తెలుపమని కోరారు. అనంతరం గార్లదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారని, ఏ విధమైన టెస్టులు చేస్తున్నారని, ఎన్ని రకాల మందులు ఉన్నాయి, సరిపడా మందులు ఉన్నాయా, మందుల కొరత వస్తే ఏ విధమైన చర్యలు తీసుకుంటారని, ఈ ఆస్పత్రిలో ఎన్ని డెలివరీ కేసులు, అత్యవసర కేసులు వస్తున్నాయి అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎంత మంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారని, ఆర్ఎంపీ డాక్టర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని, ఆర్ఎంపీలతో మీటింగ్ పెట్టుకొని వాళ్లు ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజక్షన్స్, స్టీరియడ్స్ ఇవ్వకుండా, అలానే abortions కండక్ట్ చేయకుండా గైడ్ లైన్స్ ఇవ్వాలని, హెచ్ డి ఎస్ కమిటీ ( హాస్పటల్ డెవలప్మెంట్ సొసైటీ ) మీటింగులు పెట్టుకోవాలని, హాస్పిటల్ డెలివరీ ఇంప్రూవ్ చేయాలని, Pcpndt act గురించి మీటింగ్స్ పెట్టుకోవాలి, Hwcs ఎప్పుడు పేషంట్లకి అందుబాటులో ఉండాలని, ఆసుపత్రికి వచ్చే ప్రజలను మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గార్లదిన్నె మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమి, డాక్టర్ మంజుల, Dr హనీష and phc స్టాఫ్ పాల్గొన్నారు.
గండికోట రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రధాన చెరువులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..

గండికోట రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రధాన చెరువులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ యల్లనూరు మండలం కోడుమూర్తి పంపు హౌస్ నుండి బట్టన్ నొక్కి నీరు విడుదల ప్రజల అవసరాల నిమిత్తం సాగు తాగు నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే మండలంలోని ప్రధాన చెరువులు యల్లనూరు,గడ్డంవారి పల్లి,గొడ్డుమర్రి చెరువులకు నీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

ZPH స్కూల్ లోను, MPP స్కూల్ లలో వర్షం నీరు నిలిచి గుంతలను సొంత ఖర్చుతో పూడిపించిన.. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
MLA బండారు శ్రావణి శ్రీ గారు మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వాగ్రామం సిద్దారంపురంలోని ZPH స్కూల్ లోను మరియు MPP స్కూల్ లలో వర్షం నీరు నిలిచి నడిచేకి కూడా సరిగా లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులా అవస్థలు తెలుసుకొని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు సొంత ఖర్చుతో ట్రాక్టర్ లతో మట్టి నీ తొలించి చదునుచేపించారు.ఈ కార్యక్రమంలో ZPH స్కూల్ కమిటీ చైర్మన్ లింగమయ్య, MPP స్కూల్ కమిటీ చైర్మన్ అంజి,కాటమయ్య, నాగేంద్ర, అది, రవి, మారుతీ, నరసింహులు, చెన్నమయ్య, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు*.
రాజధాని నిర్మాణం, అన్న క్యాంటీన్లకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన పారిశ్రామికవేత్త ఠాగూర్.. అభినందించిన సీఎం చంద్రబాబు..
విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త, డీఆర్ఎన్ ఠాగూర్ గ్రూప్ చైర్మన్ ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్ అమరావతి రాజధాని, అన్న క్యాంటీన్ లకు కోటి రూపాయలు చొప్పున రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు.

కడప జిల్లా, పాయసం పల్లెకు చెందిన ఎన్వీ నారాయణ రెడ్డి రాజధానికి రూ.10,00,116ను విరాళంగా అందించారు. 

రాజధానిలో భాగస్వామ్యం కావాలనే స్ఫూర్తితో, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కు చేయూతను ఇవ్వాలనే మంచి ఆలోచనతో విరాళం ఇచ్చిన రవీంద్రనాథ్ ఠాకూర్, ఎన్వీరమణారెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
గార్లదిన్నె మండల కేంద్రంలో ఉన్న ఏపీ మైనారిటీ గురుకుల పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలి..
గార్లదిన్నె మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏపీ మైనారిటీ గురుకుల పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలి.. విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా తరగతులు మరియు హాస్టల్ గదులను ఏర్పాటు చేయాలి. ఏపీ మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు నూతన భవనం ఏర్పాటు చేయాలి విద్యార్థులకు అవసరమైన మంచినీరు మరియు టాయిలెట్ సదుపాయాలు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలి. విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని పాఠశాల ఎదుట విద్యార్థులు SFI నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.