పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,రెబ్బెన, ఆగస్టు 27 : రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్  తెలిపిన వివరాలు ప్రకారం గోలేటిలోని సింగరేణి క్వార్టర్స్ లో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు,వారితో పాటుగా 12 వేల రూపాయలను కూడా సీజ్ జరిగింది. వారి యొక్క వివరాలు 1. పంజల స్వామి 2. సుందరగిరి భాస్కర్ 3. చింత బుచ్చయ్య 4. ఓరుగంటి కుమారస్వామి సింగరేణి సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వీళ్ళు డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నందున వీరిని అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసారం జిల్లాలో ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాటుపడితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
ఆన్ లైన్ మట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్ట్.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ,కాగజ్ నగర్,ఆగస్టు27, :కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల‌ మేరకు జిల్లాలో అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా మంగళవారం రోజున కాగజ్‌నగర్‌ పట్టణంలోనీ నౌగాం బస్తిలో టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ ఆధ్వర్యంలో తణిఖీలు చేపట్టారు. ఈ తణిఖీలలో నౌగాంబస్తికి చెందిన ఎస్కే ఆజిల్ ఆన్ లైన్ మట్కా ఆడుతూ పట్టుబడ్డాడు. అతని వద్దనుండి రూ రెండువేల నగదు, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనపరచుకుని అతనిపై కాగజ్ నగర టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమొదు చేసినట్లు సీఐ రాణాప్రతాప్ వెల్లడించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డ, నిషేధించిన ఆన్లైన్ గేమ్లు మట్కా లాంటివాడిన, అక్రమంగా పశువులను, పిడిఎస్ బియ్యం, గంజాయి రవాణా చేసిన ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డ వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం ఉంటే 8712670505 కి కాల్ చేసి సమాచారం ఇవ్వగలరని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, ఎస్ఐ వేంకటేశ్, పీసీలు మధు, రమేష్ లు పాల్గొన్నారు.
బోర్డు తిప్పేసిన లక్కీ మాయ లేడీ.. కోట్లతో ఉడాయించిన వైనం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి: అక్రమ సంపాదనే ధ్యేయంగా ఓ మాయ లేడి అనుమతిలేని లెక్కిస్కీoను ఎంచుకుంది. ఇల్లీగల్ గా కోట్లు గడించాలనే దురాశతో సదరు మహిళ కోట్ల రూపాయలు సభ్యుల నుంచి వసూలు చేసి ఊడయించిన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళలు జరిగిన మోసానికి లబోదిబోమంటూ ఒక్క రోక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి కాల్ టెక్స్ ప్రాంతంలో మూడు సంవత్సరాల క్రితం ఓ మహిళ జై గణేష్ ఎంటర్ప్రైజెస్ లక్కీ స్కీమ్ ను ఏర్పాటు చేశారు. సదరు మహిళ ఏర్పాటు చేసిన ఈ స్కీంలో మహిళలే అత్యధికంగా సభ్యులుగా చేరారు. ఈ స్కీమ్ విధి విధానాల ప్రకారం ప్రతి నెల సభ్యులు రూ.650 కట్టారు. ఇలా 20 నెలలు కట్టాలి. 999 సభ్యులు రూ.650 చొప్పున కట్టారు. ప్రతినెల లక్కీ డ్రా తీస్తారు. ఈ డ్రాలో విజేతకు ఖరీదైన ఆర్టికల్స్ వస్తువులు ఇస్తామని ఆశ చూపారు. ఈ లెక్కన రూ.6 కోట్ల వరకు స్కీం లో జమయ్యాయి. ఇంతవరకు సభ్యులకు ఖరీదైన వస్తువు ఇచ్చిన దాఖలు లేవు. సభ్యుల నుంచి నెలవారీగా జమ చేసిన పెద్ద మొత్తంలో స్కీం నగదును దిగమింగి తమ సొంతూరు నిర్మల్ జిల్లాకు సదరు స్కీమ్ ఓనర్ వెళ్ళిపోయింది. స్కీం లో చేరిన 999 సభ్యులు నిండా మోసానికి గురయ్యారు. జై గణేష్ ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ మాయమైంది. స్కీం నిర్వాహకురాలు ఎక్కడికి వెళ్లిందో కూడా తెలియక సభ్యులు తలలు పట్టుకున్నారు. స్కీం పేరిట తెగ మోసపోయామని గ్రహించారు. చేసేదేమీ లేక జరిగిన మోసాన్ని తలుచుకొని పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. మోసానికి ఏజెంట్లే... బెల్లంపల్లిలో లక్కీ స్కీం నిర్వాహకురాలు భారీ మోసానికి స్కెచ్ వేసింది. జై గణేష్ ఎంటర్ ప్రైజస్ లక్కీ స్కీమ్ కు ఏజెంట్లనే ఎరగా మలుచుకుంది. స్కీం లో పదిమంది ఏజెంట్లను నియమించుకుంది. ఒక్కో ఏజెంట్ 100 సభ్యులకు తగ్గకుండా చేర్పించడం టార్గెట్ గా పెట్టుకుంది. మాయలేడి వద్ద ఏజెంట్లుగా చేరిన యువకులు అత్యధికంగా సభ్యులను చేర్పించారు. లక్కీ స్కీమ్ లో మొత్తం 999 మంది సభ్యులను చేర్పించారు. ప్రతినెల ఒక్కో సభ్యులు రూ.650 చొప్పున 20 నెలలు పాటు కట్టారు.20 నెలలకు సభ్యులు కట్టిన డబ్బులు మొత్తం రూ.13000 అయ్యాయి. ప్రతి నెల లక్కీ డ్రా తీసి డ్రాలో పేరు వచ్చిన సభ్యులుకి ఆశగా చూపించిన గృహోపకరణ వస్తువుల్లో ఒకటి ఇవ్వడం ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశంగా చెప్పడం మోసానికి పరాకాష్ట. ఖరీదైన వస్తువులతో నమ్మించారు.. లక్కీ స్కీమ్ లో సభ్యులు చేరేందుకు అత్యంత ఖరీదైన వస్తువులతో ప్రచారం చేశారు. బ్రోచర్లు తయారు చేపించి ఆకర్షణీయమైన ఆర్టికల్స్ ఇవ్వనున్న ప్రచారంతో స్కీమ్ కు భారీ ఆర్థిక స్థాయి ఉన్నట్లు నమ్మించారు. లక్కీ స్కీమ్ లో డ్రా వస్తువులుగా మొబైల్, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, బైక్, బంగారం, ఇంకా ఎన్నో అత్యంత విలువైన వస్తువులను ఇస్తామని ఏజెంట్ల ద్వారా ప్రచారం చేశారు. ప్రచార వలలో పడి ఇబ్బడి ముబ్బడిగా చేరి సభ్యులు మోసపోయారు. సభ్యులను, ప్రజలను నమ్మించడానికి ఆఫీస్, ఉద్యోగుల నియామకం మోస పోవడానికి ప్రధాన భూమికగా పనిచేశాయి. అంతేకాకుండా ఎంటర్ ప్రైజెస్ లో వస్తువులకు జీఎస్టీ జి కడుతున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించి సభ్యులను మరి నమ్మించారు. మోసం చేశారు. లక్కీ స్కీమ్ మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు స్కీమ్ లో చేరిన సభ్యులకు రెండు, మూడు నెలలకు ఒకసారి ఏదైనా ఒక వస్తువు ఇచ్చి నమ్మబలికారు. లక్కీ స్కీం పై ఆశతో స్కీం నిర్వహకురాలి మోసపు గుట్టును గ్రహించలేకపోయారు. సదరు మహిళ ఎలా చెప్తే అలా తలూ పుకుంటూ పోయారు. బెల్లంపల్లి వాస్తవ్యురాలు అని ఆమెను నమ్మారు. స్కీం ప్రీమియం ప్రకారం ఏ సభ్యులకు తగిన లాభం దక్కలేదు. నెల వారిగా సభ్యుల నుంచి చెల్లింపులు మాత్రం ఆగలేదు. ఏడాది క్రితం బోర్డుతిప్పేసిన మహిళ ఘరానా మోసాన్ని బాదితులు ఎవరికి చెప్పకుండా ఉండిపోయారు. మాయ మాటలు చెప్పి స్కీం లో చేర్పించిన ఏజెంట్ల మెడకు ఉచ్చు బిగుసుకుంది. కట్టిన డబ్బులు, ఇస్తామన్న వస్తువులకు సభ్యులు నోచుకోలేకపోయారు. బెల్లంపల్లి కేంద్రంగా తొలిసారిగా ఓ మహిళ నెలకొల్పిన స్కీo బాగోతం జిల్లాలో చర్చనీయాoశంగా మారింది. కోట్ల రూపాయలను స్కీం పేరట జమచేసి అదృశ్యమైన మహిళ, ఏజెంట్ల పై సభ్యులు నిప్పులు చెరుగుతున్నారు. కోట్ల రూపాయలతో బెల్లంపల్లి నుంచి ఫరారై నిర్మల్ లో తలదాచుకుంటున్న లక్కీ స్కీమ్ నిర్వహకురాలిపై ఇప్పటికే కొందరు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అదే దారిలో మరికొందరు ఉన్నారు. తమకు జరిగిన మోసాలను పోలీసులకు విన్నవించుకుంటున్నారు.న్యాయం కోసం బాధిత మహిళలు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి మోసకారి కి తగిన బుద్ధి చెప్తామని బాధిత మహిళల్లో ఆక్రోషం వ్యక్తమవుతున్నది. లక్కీ స్కీం పేరిట కోట్ల రూపాయలు కైంకర్యం చేసిన మహిళ పై చర్య తీసుకొని న్యాయం చేయాలని బాధిత మహిళలు పోలీసులను వేడుకుంటున్నారు.
తెలంగాణలో విజృంభిస్తున్న జ్వరాలు..!

తెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.తెలంగాణలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్ రావు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఒక్క సమీక్ష కూడా చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా అందుబాటులో లేవని మండిపడ్డారు.రాష్ట్రంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, హెల్త్‌ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పటికే నిజామాబాద్‌, కరీంనగర్‌ లాంటి జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్‌రావు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో కూడా బెడ్స్‌ దొరకని పరిస్థితి ఉందని, ఆ స్థాయిలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ముందుగా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని కోరుతున్నారు. విష జ్వరాలు, డెంగ్యూపై సమీక్షలు చేయకుండా ప్రభుత్వం, విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు హరీష్‌రావు.

ఆపన్న హస్తం అందించిన దాతలు

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా 62 మంది దాతలనుండి 27,152/- రూపాయల సేకరణ .

పెంచికల్ పేట్ ఎస్.ఐ కొమురయ్య చేతులమీదుగా బాధిత కుటుంబసభ్యులకు అంధజేత

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలంలోని గుంట్లపేట గ్రామానికి చెందిన బాధితులకు దాతలు ఆపన్న హస్తం అందించారు. గుంట్లపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గిరుగుల రజిత గత కొన్ని రోజుల క్రితం పక్షవాతం మరియు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుందడంతో చికిత్స కోసం పలువురు దాతల నుండి సోషల్ మీడియా ద్వారా సేకరించిన 27,152/- నగదును బాధిత కుటుంబసభ్యులకు ఎస్.ఐ కొమురయ్య చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్బంగా సహకరించిన దాతలకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు బోయిర సోమన్న, రాజేంద్రప్రసాద్ యువకులు బండి మహేష్,శేకర్ ముత్తినేని తిరుపతి, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో బస్సులో మహిళ మృతి..?

విజయవాడ, ఆగస్టు 27 : గుండెపోటుతో బస్సులోనే కుప్పకూలిపోయింది ఓ మహిళ,అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు సైతం అకస్మాత్తుగా గుండెపోటుతో రోజు రోజుకు చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నా యి. 

ఇలాంటి విషాద ఘటన ఏపీలో తాజాగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లింది. 

అక్కడి నుంచి తిరిగి వచ్చింది. విజయవాడ నుంచి స్వగ్రామం కోరు మామిడి కీ బస్సులో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. 

సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది....

తెలంగాణలో సంచలనాలు సృష్టించబోతున్న టి-ఫైబర్

హైదరాబాద్ :దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టి-ఫైబర్) తెలంగాణలోని మూడు గ్రామాల్లోని 4,000 కుటుంబాలకు అపరిమిత ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5 నుండి ప్రారంభించనుంది.

ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులు టెలివిజన్‌లో తెలుగుతో సహా 300 ఛానెల్‌లను చూసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు. 20 mbps వేగంతో ఇంట్రానెట్ సౌకర్యం ఉంటుందని అధికారులు తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం మంథని, సంగారెడ్డి జిల్లా అందోలు, నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలాల్లోని కుటుంబాలు సెప్టెంబర్‌ 5 నుంచి టీ-ఫైబర్‌ ద్వారా ఉచిత ఇంటర్నెట్‌ సేవలను పొందుతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ నుండి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా, T-Fibre రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ.300 చొప్పున హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలని యోచిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కు వచ్చే స్పందనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోందని అధికారులు తెలిపారు.

రూరల్ ఎసై గా మహేందర్ బాధ్యతలు స్వీకరణ.
ఆసిఫాబాద్ : కాగజ్‌నగర్‌ రూరల్ ఎసై గా మహేందర్ ఆదివారం ఉదయం తన బాధ్యతలను స్వీకరించారు.ఈసందర్భంగా ఎసై మాట్లాడుతూ శాంతి బద్రతలను కాపాడటంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని అన్నారు.
డా.బిఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : డా.బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సు లలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసిందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కళాశాల కో ఆర్డినేటర్ తుడూరు దత్తాత్రేయ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలియ చేసారు.ఇంటర్ పాస్ అయిన ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ప్రవేశం పొందడానికి చివరి తేదీ వచ్చే నెల 18 ఆగస్టు అని, 2016-17 నుండి 2023-24 వరకు అడ్మిషన్ తీసుకుని ట్యూషన్ ఫీజు కట్టని విద్యార్థులు కూడా పైన పేరుకొన్న తేదీ లోగా ఆన్ లైన్ లో చెల్లించాలని, ఇతర వివరాలకు సెల్ 9866398678, 9494314314 లేదా 7382929651 లను సంప్రదించాలని పేర్కొన్నారు.
డా.బిఆర్ అంబెడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : డా.బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సు లలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసిందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కళాశాల కో ఆర్డినేటర్ తుడూరు దత్తాత్రేయ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలియ చేసారు.ఇంటర్ పాస్ అయిన ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ప్రవేశం పొందడానికి చివరి తేదీ వచ్చే నెల 18 ఆగస్టు అని, 2016-17 నుండి 2023-24 వరకు అడ్మిషన్ తీసుకుని ట్యూషన్ ఫీజు కట్టని విద్యార్థులు కూడా పైన పేరుకొన్న తేదీ లోగా ఆన్ లైన్ లో చెల్లించాలని, ఇతర వివరాలకు సెల్ 9866398678, 9494314314 లేదా 7382929651 లను సంప్రదించాలని పేర్కొన్నారు.