సమయపాలన,క్రమశిక్షణ,నిరంతర సాధనతో విద్యార్థుల భవిష్యత్.

కుమ్రంభీంఆసిఫాబాద్ :సమయపాలన,క్రమశిక్షణ,నిరంతర సాధనతో విద్యార్థుల భవిష్యత్ పురోగమించవచ్చునని సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ అన్నారు. ఆదివారం రోజున కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కృష్ణవేణి పాఠశాల ఆధ్వర్యంలో పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులు దిశ నిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా పరీక్షల సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలి,ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వారు చదువులోనే కాదు జీవితంలో కూడా ముందుకు వెళతారు అని విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికను ఎంతో అద్భుతమైన రీతిలో సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ తెలియచేశారు. విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడేలా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించాలి అని ఆలోచన చేసిన కృష్ణవేణీ యాజమాన్యాన్ని వారు కొనియాడారు.సమయపాలన, క్రమ శిక్షణ, నిరంతర సాధన ద్వారా విద్యార్థులు పురోగమించవచ్చని తెలిపారు.ప్రొడక్టివ్, సూపర్ ప్రొడక్టివ్ వైపు మన గమనం ఉండాలని, తప్పుడు మనుషులతో స్నేహం, తప్పుడు పనులు చేయరాదని చెప్పారు. మీ పేరు ముందున్న ఇంటి పేరుతో కాకుండా మీ పేరు తరువాత మీ ఘనత పెట్టుకునే వైపు పయనించాలని సూచించారు. దీక్షతో ప్రయత్నిస్తే ఫలితాలు (focus-effort-result) వస్తాయని, తాత్కాలిక ఆనందం కోసం కాకుండా మంచి భవిష్యత్ కోసం కష్టపడాలని విద్యార్థులను కోరారు. ఈ నేపథ్యంలో గురువులను గౌరవించాలని, వారు చెప్పిన దారిలో పయనించాలని చెప్పారు. మన జీవితం లో అమ్మ, నాన్న, గురువు, సైనికులు, మనకు అన్నం పెట్టే రైతులే నిజమైన కథానాయకులని, వారిని గౌరవించడం మన బాధ్యత అని అన్నారు. సమయానికి విలువ ఇవ్వాలని, లేనిచో గెలుపు పరుగులో ఓడిపోవడం తద్యమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దోమల సురవర్థన్, జియా - ఉల్ - హక్ ,దోమల వేద ప్రవీణ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లి తండ్రులు ఇందులో పాల్గొన్నారు.
Aug 27 2024, 12:55
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.1k