తెలంగాణలో సంచలనాలు సృష్టించబోతున్న టి-ఫైబర్
![]()
హైదరాబాద్ :దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టి-ఫైబర్) తెలంగాణలోని మూడు గ్రామాల్లోని 4,000 కుటుంబాలకు అపరిమిత ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5 నుండి ప్రారంభించనుంది.
ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులు టెలివిజన్‌లో తెలుగుతో సహా 300 ఛానెల్‌లను చూసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు. 20 mbps వేగంతో ఇంట్రానెట్ సౌకర్యం ఉంటుందని అధికారులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం మంథని, సంగారెడ్డి జిల్లా అందోలు, నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలాల్లోని కుటుంబాలు సెప్టెంబర్ 5 నుంచి టీ-ఫైబర్ ద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలను పొందుతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ నుండి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా, T-Fibre రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ.300 చొప్పున హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలని యోచిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కు వచ్చే స్పందనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోందని అధికారులు తెలిపారు.


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : డా.బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సు లలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసిందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కళాశాల కో ఆర్డినేటర్ తుడూరు దత్తాత్రేయ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలియ చేసారు.ఇంటర్ పాస్ అయిన ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ప్రవేశం పొందడానికి చివరి తేదీ వచ్చే నెల 18 ఆగస్టు అని, 2016-17 నుండి 2023-24 వరకు అడ్మిషన్ తీసుకుని ట్యూషన్ ఫీజు కట్టని విద్యార్థులు కూడా పైన పేరుకొన్న తేదీ లోగా ఆన్ లైన్ లో చెల్లించాలని, ఇతర వివరాలకు సెల్ 9866398678, 9494314314 లేదా 7382929651 లను సంప్రదించాలని పేర్కొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : డా.బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సు లలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసిందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కళాశాల కో ఆర్డినేటర్ తుడూరు దత్తాత్రేయ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలియ చేసారు.ఇంటర్ పాస్ అయిన ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ప్రవేశం పొందడానికి చివరి తేదీ వచ్చే నెల 18 ఆగస్టు అని, 2016-17 నుండి 2023-24 వరకు అడ్మిషన్ తీసుకుని ట్యూషన్ ఫీజు కట్టని విద్యార్థులు కూడా పైన పేరుకొన్న తేదీ లోగా ఆన్ లైన్ లో చెల్లించాలని, ఇతర వివరాలకు సెల్ 9866398678, 9494314314 లేదా 7382929651 లను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా జర్నలిస్ట్ జేఏసీ బాధ్యులు అబ్దుల్ రహమాన్, రవి నాయక్ జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే కు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడేను జర్నలిస్టులతో కలిసి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇతర జిల్లాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చారని ఆసిఫాబాద్ జిల్లాలో కూడా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను వారు విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో గతంలో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి జర్నలిస్టుల ప్రధానమైన ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం కొరకు అన్ని సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేసి జర్నలిస్టుల ఇండ్ల సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని జిల్లాలోని ప్రజాప్రతినిధులు కూడా జర్నలిస్టుల ప్రధానమైన ఇండ్ల సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు జేఏసీ నాయకులు ప్రకాష్ గౌడ్ , వేణుగోపాల్, తుకారం , నరేందర్, సంతోష్, కృష్ణంరాజు , స్వామి , అన్నారావు , అబ్దుల్ హన్నాన్ , అడప సతీష్ , సోజర్ , చందు, రాధాకృష్ణ చారి శ్రీధర్, రాజు, నితేష్ తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీంఆసిఫాబాద్ :సమయపాలన,క్రమశిక్షణ,నిరంతర సాధనతో విద్యార్థుల భవిష్యత్ పురోగమించవచ్చునని సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ అన్నారు. ఆదివారం రోజున కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కృష్ణవేణి పాఠశాల ఆధ్వర్యంలో పద్మశాలి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులు దిశ నిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా పరీక్షల సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలి,ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వారు చదువులోనే కాదు జీవితంలో కూడా ముందుకు వెళతారు అని విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికను ఎంతో అద్భుతమైన రీతిలో సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ తెలియచేశారు. విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడేలా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించాలి అని ఆలోచన చేసిన కృష్ణవేణీ యాజమాన్యాన్ని వారు కొనియాడారు.సమయపాలన, క్రమ శిక్షణ, నిరంతర సాధన ద్వారా విద్యార్థులు పురోగమించవచ్చని తెలిపారు.ప్రొడక్టివ్, సూపర్ ప్రొడక్టివ్ వైపు మన గమనం ఉండాలని, తప్పుడు మనుషులతో స్నేహం, తప్పుడు పనులు చేయరాదని చెప్పారు. మీ పేరు ముందున్న ఇంటి పేరుతో కాకుండా మీ పేరు తరువాత మీ ఘనత పెట్టుకునే వైపు పయనించాలని సూచించారు. దీక్షతో ప్రయత్నిస్తే ఫలితాలు (focus-effort-result) వస్తాయని, తాత్కాలిక ఆనందం కోసం కాకుండా మంచి భవిష్యత్ కోసం కష్టపడాలని విద్యార్థులను కోరారు. ఈ నేపథ్యంలో గురువులను గౌరవించాలని, వారు చెప్పిన దారిలో పయనించాలని చెప్పారు. మన జీవితం లో అమ్మ, నాన్న, గురువు, సైనికులు, మనకు అన్నం పెట్టే రైతులే నిజమైన కథానాయకులని, వారిని గౌరవించడం మన బాధ్యత అని అన్నారు. సమయానికి విలువ ఇవ్వాలని, లేనిచో గెలుపు పరుగులో ఓడిపోవడం తద్యమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దోమల సురవర్థన్, జియా - ఉల్ - హక్ ,దోమల వేద ప్రవీణ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లి తండ్రులు ఇందులో పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్: ఈనెల 10న ఎస్పీఎం కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం,యూనియన్ గుర్తింపుకై వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందన్నారు.రిటైర్డ్ వార్డెన్, ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు అల్లి రాజయ్య అధ్యక్షతన ఆదివారం రోజున సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈనెల 10న శనివారం ఉదయం 11 గంటలకు బాలభారతి హై స్కూల్లో కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ యొక్క సమావేశంలో మిల్లులో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించుటకు చేపట్టవలసిన కార్యక్రమం గురించి చర్చించటం జరుగుతుందని,కాబట్టి కార్మికులు,కార్మిక సంఘాల నాయకులు తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.2014 సెప్టెంబర్ లో అక్రమంగా మూసివేసిన ఎస్ పి ఎం,కార్మికుల అనేక ఆందోళన ఫలితంగా 2018 ఆగస్టు రెండున తెరుసుకున్నప్పటికీ ఆరు సంవత్సరాలు గడుస్తున్న మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం కార్మిక వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు.కార్మికులు అనేక సమస్యలతో బాధపడుతున్నట్టు వారి బాధలు కష్టాలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని,జెకె పేపర్ మిల్లు చెప్పిందే చట్టం చేసిందే శాసనం గా కార్మికులు శ్రమదోపిడికి గురియగుచున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మిల్లు ప్రారంభమై ఆరు సంవత్సరాలు కావస్తున్న కనీస సౌకర్యమైన క్యాంటీన్ లేకపోవడం దురదృష్టకరమని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధమ చికిత్స చేసే సౌకర్యం కూడా లేకపోవడం అత్యంత దారుణమని ప్రజా సంఘాల నాయకులు అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జయదేవ్ ,ఉపాధ్యక్షులు ఎస్పీయం మాజీ జనరల్ సెక్రటరీ, గుల్ల పెళ్లి నాగేశ్వరరావు, ఐక్యవేదిక ఉపాధ్యక్షులు, రిటైర్డ్ హెడ్మాస్టర్ బి. నర్సయ్య, కార్మిక నాయకులు కలికోట రమణయ్య, ఐక్యవేదిక జనరల్ సెక్రెటరీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంబాల ఓదెలు, నాయకులు అడ్వకేట్ కిషోర్, బి.వేణు రాజ నరసయ్య పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్: చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా చేయూతనిద్దామని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని కోట్నాక భీమ్ రావు పిల్లల ఉద్యానవనంలో ప్రతి ఆదివారం పార్కును సందర్శించే వారికి అల్పాహారం, తినుబండారాల విక్రయ కేంద్రాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్త, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం పిల్లల ఉద్యానవనమునకు కుటుంబ సభ్యులతో సందర్శనకు వచ్చేవారు బయట నుండి తినుబండారాలు కొనుగోలు చేయకుండా పార్కులోని ఏర్పాటు చేసిన చిరు వ్యాపారులు విక్రయించే కేంద్రాల వద్ద కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని అన్నారు. తద్వారా చిరు వ్యాపారులను ప్రోత్సహించి ఉపాధి కల్పించినట్టు అవుతుందని తెలిపారు. విక్రయ కేంద్రాలలో చూడ, దయివడ, బెల్లం గులాబి పూలు, తోటకూర గారెలు, ఎగ్ లెస్ కేకులు, చకోడీలు, ఖారా, బిస్కెట్లు, చిరుధాన్యాలతో తయారుచేసిన తినుబండారాలు, చిప్స్, గప్చుప్ ఇతర తిను పదార్థాలు లభిస్తాయని, సందర్శకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ తహసిల్దార్ రమేష్, మున్సిపల్ సిబ్బంది, చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
Aug 27 2024, 12:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.1k