గార్లదిన్నె తహసిల్దార్ కార్యాలయాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేసిన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్
అనంతపురం, ఆగస్టు 23 : గార్లదిన్నె తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రికార్డు రూము పరిశీలించి, ఒక రిజిస్టర్ ను మెయింటైన్ చేయాలని, అందులో రికార్డు రూమ్ లో ప్రవేశించే వారి పేరు, హోదా, విషయము, టైమింగ్ అందులో పొందుపరచాలని, రికార్డు రూమ్ కి సంబంధించిన తాళాలను బాధ్యత కల అధికారి వద్ద ఉంచాలని తహసిల్దార్ ఈరమ్మకు ఆదేశించారు. సీసీ కెమెరాలు అనునిత్యం పనిచేసే విధంగా చూసుకోవాలని, రికార్డు రూమ్ కి సంబంధించి కిటికీలు, వర్షం పడితే పైనుండి నీరు రాకుండా రికార్డులు పాడవకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యాలయం సిబ్బందితో మాట్లాడుతూ కార్యాలయమునకు వచ్చే వారి సమస్యలు పరిష్కరించే విధంగా నడుచుకోవాలని, అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే తెలుపమని కోరారు. అనంతరం గార్లదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారని, ఏ విధమైన టెస్టులు చేస్తున్నారని, ఎన్ని రకాల మందులు ఉన్నాయి, సరిపడా మందులు ఉన్నాయా, మందుల కొరత వస్తే ఏ విధమైన చర్యలు తీసుకుంటారని, ఈ ఆస్పత్రిలో ఎన్ని డెలివరీ కేసులు, అత్యవసర కేసులు వస్తున్నాయి అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎంత మంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారని, ఆర్ఎంపీ డాక్టర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని, ఆర్ఎంపీలతో మీటింగ్ పెట్టుకొని వాళ్లు ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజక్షన్స్, స్టీరియడ్స్ ఇవ్వకుండా, అలానే abortions కండక్ట్ చేయకుండా గైడ్ లైన్స్ ఇవ్వాలని, హెచ్ డి ఎస్ కమిటీ ( హాస్పటల్ డెవలప్మెంట్ సొసైటీ ) మీటింగులు పెట్టుకోవాలని, హాస్పిటల్ డెలివరీ ఇంప్రూవ్ చేయాలని, Pcpndt act గురించి మీటింగ్స్ పెట్టుకోవాలి, Hwcs ఎప్పుడు పేషంట్లకి అందుబాటులో ఉండాలని, ఆసుపత్రికి వచ్చే ప్రజలను మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గార్లదిన్నె మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమి, డాక్టర్ మంజుల, Dr హనీష and phc స్టాఫ్ పాల్గొన్నారు.
Aug 26 2024, 07:03