నల్లగొండ: ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నేతలు..

ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

52వ జన్మదిన వేడుకల సందర్భంగా భూపాల్ రెడ్డి గారు తన స్వగ్రామమైన ఉరుమండ్లలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వి.టి.కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల కోలాహలం మరియు వేద పండితుల ఆశీర్వచనాల మధ్యలో భారీ కేక్ ను భూపాల్ రెడ్డి గారు కట్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ భూపాల్ రెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

52వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు కంచర్ల భూపాల్ రెడ్డి గారిని భారీ గజమాలతో సత్కరించారు.

కంచర్ల భూపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు... అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాలు మరియు గొల్లగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచడమే కాకుండా అనాధలకు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, నల్గొండ, కనగల్ మండల అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, ఐతగోని యాదయ్య, మహిళా నాయకులు శరణ్య రెడ్డి,కొప్పుల విమలమ్మ మరియు తదితర ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఉన్న మాటంటే ఉలుకెక్కువ -ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పోషకాహార లోపం -సస్పెన్షన్లు, బలవంతపు రాజీనామాలు తగవు -సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్

ఉన్న మాటంటే ఉలుకెక్కువ

-ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పోషకాహార లోపం

-సస్పెన్షన్లు, బలవంతపు రాజీనామాలు తగవు

-సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్

తాజాగా ప్రకటించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు ప్రభుత్వానికి అసంతృప్తిని కలిగించి ఆ నివేదికను రూపొందించిన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ సస్పెన్షన్‌కు దారి తీసింది. ఇకపై నివేదికల్లో రక్తహీనత అనే పదమే కనిపించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011-12, 2017-18 మధ్యకాలంలో దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న జనాభా శాతం పెరిగిందని జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం వెల్లడించింది. దీంతో ఆ నివేదిక ప్రచురణను ప్రభుత్వం నిలిపి వేసింది. గణాంక వివరాలు బహిర్గతం కావడానికి కారకులనే నెపంతో ఇద్దరు స్టాటిస్టీషియన్లను బలవంతంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేయించటాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ (సీసీజీజీఓఓ) జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్ తప్పుబట్టారు.

ఆహారం సరిగా లభించక పోవడం వల్లనే కరువు కాటకాలు సంభవించడం లేదని, సామాజిక, ఆర్థిక అంశాలు కూడా దానికి దోహద పడుతున్నాయని తెలిపారు. రానున్న కాలంలో పౌష్టికాహార లోపం కుటుంబాల ఆర్థిక వనరులపై ప్రభావం చూపబోతోందని, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా భవిష్యత్‌లో ఆహార భద్రతకు అనేక సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు కేవలం ఆహార ధాన్యాలను మాత్రమే అందిస్తున్నారు తప్పించి అవసరమైన పప్పు ధాన్యాలు మొదలైన నిత్యావసరాలు సరఫరా చేయడం లేదు. ఫలితంగా ప్రజల్లో పోషకాహార లోపం ఏర్పడింది.

అందుబాటులో లేని ఆరోగ్యకరమైన ఆహారం

ఆహార భద్రత, పోషకాహారంపై 2011లో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ఓ పరిశీలన ప్రారంభించింది. భారతదేశంలోని జనాభాలో 74.1 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదని అది తేల్చింది. గతేడాది విడుదలైన ప్రపంచ ఆకలి సూచికలో భారత్‌ 111వ స్థానంలో (మొత్తం 125 దేశాల్లో) నిలిచింది. ఈ సూచికలో ప్రతి ఏటా మన ర్యాంకింగ్‌ పడిపోతూనే ఉంది. 2016లో 97, 2017లో 100, 2018లో 103, 2022లో 107… ఇలా మన ర్యాంక్‌ పతనమవుతూనే ఉంది. హైతీ, సబ్‌-సహారా ఆఫ్రికాలోని 12 దేశాలు మాత్రమే మన కంటే తక్కువ ర్యాంకులో ఉన్నాయి. దేశంలో ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు తక్కువ బరువును, 36 శాతం మంది తక్కువ ఎత్తును కలిగి ఉన్నారని 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. వయసుకు తగినట్టు బరువు, ఎత్తు లేకపోవడం పోషకాహార లోపానికి సూచికలు. 19 శాతం మంది పిల్లలైతే ఎత్తుకు తగిన బరువు లేక పీలగా ఉన్నారు. ఇది కూడా పోషకాహార లోపం సూచికే. 2019-21లో దేశ జనాభాలో 36 శాతం మంది కుంగుబాటుకు లోనయ్యారు. 19 శాతం మంది అసాధారణ రీతిలో బలహీనంగా ఉన్నారు. 6-59 నెలల మధ్య వయసున్న పిల్లల్లో 67 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పెద్ద వారిలో… అంటే 15-49 ఏండ్ల మధ్య వయస్కుల్లో 57 శాతం మహిళలు రక్తహీనతకు గురయ్యారు.

సౌకర్యాల కొరతతో వృథా

దేశంలో తృణధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఆహారధాన్యాల తలసరి లభ్యత తగ్గిపోతోంది. 1991లో ఒక్కో వ్యక్తికి రోజుకు 510.1 గ్రాముల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండగా 2021లో 507.9 గ్రాములు మాత్రమే లభించాయి. వివిధ కారణాల వల్ల వ్యవసాయోత్పత్తుల్లో 40 శాతం వరకూ నష్టపోవాల్సి వస్తోంది. కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడంతో పండ్లు, పాలు వంటి 1.3 బిలియన్‌ టన్నుల సరుకులను నష్ట పోవాల్సి వస్తోంది. 

వ్యవసాయోత్పత్తిపై వాతావరణ మార్పుల ప్రభావం

 2020-2050 మధ్యకాలంలో దేశ జనాభా 0.82 శాతం వార్షిక వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా. అంటే శతాబ్దం మధ్య నాటికి దేశ జనాభా 172,33,80,000కు చేరుతుంది. ఇందుకనుగుణంగా తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి సగటున ఏటా వరుసగా 2.65 శాతం, 4.9 శాతం, 2.84 శాతం, 4.65 శాతం, 4.58 శాతం, 11.57 శాతం, 5.82 శాతం మేర పెరగాలి. వాతావరణ మార్పులు సంభవిస్తే ఉత్పత్తిపై ప్రభావం పడవచ్చు. ఉదాహరణకు 2021లో 113 మిలియన్‌ టన్నుల గోధుమలు ఉత్పత్తి కాగా 2022లో 107 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఈ ఏడాది అది మరింత పడిపోయి 105 మిలియన్‌ టన్నులకు చేరుతుందని అంచనా. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా బియ్యం ఉత్పత్తి పడిపోయింది. అందుకే బాసుమతియేతర బియ్యం ఎగుమతులను కేంద్రం నిలిపివేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల ఉత్పత్తి తగ్గిపోతే దాని ప్రభావం ఆకలిపై పడుతుంది. 2050 నాటికి ఆకలితో బాధపడే వారి సంఖ్య 11 నుంచి 20 శాతం వరకూ పెరగవచ్చునని ఓ నివేదిక తెలిపింది. దేశంలో 2022 నుండి తీవ్రమైన వడగాల్పులు సర్వసాధారణమై పోయాయి. వాతావరణ మార్పులే దీనికి కారణం. 1900-2018 మధ్యకాలంలో దేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత 0.7 డిగ్రీలు పెరిగింది.

ఉత్పత్తి పెంపు అనివార్యం

 జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయోత్పత్తులు పెరగకపోతే ఎగుమతులను తగ్గించుకోవడంతో పాటు నిత్యావసరాలను మరోసారి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడవచ్చు. ఈ పరిణామం మన విదేశీ వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. మనం ఇప్పటికే పప్పులు, వంటనూనెలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. బియ్యం, గోధుమల ఎగుమతులపై విధించిన నిషేధం కారణంగా భారత్ అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ అంచనా ప్రకారం జనాభా అవసరాలను తీర్చాలంటే 2030 నాటికి 311 టన్నులు, 2050 నాటికి 350 టన్నుల ఆహార ధాన్యాలను మన దేశం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఉత్పాదకతనైనా పెంచాలి లేదా సాగు భూమినైనా పెంచాలని వి. కృష్ణ మోహన్ సూచించారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

వివిధ కారణాలతో దేశంలో 147 మిలియన్‌ హెక్టార్ల భూమి ఇప్పటికే సారాన్ని కోల్పోయింది. వాతావరణ మార్పులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2050 నాటికి వ్యవసాయ యోగ్యమైన భూమిలో సగం బీడుగా మారిపోయే ప్రమాదం ఉంది. అంతిమంగా అది ఉత్పాదకత తగ్గడానికి దారితీస్తుంది. భూమిలో లవణాలు పేరుకుపోతున్నాయని, ఫలితంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని, ఆర్థికాభివృద్ధి దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేండ్ల క్రితం… అంటే 2012-14లో వేసిన ఓ అంచనా ప్రకారం భూమిలో లవణాలు పేరుకు పోవడంతో అప్పటికే 16.84 మిలియన్‌ టన్నుల వ్యవసాయోత్పత్తులకు నష్టం చేకూరింది. పులి మీద పుట్రలా జల వనరుల లభ్యత కూడా తగ్గిపోతోంది. జనాభాతో పాటు నీటి వినియోగం కూడా పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. హరిత విప్లవ కాలం నుంచి నీటి వినియోగం అధికంగా ఉండే పంటలనే రైతులు పండిస్తున్నారు. దేశంలో లభ్యమవుతున్న భూగర్భ జలాలలో 89 శాతం వ్యవసాయానికే ఖర్చవుతున్నాయి. అందుకే 2007-2017 మధ్యకాలంలో భూగర్భ జల మట్టం 61 శాతం పడిపోయింది.

భవిష్యత్తులో ఆకలి కేకలు నివారించేందుకు ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే బదులు సర్వే ఫలితాల ఆధారంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, అంతే గాని నివేదికను రూపొందించిన ఆఫీసర్లను సస్పెండ్ చేయటం, బలవంతంగా రాజీనామాలు చేయించటం మానుకోవాలని ప్రధాన మంత్రికి వి. కృష్ణ మోహన్ విజ్ఞప్తి చేశారు.

నల్లగొండ: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బీసీ మండల్ జయంతి వేడుక.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య..

బిపి మండల్ గారి 106 వ జయంతి సందర్భంగా నల్లగొండ, కోర్టు ఎదురుగా బి.పి మండల్ విగ్రహం దగ్గర ఘనంగా జయంతి వేడుకలు మిర్యాల యాదగిరి సభా అద్యక్షులు (బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు) ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యాసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతం కు పెంచాలని లేకపోతే ఉద్యమం ఉధృతం - హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటీసీ, వార్డు మెంబర్ల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం కు పెంచుతామని మేనిఫెస్టో లో తెలిపిన ప్రకారం మాట మీద నిలబడి పెంచాలని జాతీయ బీసీ సంఘం అద్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఈ మేరకు హెచ్చరిక చేశారు‌. ప్రభుత్వం వచ్చే అక్టోబర్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది.కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి.ఇంకా కులగణన ప్రక్రియ ప్రారంభించలేదు. బిసి సంఘాల ఆధ్వర్యంలో కులగనన చేయాలని 42 శాతం కు బిసి రిజర్వేషన్లు పెంచాలని మూడు నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. రాహుల్ గాంధీ అయినా స్పందించాలని కోరారు.రాష్ట్రంలో అన్ని పార్టీ రాజకీయ పార్టీలు టిఆర్ఎస్,బిజెపి,సిపిఐ, సిపిఎం పార్టీలు బిసి రిజర్వేషన్లపై మద్దతు తెలుపుతారా? లేదా ? విధాన ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ వాగ్దానాన్ని బీసీలు నమ్మారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని బిసి నేతలు జెండాలు మోసుకుంటూ జిందాబాద్ లో పొట్టు కొట్టు బానిస బతుకులు వద్దు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు త్వరలో గ్రామ ఉద్యమాన్ని విస్తరింప చేస్తామని హెచ్చరించారు ప్రతి ఒక్క బీసీ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బహిరంగ సభలో ప్రతిరోజు కుల జనన జరుపుతామని దాని ప్రకారము విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని బడ్జెట్ కేటాయిస్తామని -బిసి ఎజెండా ఎత్తుకొని బీసీల అభిమానం చూరగొంటుంటే ఇక్కడ బీసీలకు అన్యాయం చేయడం తగు న్యాయమా అని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ చేయాలి సుప్రీంకోర్టు ప్రకారం తీర్పు ప్రకారం 50 శాతం సీలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీలు లేదు ఇప్పటికే అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి 50 శాతం సీలింగ్ పై పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది ఆ అగ్రకులాలకు రిజర్వేషన్లను పెంచడానికి మూడు రోజులలో లోక్సభ రాజ్యసభలలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారు కానీ 50% జనాభా గల బీద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా మా దేశంలో ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. అసెంబ్లీలో చట్టం చేసి 92 శాతం పెట్టవచ్చు అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నవి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం గతంలో 1986లో బిసి సంక్షేమ సంఘం అనేక ఉద్యమాలు చేయగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు స్పందించి బీసీలకు జడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలలో 20% రిజర్వేషన్లు పెట్టారు. సర్పంచ్ లకు పెట్టలేదు బీసీ రిజర్వేషన్లను 50 శాతం కు పెంచాలని సర్పంచ్ ఎన్నికలలో కూడా బీసీ రిజర్వేషన్లు పెట్టాలని బిసి సంక్షేమ సంఘం ఆరు సంవత్సరాలు వరుసగా సుధీర్గంగా ఉద్యమాలు చేయగా 1993లో అప్పటి ముఖ్యమంత్రి ఉదయ భాస్కర్ రెడ్డి స్పందించి ఒక మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి బీసీ సంఘాలతో చర్చించి 20% నుంచి 34 శాతం పెంచుతూ రిజర్వేషన్లు పెట్టారు. అప్పటినుంచి 2019 వరకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగాయి సుప్రీంకోర్టు తర్వాత తీర్పు ప్రకారం 2019లో స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతం కు తగ్గించారు దీనితో బీసీలకు అన్యాయం జరిగింది అప్పటినుంచి జాతీయం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దీన్ని పార్లమెంటు వద్ద ధర్నాలు జరిపి అన్ని పార్టీల మీద ఒత్తిడి తేవడంతో కులగణన జరిపి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని అన్ని పార్టీలు హామీ ఇచ్చారు అందులో భాగమే పెంచుతామన్న కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రకారం పెంచుతామని హామీ ఇచ్చారన్నారు.

రాజారాం యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగం లో బిసి లకు రిజర్వేషన్లు కల్పించలేదు. రాజ్యాంగ సవరణ చేసి బిసి లకు జనాభా లెక్కల ప్రకారం బిసి లకు రిజర్వేషన్లు కల్పించాలి.దేశవ్యాప్యంగా కులగణన చెపట్టాలి లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం.కాంగ్రస్ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకారం కుల గణన చేపట్టాలి.స్తానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలి.

బిపి మండల్ విగ్రహ కమిటీ చైర్మన్ నాగుల వేణు మాధవ్ మాట్లాడుతూ రాజ్యాధికారంలో ఉన్న వర్గాలే రిజర్వేషన్లు తీసుకోవడం చరిత్రలో ఎక్కడ కూడా జరగదు అని అన్నారు.ఉద్యోగుల ప్రమౌషన్స్ లో రిజర్వేషన్లు కల్పించాలని, కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దూకుడుకు లక్ష్మీ నారాయణ, నీల వెంకటేశం, పిల్లి రామరాజు, వంగూరి నారాయణ యాదవ్, ప్రసన్న, శిరందాసు రామదాసు, సత్తయ్య, సర్పాల వెంకన్న, అల్లి వేణు, మామిడి పద్మ, సింగం లక్ష్మీ,

 కొండూరు సత్యనారాయణ, గోవార్దన్, గద్దె నాగరాజు, సతీష్ యాదవ్, వల్లేకీర్తీ శ్రీనివాస్, మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట: జన సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా బీసీ మండల్ జయంతి.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనార్దన్ యాదవ్..

బీపీ మండల్ జయంతి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాబు బిందెశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ జయంతి కార్యక్రమం జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ళ జనార్ధన్ యాదవ్ ఆధ్వర్యంలో 60 ఫీట్ల రోడ్లో మహర్షి డిగ్రీ కళాశాలలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి డాక్టర్ వూర రామూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి బీపీ మండల్ వల్లనే బీసీలకు విద్య, ఉద్యోగాలో 27% రిజర్వేషన్లు వచ్చాయని తెలియజేశారు.

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శీలం యాదగిరి మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు అండగా ఉన్నది బీపీ మండల్, వారి ఉద్యమ స్ఫూర్తితో 1993 నుండి బీసీలకు 27% విద్యా ఉద్యోగులో రిజర్వేషన్లు పొందుతున్నారు అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వము సమగ్ర కులగణన జరిపి చట్టసభలలో వెనకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

సభా అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో బీపీ మండల్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఇప్పుడు జరగవలసిన ఉద్యమం బీసీల రిజర్వేషన్ల ఉద్యమం, మండల్ ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి బీసీ బిడ్డ మన రిజర్వేషన్ల కోసం పోరాడవలసిన అవసరం ఉందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వెంకట నరసయ్య, ముద్దం బిక్షపతి, తోట శ్రీనివాస్, గోపీనాథ్, జటంగి వీరస్వామి, వెంకట్, వీరబోయిన లింగయ్య, భారి అశోక్, పల్లెటి రమేష్, మధుకర్, మహేష్, రాజేష్, మల్లేష్, శ్రీను, నగేష్, అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట లో.. ప్రెస్ మిట్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు.. ......

యాదగిరిగుట్ట లో..

ప్రెస్ మిట్ నిర్వహించిన...

మాజీ మంత్రి హరీష్ రావు..

......

పాయింట్స్.....

ప్రజాపాలన అని పోలీస్ రాజ్యం నడుతున్నాడు రేవంత్ రెడ్డి..

రుణమాఫీ చేయాలని మా కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే బలవంతంగా అరెస్ట్ లు చేస్తున్నారు..

జర్నలిస్టుల పైన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు..

రేవంత్ రెడ్డి అడుగడుగునా మోసం చేస్తున్నాడు...

రైతుల రుణం తీరిస్తా అన్నోడు ఇవ్వాళ రైతులతో రణం చేస్తున్నాడు..

రుణమాఫీ కాలేదు అని అడిగితే కేస్ లు పెడుతున్నాడు..

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా...

ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తావా..

ఎన్ని కేస్ లు పెట్టిన రుణమాఫీ 100 శాతం చేసేదాక పోరాటం చేస్తాం..

పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలి...

ఆరు గ్యారంటీ లతో మొట్టమొదటి మోసం చేసిండూ...

పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 100 % రుణమాఫీ చేస్తా అన్నాడు.. కానీ ఇవ్వాళ మాట తప్పిండు.

మాట తప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి పాపాత్ముడిని క్షమించండి అని, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసినం..

తెలంగాణ ప్రజల మీద కరుణ చూపమని వేడు కున్నాము..

సాక్షాత్తు యాదాద్రి స్వామిపై ఒట్టేసి పచ్చి మోసం చేసిండూ.. రేవంత్ లాంటి దగుల్భాజి వ్యక్తి ని ఇప్పటివరకు చూడలేదు..

మోసం చేసే నైజం రేవంత్ ది..

దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనుడు రేవంత్....మంత్రులు ఒక మాట, సీఎం ఒక మాట మాట్లాడుతున్నారు... ఏది నిజం ఏది అబద్ధం ..తేల్చాలి...

54 శాతం రుణమాఫీ కాలేదు..

దీన్ని బట్టి ఎవ్వరు రాజీనామా చేయాలి చెప్పు...రేవంత్ బయటికి వచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..

రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి...

దేవుళ్ళకు కూడా క్షమాపణలు చెప్పాలి..

ఈ దివాళా కోరు ముఖ్యమంత్రి ని దేవుడు క్షమించు అని మిము పూజలు చేసినం..

పాలకుడే పాపం చేసిండు..

పాలకుడే పాపాత్ముడు అయ్యాడు...ఇప్పటివరకు అయిన రుణమాఫీ పై శ్వేతపత్రం విడుదల చేయాలి...

రైతుల పాపం రేవంత్ కి తగులుతుంది...యాదాద్రి ఆలయం నుంచే మా యాత్ర మొదలుపెట్టిన... ఆయన ఒట్టు వేసిన అన్ని ఆలయాలకు వెళతాం... ని భoడారాన్ని బయటపెడతమ్...దేవుణ్ణి కూడా మోసం చేసిన దగుల్భాజి రేవంత్ రెడ్డి...పాలన లేకుండా గారడి చేస్తున్నారు...

పైగా..మళ్ళీ నన్ను రాజీనామా చేయాలని అంటుండు....

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..

లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత మరొకసారి అస్వస్థత కు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో కవితకు చికిత్స.. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవిత..

Ts:టాప్‌ కళాశాలల్లోనూ సీఎస్‌ఈ సీట్లు ఖాళీ జేఎన్‌టీయూహెచ్, ఓయూలోనూ అదే పరిస్థితి ఐదు ప్రభుత్వ కళాశాలల్లో సగమే భర్తీ..

Btech Seats: టాప్‌ కళాశాలల్లోనూ సీఎస్‌ఈ సీట్లు ఖాళీ

జేఎన్‌టీయూహెచ్, ఓయూలోనూ అదే పరిస్థితి

ఐదు ప్రభుత్వ కళాశాలల్లో సగమే భర్తీ

హైదరాబాద్‌: రాష్ట్రంలోని జేఎన్‌టీయూహెచ్, ఓయూ క్యాంపస్‌ కళాశాలలతోపాటు ప్రముఖ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ బీటెక్‌ సీట్లు మిగిలిపోయాయి. వాటిలో అత్యంత డిమాండ్‌ ఉన్న సీఎస్‌ఈ సీట్లూ ఉండటం గమనార్హం. జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని వర్సిటీ కళాశాలల్లోని మొత్తం సీట్లలో సగానికిపైగా నిండలేదు. అంతర్గత స్లైడింగ్‌ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈసారి విద్యాశాఖే ఆ ప్రక్రియ చేపట్టడంతో కళాశాలలు, బ్రాంచీల వారీగా ఖాళీల వివరాలను ప్రకటించింది.

మొత్తం 11,836 సీట్లు భర్తీకాకుండా మిగిలిపోయాయి. వాటిల్లో సీఎస్‌ఈ, ఐటీ, డేటా సైన్స్, ఏఐ అండ్‌ ఎంఎల్‌ సీట్లు ఉండటం విశేషం. దశాబ్దంన్నర క్రితం నెలకొల్పిన జేఎన్‌టీయూ జగిత్యాలలో సైతం 330కి 204 సీట్లు (62%) నిండకపోవడంపై విద్యాశాఖ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి.

కొత్తగా ప్రారంభించిన పాలేరు, సిరిసిల్ల, మహబూబాబాద్, వనపర్తితోపాటు రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలోనే సగానికిపైగా సీట్లు నిండలేదు.

Ts:యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

,హైదరాబాద్‌: తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశు వైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు తేదీని ఈనెల 29 వరకు పొడిగించారు.

బైపీసీ స్ట్రీమ్‌ కోర్సుల్లో దరఖాస్తు చేసుకునే తేదీని పెంచినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ పి.రఘురామిరెడ్డి బుధవారం తెలిపారు.

జులై 12 నుంచి ఆగస్టు 17 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, తొలి విడతలో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ 

www.pjtsau.edu.in

ను సందర్శించాలని కోరారు.

Ts:నిర్వహణ పనులతో పలు రైళ్లు రద్దు ...

నిర్వహణ పనులతో పలు రైళ్లు రద్దు ...

హైదరాబాద్‌: సికింద్రాబాద్, హైదరాబాద్‌ రైల్వే డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

సికింద్రాబాద్‌-వరంగల్, వరంగల్‌-హైదరాబాద్‌ మెమూ, కాజీపేట-బల్లార్ష రైళ్లు సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 30 వరకు నెలరోజుల పాటు రద్దయ్యాయి. బల్లార్ష-కాజీపేట రైలు సెప్టెంబరు 2 నుంచి అక్టోబరు 1 వరకు.. సిర్పూర్‌టౌన్‌-కరీంనగర్, కరీంనగర్‌-బోధన్‌ మెమూ రైళ్లు సెప్టెంబరు 1-30 వరకు, బోధన్‌-కరీంనగర్‌ మెము సెప్టెంబరు 2 నుంచి అక్టోబరు 1 వరకు.. కాచిగూడ-నడికుడి, నడికుడి-కాచిగూడ రైళ్లు సెప్టెంబరు 1-30 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని ద.మ.రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

హెచ్‌ఎస్‌ నాందేడ్‌-రాయచూరు రైలు సెప్టెంబరు 1 నుంచి 30 వరకు తాండూరు-రాయచూరు మధ్య పాక్షికంగా రద్దయ్యింది. అదేవిధంగా భద్రాచలం రోడ్‌-బల్లార్ష, సిర్పూర్‌టౌన్‌-భద్రాచలం రైళ్లకు సెప్టెంబరు 1-30 వరకు కాజీపేట స్టేషన్‌లో స్టాపేజిని తొలగించారు.

భద్రాచలం: చర్ల:ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే తెల్లo వెంకటరావుకు వినతి పత్రం అందజేసిన న్యూడెమోక్రసీ బృందం

ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే తెల్లo వెంకటరావుకు వినతి పత్రం అందజేసిన న్యూడెమోక్రసీ బృందం

రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని, ఆర్ గ్యారంటీల అమలకు పూనుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావుకు వినతిపత్రం అందజేయడం జరిగింది. 

అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్* మాట్లాడుతూ పది సంవత్సరాలు టిఆర్ఎస్ దొరల పాలన చేసిందని ఏ ఒక్కరిని పట్టించుకోలేదని మార్పు రావాలని నేర్పంతో ఈ రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈనాడు వాడు దాటినాక ఓడ మల్లయ్య లాగ వ్యవహరిస్తున్నాడని ఆయన అన్నారు. మీ జిల్లాలో 57,000 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని అందులో రెండు లక్షల వారు 11,000 మంది మాత్రమే ఉన్నారని ఇంకా వేలాది మంది రైతులు ఉన్నారని వారికి రేషన్ కార్డు ఆధార్ కార్డు పహాని నకాలని అనేక కథలు చెబుతున్నారని వారన్నారు. ఈ పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినంక కూడా ఇచ్చింది లేదని ఇప్పుడు రేషన్ కార్డుతో ఆంక్షలు పెట్టడం అంటే దీని ఉద్దేశం ఏంటని ఆయన అన్నారు. తక్షణమే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలని అమలు చేయాలని ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆంక్షలు లేకుండా బ్యాంకు మేనేజర్ లతో మాట్లాడి తక్షణమే రుణమాఫీ చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫారం మండల నాయకులు గొంది ముయ్యన్న పిడిఎస్యు మండల నాయకులు ఇర్ఫా రాజేష్ సురేష్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.