గండికోట రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రధాన చెరువులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..

గండికోట రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రధాన చెరువులకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ యల్లనూరు మండలం కోడుమూర్తి పంపు హౌస్ నుండి బట్టన్ నొక్కి నీరు విడుదల ప్రజల అవసరాల నిమిత్తం సాగు తాగు నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే మండలంలోని ప్రధాన చెరువులు యల్లనూరు,గడ్డంవారి పల్లి,గొడ్డుమర్రి చెరువులకు నీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

ZPH స్కూల్ లోను, MPP స్కూల్ లలో వర్షం నీరు నిలిచి గుంతలను సొంత ఖర్చుతో పూడిపించిన.. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి..
MLA బండారు శ్రావణి శ్రీ గారు మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం స్వాగ్రామం సిద్దారంపురంలోని ZPH స్కూల్ లోను మరియు MPP స్కూల్ లలో వర్షం నీరు నిలిచి నడిచేకి కూడా సరిగా లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులా అవస్థలు తెలుసుకొని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు సొంత ఖర్చుతో ట్రాక్టర్ లతో మట్టి నీ తొలించి చదునుచేపించారు.ఈ కార్యక్రమంలో ZPH స్కూల్ కమిటీ చైర్మన్ లింగమయ్య, MPP స్కూల్ కమిటీ చైర్మన్ అంజి,కాటమయ్య, నాగేంద్ర, అది, రవి, మారుతీ, నరసింహులు, చెన్నమయ్య, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు*.
రాజధాని నిర్మాణం, అన్న క్యాంటీన్లకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన పారిశ్రామికవేత్త ఠాగూర్.. అభినందించిన సీఎం చంద్రబాబు..
విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త, డీఆర్ఎన్ ఠాగూర్ గ్రూప్ చైర్మన్ ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్ అమరావతి రాజధాని, అన్న క్యాంటీన్ లకు కోటి రూపాయలు చొప్పున రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు.

కడప జిల్లా, పాయసం పల్లెకు చెందిన ఎన్వీ నారాయణ రెడ్డి రాజధానికి రూ.10,00,116ను విరాళంగా అందించారు. 

రాజధానిలో భాగస్వామ్యం కావాలనే స్ఫూర్తితో, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కు చేయూతను ఇవ్వాలనే మంచి ఆలోచనతో విరాళం ఇచ్చిన రవీంద్రనాథ్ ఠాకూర్, ఎన్వీరమణారెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
గార్లదిన్నె మండల కేంద్రంలో ఉన్న ఏపీ మైనారిటీ గురుకుల పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలి..
గార్లదిన్నె మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏపీ మైనారిటీ గురుకుల పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలి.. విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా తరగతులు మరియు హాస్టల్ గదులను ఏర్పాటు చేయాలి. ఏపీ మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు నూతన భవనం ఏర్పాటు చేయాలి విద్యార్థులకు అవసరమైన మంచినీరు మరియు టాయిలెట్ సదుపాయాలు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలి. విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని పాఠశాల ఎదుట విద్యార్థులు SFI నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు.. మంత్రి లోకేష్ తో భేటీ అయిన హెచ్ సిఎల్ ప్రతినిధులు..
ఎపిలో భారీవిస్తరణకు హెచ్ సిఎల్ సన్నాహాలు! అమరావతి: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్ సిఎల్ ఆంధ్రప్రదేశ్ లో తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్ సిఎల్ ప్రస్తుతం 4,500 మందికి ఉద్యోగాలు కల్పించింది. రాష్ట్రంలో భారీఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు హెచ్ సిఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివ శంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ వెల్లడించారు. హెచ్ సిఎల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు. ఎపిలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్ సిఎల్ ప్రతినిధులు తెలిపారు. ఫేజ్ 2 లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఐటిలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ట్రెండ్స్ కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్ , స్కిల్ డెవెలప్మెంట్ లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విస్తరణకు కావాల్సిన కొన్ని అనుమతులు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్ సిఎల్ ప్రతినిధులు మంత్రిని కోరారు. విడతల వారీగా రాయితీలు విడుదల చేస్తాం మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ... గత టిడిపి హయాంలో అనేక రాష్ట్రాలు పోటీపడగా, తాను స్వయంగా వెళ్లి హెచ్ సి ఎల్ ఛైర్ పర్సన్ శివ్ నాడార్ తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని చెప్పారు. రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం తనకు మంచి అనుభూతి నిచ్చిందని అన్నారు. గన్నవరం వైపు వెళ్లిన ప్రతిసారీ యువతకు 4500 మందికి ఉద్యోగాలు కల్పించామన్న సంతృప్తి, సంతోషం కలిగేవని చెప్పారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్ధత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయింది. పూర్తి స్థాయి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది... అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. మీ కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తాం, ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన క్లియర్ చేస్తాం, గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తాం. మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మీరు పనిచేయండి, అందుకు అవసరమైన పూర్తి సహకారం మేము అందిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఐటిలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్ సిఎల్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. **
టీడీపీ కార్యకర్త గాజుల దాదు కుటుంబానికి అండగా నిలిచిన ఆర్థిక సహాయం అందించిన.. దండు శ్రీనివాసులు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి..

శింగనమల : శింగనమల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాజుల దాదు భార్య అనారోగ్యంతో నిన్న రాత్రి 9 గంటలకు మరణించింది. దాదు భార్య మృతితో దాదు కుమారుడు అబ్దుల్ (5సం") కూతురు ఆలియా (2సం") ఈ పిల్లల రోదన అక్కడ ఉన్నటువంటి మహిళలను కన్నీటి పర్వతానికి గురిచేసి ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు* ఈ కార్యక్రమంలో *యం.ఆదినారాయణ, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి తెలుగు యువత శింగనమల మండల అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, బాబా వలి,కాయల శివశంకర్,చంద్ బాష* తదితరులు పాల్గొన్నారు

ఓబులేసు వివాహానికి 10,000 రూ. ఆర్థిక సహాయం చేసిన ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి..
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం జమ్మలదిన్నె గ్రామంలో నివాసముంటున్న సహదేవుడు కుమారుడు ఓబులేసు వివాహనికి ₹10000 ఆర్థిక సహాయన్ని అందజేసిన *నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మన శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో *మండల కన్వీనర్ పాండు, మాజీ zptc గుర్రం ఆదినారాయణ, మంగళ రామాంజి* తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వివాహానికి 10,000 రూ. ఆర్థిక సహాయం చేసిన  ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు...
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం ఎర్రగుంట గ్రామంలో నివాసముంటున్న J చెన్నప్ప కుమారుడు J నవీన్ కుమార్ వివాహనికి ₹10000 ఆర్థిక సహాయన్ని అందజేసిన *నిరుపేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మన శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారు* మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరం వారి వైవాహిక జీవితం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో *EX MPTC ఈశ్వరయ్య మాజీ మండల కన్వీనర్ కోటంక జయరాం పరంధామయ్య శ్రీరామ్ * నాయకులు కార్యకర్తలు* పాల్గొన్నారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రూపొందించిన వాల్ పోస్టర్ ను పరిశీలించిన.. అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న..
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మరో ఉద్యమం..

అనంతపురం: సమాజాభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో ఉద్యమ స్థాయిలో ప్రచారానికి ఐసీడీఎస్ శాఖ శ్రీకారం చుట్టింది. * అనంతపురం కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఆలోచన, ఆదేశాలకనుగుణంగా ఐసీడీఎస్ శాఖ ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టింది.  ఐసీడీఎస్ పీడీ డాక్టర్ బీఎన్ శ్రీదేవి, డీసీపీఓ మంజునాథ ఆధ్వర్యంలో వంద రోజుల ప్రణాళిక రూపొందించుకొని ఊరూరా, వాడవాడలా విస్తృత ప్రచారానికి నడుం బిగించారు. * బ్యానర్లు, వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, జనసమ్మర్ధం కలిగిన ప్రదేశాలు, బస్సులు, ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థల్లో వీటిని ప్రదర్శిస్తూ, సదస్సులు నిర్వహిస్తూ చైతన్యం తెస్తున్నారు. * బాల్య వివాహాలు లేని జిల్లాగా చూడలన్నదే కలెక్టర్ వినోద్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న సంకల్పం. వాటిని సాకారం చేసే దిశగా ఐసీడీఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
చేతికొచ్చిన కాకర పంట ఈదురు గాలుల భారీ వర్షానికి నేలమట్టం.. రెండు లక్షల పైబడి పంట నష్టం వాటిల్లిందని రైతు బ్యాల్ల సుదర్శన్ ఆవేదన..
అనంతపురం జిల్లా సింగమల మండలం గుమ్మేపల్లి గ్రామంలో రాత్రి కురిసిన ఈదురు గాలుల భారీ వర్షానికి గ్రామానికి చెందిన రైతు బ్యాల్ల సుదర్శన్ సాగు చేస్తున్న కాకర పంట రెండు ఎకరాల్లో నేలమట్టం అయిందని, రైతుకు రెండు లక్షల పైబడి నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతు కోరారు..