4 వ రోజు మిర్యాల పట్టణంలోని నేను నా మిర్యాలగూడ *ఎమ్మెల్యే* *బత్తుల లక్ష్మారెడ్డి *( B L R)
B L R గారి ఆదేశాల మేరకు 30 వ వార్డ్ బంగారుగడ్డ లో స్వచ్ఛంద పారిశుద్ధ్య కార్యక్రమంలో  మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ *ఆలగడప గిరిధర్* గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు వార్డు ఇన్చార్జులు నాయకులు కార్యకర్తలు కలిసి వార్డు లోని డ్రైనేజీలను పరిసరాలను పరిశుభ్రంగా చేయడమే కాక మోరి లో తీసిన షీల్డ్ ను చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్టర్లు మున్సిపల్ వాహనాల్లో డబ్బింగ్ యార్డ్ కి పంపించడం జరిగింది.
30 వ వార్డు ఇంచార్జ్ *ఆళ్లగడప గిరిధర్ వర్షాన్ని సైతం* లెక్కచేయకుండా మున్సిపల్ సిబ్బందిని వార్డ్ నాయకులను ఇన్చార్జిలను కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ నేను నా మిర్యాలగూడ స్వచ్ఛ సేవా కార్యక్రమం విజయవంతంగా ముగించడం జరిగింది . అనంతరం బ్లీచింగ్, ఫాగింగ్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జిలుగ కౌన్సిలర్లు ఎస్.కె జావిద్, చిలుకూరి బాలకృష్ణ , గోదాల జానకిరామిరెడ్డి, పాతూరి శరత్, సోమగాని శ్రీనివాస్, గొట్టిముక్కల లక్ష్మణ్ మరియు తాండవ కృష్ణ , పగిళ్లసత్యం, గోగుకొండలు, నాగుల్ మీరా, పందిరి సైదులు, కంచర్లకిరణ్ ,జిల్లా నవీన్ ,సందీప్, కామాజి వెంకన్న , దుండిగాల సోమయ్య సజ్జత్ , ఉబేద్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

*అంగన్వాడీ కేంద్రాన్ని* సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి
ఈరోజు వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని *అంగన్వాడీ కేంద్రాన్ని* సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.పిల్లలకు మరియు గర్భిణీ మహిళలకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు సక్రమంగా వారికి అందజేయాలని సూచించారు .. అలాగే పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు వారికి అక్షరాలు నేర్పించే మొదటి గురువులు అంగన్వాడీ టీచర్స్ కాబట్టి వారికి బడి వాతావరణ అలవాటు అయ్యేలా వారిని చూసుకోవాలి అని అన్నారు.
అనంతరం పిల్లలతో కలసి అక్షరాలు దిద్ధించారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
*ఇవాళ నేపాల్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారo*
నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
*తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపదాత్ ముంచి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
*తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి శ్రీమతి దీపదాత్ ముంచి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
*విజయవంతంగా సాగిన రెండవరోజు నేను నా మిర్యాలగూడ , పట్టణ పారిశుధ్య కార్యక్రమం*
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.
నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన *పట్టణ పారిశుధ్య* స్వచ్ఛంద కార్యక్రమం విజయవంతం రెండవ రోజు *33, 02, 05,19,46,07,09,13,43,27,25,23 వార్డులలో* పూర్తిచేసుకోవడం జరిగింది .
ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఇంచార్జ్ లు మరియు పట్టణ పారిశుధ్య కార్మికులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.






*మిర్యాలగూడలో గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన MLA -BLR*
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని *తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల ను* *MEO గారితో* కలసి ఆకస్మికంగా సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* .
హాస్టల్ లోని ఉదయం అల్పాహారం చూసి నాణ్యత లేకుండా ఎలాంటి పోషకాలు లేని ఇలాంటి అల్పాహారం విద్యార్థులకు పెడుతున్నారా అంటూ హాస్టల్ సిబ్బందిపై మరియు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు... ప్రతిరోజూ ఉదయం పెట్టే అల్పాహారం లిస్ట్ మరియు .ఈరోజు అల్పాహారంలో ఉపయోగించిన వస్తువుల లిస్ట్ వెంటనే నాకు వివరణ ఇవ్వాలని సూచించారు .అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు.
హాస్టల్ లో టాయిలెట్స్ శుభ్రంగా లేవు ఇలా ఉండటం మూలాన దోమలు అధికమై విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి వెంటనే వాటిని శుభ్రపరచి ప్రతిరోజూ సానిటైజేషన్ చేయాలి అని హెచ్చరించారు.


అనంతరం విద్యార్థులతో కలిసి ఉదయం ప్రేర్ లో పాల్గొని సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మీరు మంచి విద్యను నేర్చుకొని మీ తల్లి తండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.. నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి కాదు.. నేను అప్పుడైనా, ఇప్పుడైన, ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్తని మాత్రమే.. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు అని అన్నారు...
*మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్చ పట్టణంగా తీర్చి దిద్దాలి.. పారిశుధ్య కార్మికులతో MLA - BLR *
ఈరోజు ఉదయం 5 గంటలకు మిర్యాలగూడ పట్టణంలోని *పారిశుధ్య కార్మికులతో* సమావేశం అయిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.
మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్చ పట్టణంగా తీర్చి దిద్దాలి అంటే మీ పారిశుధ్య కార్మికులే ప్రాధాన్య పాత్ర పోషించాలి ...ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన సెంటర్స్ ఐన *బస్టాండ్, రైతు మార్కెట్, మున్సిపల్ కాంప్లెక్స్, రాజీవ్ చౌక్, డాక్టర్స్ కాలనీ* వంటి ఏరియాలలో ప్రజలు నిత్యం తిరుగుతూ ఉంటారు కావున ఈ ఏరియాలలో చెత్త అనేది ఎవ్వరికీ కనిపించకుండా పరిశుభ్రంగా ఉండాలి.







ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చెత్త వలన దోమలు అధికమై ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది కావున.. ప్రతిఒక్క కార్మికుడు ఒక బాధ్యత గా పనిచేయండి మీకు ప్రతీ విషయంలో నేను తోడుగా ఉంటాను, మీ సమస్యలు ఏమి ఉన్నా పరిష్కారం చేస్తాను.... రాబోయే ఆగస్టు 15 తేది మన 78వ స్వాతంత్ర దినోత్సవం వరకు మిర్యాలగూడ పట్టణంలో చెత్త అనేది లేకుండా చేయాలి అని అన్నారు..
*తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు పంపిణీ*
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్‌టాప్‌లు అందించా లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిం చారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ల్యాప్‌టాప్‌లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
*సీనియర్ జర్నలిస్ట్ ఎలక సైదులు గౌడ్ చిత్రపటానికి నివాళులు*
తెలంగాణ కాంగ్రేస్ సేవదళ్ సూర్యపేట్ జిల్లా మహిళా అద్యక్షురాలు కేతిరెడ్డి శకుంతాల రెడ్డి
*మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు గారి జూన్- 28- 1921 **103 వ జయంతి వేడుకలు :
ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారు మాట్లాడుతూ భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి, కుంటు పడుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశ లౌకిక విధానమునకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగింది.
1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి నరసింహ రావు గారు రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం పీ. వి నరసింహారావు గారి ఘనకార్యం.








ఈ మహానుభావుడిని స్మరించుకుంటూ ఈరోజు ఉదయం అనగా 28 జూన్ 2024 నాడు ఉదయం 9 గంటల 30 నిమిషములకు నక్లెక్స్ రోడ్డు నందు పివి నరసింహారావు ఘాట్ నందు ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్లో పుష్పాంజలి ఘటిస్తూ రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఎం సద్గుణ రావు, మధు, సి హెచ్ మురళీధర్, అష్రఫ్ అలీ, ప్రకాష్, మనోజ్ సింగ్, తెలంగాణ ప్రదేష్ కాంగ్రేస్ సేవదళ్ సూర్యపేట్ జిల్లా మహిళా అద్యక్షురాలు కేతిరెడ్డి శకుంతల రెడ్డి పాల్గొని పీవీ నరసింహారావు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.