కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవలపై ఆర్బీఐ ఆంక్షలు..

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవలపై ఆర్బీఐ ఆంక్షలు.. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవల్లో లోపాలు గుర్తించిన ఆర్బీఐ.. ఆన్‌లైన్‌లో కొత్త ఖాతాలు ఓపెన్‌ చేయొద్దని ఆదేశం.. క్రెడిట్‌ కార్డులు కూడా జారీ చేయొద్దన్న ఆర్బీఐ.

లోక్సభ ఎలక్షన్ల తర్వాత..పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం

పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం

పంచాయతీ ఎన్నికలు..

 ఈసీ కీలక నిర్ణయం

తెలంగాణలో లోక్ సభ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. మే 15లోగా బ్యాలెట్ బాక్సులకు సీళ్లు, అడ్రస్ ట్యాగ్ లను ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ను ఆదేశించింది. 

రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగిసింది. ప్రస్తుతం పంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతోంది.

ఐదేళ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు:ఓటు హక్కుపై జస్టిస్ డీవై చంద్రచూడ్

ఐదేళ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు:ఓటు హక్కుపై జస్టిస్ డీవై చంద్రచూడ్

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ప్రజలను కోరారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం 'మై ఓట్ మై వాయిస్' మిషన్‌లో భాగంగా ఓ వీడియోను విడుదల చేసింది..

ఇందులో జస్టిస్ చంద్రచూడ్‌ మాట్లాడుతూ '' ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది. అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత. ఐదు సంతవత్సరాలకు ఒకసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడానికి సాధ్యమవుతుంది కదా. ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతిఒక్కరినీ అభ్యర్థిస్తున్నా. గర్వంగా ఓటు వేద్దాం. నా ఓటు నా వాయిస్‌'' అని అన్నారు..

దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే గొప్ప అవకాశం ప్రజలకు ఉందని అందుకే రాజ్యాంగంలో 'భారత ప్రభుత్వం ప్రజలచే, ప్రజల కొరకు' అని రాసుందని చంద్రచూడ్‌ తెలిపారు. తాను మొదటి సారి ఓటు వేయడానికి చూపిన ఉత్సాహాన్ని, ఓటు వేసినప్పుడు కలిగిన ఆనందాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికలు జూన్ 1వరకు జరగనున్నాయి. ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.

నల్లగొండ భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేనేత సెల్ నూతనంగా కన్వీనర్గా నియామకమైన వర్కల శ్రీనివాస్ మరియు కో కన్వీనర్ గా నియామకమైన కటకం శ్రీధర్

నల్లగొండ భారతీయ జనతా పార్టీ (బిజెపి) చేనేత సెల్ నూతనంగా కన్వీనర్గా నియామకమైన వర్కల శ్రీనివాస్ మరియు కో కన్వీనర్ గా నియామకమైన కటకం శ్రీధర్

నల్గొండ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో యువ రక్తంతో ముందుకు దూసుకుపోతుంది, ఈ సందర్భంగా వారు నల్గొండలో ఇప్పటికే కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చింది. కాగా నూతనంగా భారతీయ జనతా పార్టీ చేనేత సెల్ కన్వీనర్ గా వర్కాల శ్రీనివాస్ మరియు కో కన్వీనర్ గా నల్లగొండ చర్లపల్లి వాసి కటకం శ్రీధర్ని నియమించారు. ఇదివరకు చేనేత సెల్ నల్గొండ విభాగంలో పనిచేసిన మిర్యాల వెంకటేశం ను నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వర్కాల శ్రీనివాస్ మరియు కటకం శ్రీధర్ మాట్లాడుతూ....

తమకు కొత్తగా ఇచ్చిన పదవి పార్టీ కోసం తమపై ఎంతో బాధ్యతను పెంచింది అని, వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం తమ వంతు పాత్ర కచ్చితంగా పోషిస్తామని, తమని ఎన్నుకున్న రాష్ట్ర మరియు జిల్లా బిజెపి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

చేనేత బ‌కాయిల విడుద‌ల హర్ష‌నీయం -బీసీ రాజ్యాధికార స‌మితి అధ్య‌క్షులు దాసు సురేశ్‌

చేనేత బ‌కాయిల విడుద‌ల హర్ష‌నీయం

-బీసీ రాజ్యాధికార స‌మితి అధ్య‌క్షులు దాసు సురేశ్‌

చేనేత కార్మికుల బ‌కాయిల‌కు సంబంధించి మొద‌ట విడుత‌గా 50 కోట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డాన్ని బీసీ రాజ్యాధికార స‌మితి స్వాగ‌తించింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేర‌కు బీసీ రాజ్యాధికార స‌మితి అధ్య‌క్షులు దాసు సురేష్ ఓ ప్ర‌క‌ట‌న‌లో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. స‌మ‌గ్ర శిక్షా అభియాన్ యూనిఫామ్‌ల త‌యారీకి 47 కోట్ల అడ్వాన్సుతో పాటు నూలు కొనుగోలు, సైజింగ్ కు మ‌రో 14 కోట్లు విడుద‌ల చేయ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఉత్ప‌త్తి చేసిన బ‌తుక‌మ్మ చీర‌కు సంబంధించి మొత్తం 351 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయ‌న్నారు. మిగ‌తా బ‌కాయిల‌ను కూడా త్వ‌ర‌లో విడుద‌ల చేసి చేనేత కార్మికుల‌ను ఆదుకోవాల‌ని దాసు సురేష్ కోరారు. సిరిసిల్ల చేనేత ప‌రిశ్ర‌మ స్వ‌యం అభివృద్ది చెంద‌కుండా గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం బ‌తుక‌మ్మ చీర‌ల‌కే ప‌రిమితం చేసింద‌ని విమ‌ర్శించారు. ఇపుడు కేటీఆర్ మొస‌లిక‌న్నీరు కారుస్తున్నార‌ని మండిప‌డ్డారు. సిరిసిల్ల చేనేత ప‌రిశ్ర‌మ‌ పూర్వ వైభ‌వం సాధించేలా ప్ర‌భుత్వం చ‌ర్య లు తీసుకోవాల‌ని కోరారు.

జ్యోతిబాపూలే 150 అడుగుల విగ్ర‌హాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి-బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ ‌

జ్యోతిబాపూలే 150 అడుగుల విగ్ర‌హాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి-దాసు సురేశ్ , అధ్యక్షులు - బీసీ రాజ్యాధికార సమితి ‌

సంఘ సంస్క‌ర్త‌, వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఆశాకిర‌ణం మ‌హాత్మా జ్యోతిబా పూలే 150 అడుగుల విగ్ర‌హాన్ని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బీసీ రాజ్యాధికార స‌మితి అధ్య‌క్షులు దాసు సురేష్ డిమాండ్ చేశారు. జ్యోతిబా పూలే 198వ జ‌యంతిని బాగ్ లింగంప‌ల్లిలోని బీసీ రాజ్యాధికార స‌మితి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. జ్యోతిబా పూలే ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. తదనంతరం అంబర్పెపేట్ లోని జ్యోతిభాఫూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. భవిష్యత్ బీసీలదేనని నినదించారు ..తదనంతరం మీడియాతో మాట్లాడుతూ బ‌డుగుల ఉన్న‌తికి జ్యోతిబా పూలే చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. 

నెక్లెస్ రోడ్ లో అంబేద్క‌ర్ భారీ విగ్ర‌హం త‌ర‌హాలోనే జ్యోతిబాపూలేకు కూడా 150 అడుగుల విగ్ర‌హన్ని ఏర్పాటు చేయాల‌ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.. చారిత్రక అంశాలతో కూడిన ఫూలే స్మృతివనాన్ని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేయాలన్నారు ఇదే ప్రాంగణంలో జ్యోతిబా పూలే పేరిట బీసీ నాలెడ్జ్ పార్క్ ను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల‌తో నిధని ఏర్పాటు చేసి ప్ర‌తి ఏటా జ్యోతిబా పూలే పేరిట సంఘ సంస్కర్తలకు అవార్డులు ప్రధానం చేయాలని దాసు సురేష్ సూచించారు. భార‌త అత్యున్న‌త పౌర పుర‌స్కారం భార‌త ర‌త్న‌ను జ్యోతిబా పూలేకు ఇవ్వాల‌ని, పూలే జ‌యంతిని జాతీయ సెల‌వుదినంగా ప్ర‌క‌టించాల‌ని కేంద్ర ప్రభుత్వానికి దాసు సురేష్ డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ రాజ్యాధికార స‌మితి పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ ఛైర్మ‌న్ తుల‌సి శ్రీమాన్‌, మీడియా క‌న్వీన‌ర్ మారేప‌ల్లి ల‌క్ష్మ‌ణ్ సిటీ కమిటీ సభ్యులు ప్యారసాని దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: మునుగోడు రోడ్డు ఈద్గా దగ్గర ప్రార్థనలకు విచ్చేసిన మైనార్టీ సోదరులకు మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి నీటిని పంపిణీ చేసిన శివ కుమార్

నల్గొండ జిల్లా మునుగోడు రోడ్డు ఈద్గా నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీరు పంపిణీ చేయడం జరిగింది.ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది హిందూ ముస్లిం అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో కలిసి ఉండాలని ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మంచినీటి కేంద్రాన్ని ప్రారంభించి 1 టౌన్ సీఐ సత్యనారాయణ గారు శాంతియుత సంఘం అధ్యక్షులు ఆఫీస్ ఖాన్ సిఎస్టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి కనగల్ ఎస్సై రామకృష్ణ వారు మాట్లాడుతూ వేసవికాలంలో మంచినీటి కేన్ద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషనియమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్వకేట్ మస్యుద్దీన్ నజీరుద్దీన్ ఏర్పుల కామేశ్వర్

 సంఘ నాయకులు సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ నియోజకవర్గ ఇన్చార్జ్ పగడాల శివతేజ కట్టెల మహేష్ 

స్టీరింగ్ కమిటీ నాయకులు చిత్రం శ్రీనివాస్ భాష పాక దుర్గయ్య

 జిల్లా కమిటీ సభ్యులు గంట సుమంత్ రమేష్ అనిల్ నాయక్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ నరేందర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్ జ్యోతిరావు పూలే జయంతి వేడుక ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్ జ్యోతిరావు పూలే జయంతి వేడుక ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి

గొప్ప మార్గదర్శి, సంఘసంస్కర్త, సామాజికవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ,త్యాగశీలి అయిన 

మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతిని

 నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో బీసీ సంక్షేమ ఉద్యోగ యువజన మహిళ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో

 ఘనంగా  నిర్వహించి  నివాళులు అర్పించడం అయినది

 ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి,

 బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు  దుడుకు లక్ష్మీనారాయణ,

 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ లు మాట్లాడుతూ

 1827 ఏప్రిల్ 11వ తేదీ న మహారాష్ట్రలోని సతారా గ్రామంలో జన్మించిన జ్యోతిబాపూలే ఆనాటి సమాజంలో ఉన్న అసమానతులకు, వివక్షతలకు, విద్వేషాలకు, అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడని

 సమాజం నుండి వీటిని రూపుమాపాలంటే తొలగించాలంటే ప్రజలను విజ్ఞానవంతులు చేయడమే పరిష్కారమని భావించి 

 స్త్రీల కోసం అనేక పాఠశాల నెలకొల్పి వారిని విజ్ఞానవంతులు చేసిన గొప్ప విజ్ఞానవంతుడని

 ముందుగా తన భార్య అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలే కు చదువు నేర్పించి 

తద్వారా సమాజంలోని మహిళలకు చదువునందించిన గొప్ప మార్గదర్శి అని

 అదే విధంగా వివక్షతకు, విద్వేషాలకు వ్యతిరేకంగా అనేకమైన గ్రంథాలను రాసి ప్రచురించిన గొప్ప తత్వవేత్త అని

 వారు కొనియాడుతూ మనందరికీ వారు ఆదర్శనీయుడని పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్ ,బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, సమాచార సమితి అంజయ్య ,

బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ కార్యదర్శులు అక్కినపల్లి లక్ష్మయ్య ,నల్లబోతు శ్రీనివాస్ యాదవ్, నల్పరాజు వెంకటేశ్వర్లు మరియు బెల్లి నాగరాజు యాదవ్ , చల్ల కోటేష్ యాదవ్, నోముల క్రాంతి కుమార్ యాదవ్, కంభంపాటి కనకయ్య,k. కృష్ణయ్య దూదిగామ స్వామి, బక్కతట్ల వెంకన్న యాదవ్, ఖమ్మంపాటి శంకర్ దుర్గ ,వళ్ళ కీర్తి శ్రీనివాస్, సదానంద్, రుద్ర వెంకటాచారి, కూరెళ్ళ రవీంద్ర చారి ,కర్నాటి ధనుంజయ, పులిపాటి వెంకటయ్య , పున్న వీరేశం తదితరులు పాల్గొన్నారు.

బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో నల్గొండ 35వ వార్డులో బిజెపి టిఫిన్ బైటెక్ కార్యక్రమం,బిజెపి జండా ఆవిష్కరణ..

బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో నల్గొండ 35వ వార్డులో బిజెపి టిఫిన్ బైటెక్ కార్యక్రమం,బిజెపి జండా ఆవిష్కరణ..

భారతీయ జనతా పార్టీ అల్పాహార సమావేశం( టిఫిన్ బైటెక్ )అనంతరం.భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 35వ వార్డులో బీజెపీ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం గారి ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు VHP జిల్లా గౌరవ అధ్యక్షులు కర్నా టి యాదగిరి గారు.శ్యామల తారక్. సురెపల్లి వెంకటేశ్వర్లు. పున్న రామేశ్వర్ .మూడ సైదులు.పొట్టబత్తుల శ్రీను.కైరంకొండ చంద్రశేఖర్.చెరుకు శివశంకర్. గంజి శ్యాంసుందర్ .జువ్వాజి సోమయ్య. తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేయడం జరిగింది.

ఎం ఈ ఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా బాబు జగ్జీవన్ జయంతి వేడుక నిర్వహణ..

నల్గొండ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఉత్సవాలను ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాట్లాడుతూ..

బాబు జగ్జీవన్ రామ్ ఆయన గొప్ప నేత మాజీ ఉప ప్రధాని సుదీర్ఘ కాలం పాటు పేద నిమ్న వర్గాల ప్రజల కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలియజేస్తూ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పాటు పడతామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లపాక వెంకన్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బుర్ర సుధాకర్ సంఘ నాయకులు ఆది మల్ల మనిరాజు రమణ భార్గవ్ నగేష్ కత్తుల మహేష్ షణ్ముఖ కట్టెల మహేష్ కుమార్ మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ శ్రీకాంత్ నరేష్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.