NLG: సిపిఎం అభ్యర్థిని పార్లమెంటుకు పంపించాలి: ఎన్నికల ప్రచారం లో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య
మర్రిగూడెం మండలం, ఇందుర్తి గ్రామంలో, ప్రజా ఉద్యమ నాయకుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎం.డి జహంగీర్ ను గెలిపించాలని, సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలను కలిసి సిపిఎం అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలలో ముందున్న సిపిఎం అభ్యర్థిని పార్లమెంటుకు పంపించాలని ఓటర్లను కోరారు.
ఈ దేశాన్ని 10 సంవత్సరాలుగా ఏలుతున్న బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని, ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రవేట్ పరం చేస్తూ నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెంచి పోషించిందని, ప్రజలపై పెనుభారం మోపుతుందని ఆరోపించారు. ఈ బిజెపి ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించాలని, అట్లాగే ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజా నాయకుడు ఎర్రజెండా ను భుజాన ఎత్తుకున్న భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను ఢిల్లీ పార్లమెంట్ కు పంపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పగిళ్ల రామచంద్రం, అయితగోని నరసింహ గౌడ్, అనంతల నరసింహ గౌడ్, శ్రీరామదాసు సుదర్శనమ్మ, చెరుకు గౌరమ్మ, పగిళ్ల కవిత, ఊరి పక్క ఇందిరమ్మ, ఊరి పక్క రాములమ్మ, బోడ సత్తెమ్మ, శ్రీరామదాసు సత్యనారాయణ చారి, అయితగోని సత్తమ్మ, పగిళ్ల మట్టమ్మ, వీరమల్ల నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Apr 12 2024, 19:27