NLG: మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేసిన నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి

నాంపల్లి: మండలంలోని టిపి గౌరారం గ్రామానికి చెందిన కొమ్ము రమణమ్మ, ఇటీవల అనారోగ్య కారణంతో మరణించిన విషయం తెలుసుకున్న, నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి.. శనివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి, మనో దైర్యం కల్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ము బిక్షం, జిల్లా కాంగ్రెస్ నాయకులు శీలం జగన్ మోహన్ రెడ్డి , గేల్వాల్ రెడ్డి, రేవల్లి మాజీ సర్పంచ్ హరిత గోపాల్ రెడ్డి, గణపతి రెడ్డి, సిహెచ్ బిక్షం, కొమ్ము ఈదయ్య, బేకరి గిరి, గ్రామ శాఖ అధ్యక్షులు పి.యాదయ్య, ఈదయ్య, సిహెచ్. రామకృష్ణ, పుల్లయ్య, భూతం రాములు, శ్రీను, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

నాంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాంపల్లి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షులు దాచేపల్లి నర్సింహా ఆధ్వర్యంలో శనివారం, పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా దాచేపల్లి నర్సింహా మాట్లాడుతూ.. ఏప్రిల్ 6,1980 లో ఏర్పడిన పార్టీ ఎందరో కార్యకర్తల, నాయకుల బలిదానాల పునాదులపై నిర్మితమై, ఏకాత్మ మానవతావాదం , అంత్యోదయ ఆలంబనగా క్రమశిక్షణ, అంకుటిత దీక్ష, అంకితభావానికి ప్రతిరూపమై దేశాభివృద్ధి యజ్ఞంలో నిరంతరాయంగా నిమగ్నమై, దేశానికి పూర్వవైభవం తెచ్చి, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడమే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు.

మొదటి సారిగా కేవలం 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన పార్టీ నేడు 300 పైగా ఎంపీ స్థానాల్లో గెలిచి దేశంలో దాదాపు 19 రాష్ట్రంలో అధికారం సాదించుకొని దేశ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నదని అన్నారు. 

రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పోగుల వెంకటరెడ్డి, చిరుమామిళ్ల గిరి, దుదిమెట్ల సత్యం, సింగారం గిరి, బీజేవైఎం అధ్యక్షులు నాంపల్లి సతీష్, వేలాద్రి,సాంభశివ, లక్ష్మయ్య,కోట మల్లేష్, లింగస్వామి, శ్రీధర్ రెడ్డి, శంకర్, శ్రీకాంత్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

తుక్కుగూడ సభకు తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నాంపల్లి: మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదు లోని తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, గజ్జల శివారెడ్డి, గాదెపాక నాగరాజు, గెలవ రెడ్డి, దీప్లా నాయక్, అంగిరేకుల పాండు, దండిగ నరసింహ, బొల్లంపల్లి విష్ణుమూర్తి, నా రోజు సైదాచారి, మేకల యాదయ్య, పానుగంటి వెంకటయ్య, గఫార్, కిరణ్, కంశెట్టి చత్రపతి, ఎరెడ్ల నారాయణరెడ్డి, అబ్బాస్, గాదేపాక యాదయ్య, దోటి పరమేష్, బుష్పాక అరుణ, కలకొండ దుర్గయ్య, రేవల్లి సుధాకర్, కోరే పెద్ద వెంకటయ్య, పులికుంట్ల విజయ్ కుమార్, ఏడుకొండలు, దేవతల్లి యాదగిరి, ఎరుకలి యాదయ్య, ముదిగొండ అంజయ్య, తదితరులు ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిఎంహెచ్ఓ

నల్లగొండ: వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ కొండల్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, రెండు లక్షల పైగా ఓఆర్ఎస్ పాకెట్లు సిద్ధంగా ఉంచామని వారు తెలిపారు. వడదెబ్బకు గురైన వారికి ప్రథమ చికిత్స చేసేందుకు ఆశా వర్కర్ల దగ్గర 50 ప్యాకెట్లు, ఏఎన్ఎం దగ్గర 100 ప్యాకెట్లు, పిహెచ్సి లలో 2000 వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NALGONDA

నాగార్జునసాగర్ లో అడుగంటుతున్న నీటి నిల్వలు

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో రోజు రోజుకు నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శనివారం ఉదయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 511. 50 అడుగులు ఉంది. 312. 00 టిఎంసీల నీటి నిల్వకుగాను 134. 23 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయం నుండి 5, 963 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉండగా, ఇన్ ఫ్లో మాత్రం ఏమీ లేదు.

SB NEWS TELANGANA

SB NEWS NALGONDA

రేపు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

మర్రిగూడ మండలంలో ఆదర్శ పాఠశాలలో 2024 - 25 సంవత్సరానికి గాను ఆరవ తరగతి మరియు 7 నుండి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం, ఈనెల 7వ తేదీన పరీక్ష ఉంటుందని ప్రిన్సిపల్ స్వరూప రాణి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆరవ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుండి 12 గంటల వరకు, ఏడో తరగతి నుండి పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు గా బాధ్యతలు చేపట్టిన రావిరాల కాశమ్మ

నల్లగొండ: పట్టణ కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు గా రావిరాల కాశమ్మ పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమించిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మరియు సహకరించిన నాయకులకి ధన్యవాదాలు అని తెలిపినారు.

నరేంద్ర మోడీ మహిళల శ్రేయస్సు కోరే గొప్ప ప్రధాని అని, అన్ని రంగాలలో మహిళలు ముందు ఉండాలని ఉద్దేశంతో 32% రిజర్వేషన్ కల్పించినారని, మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని రాజకీయ రంగంలో కూడా రాణించాలని సూచించారు.

రాబోయే రోజుల్లో నల్లగొండ జిల్లాలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం చేయడానికి అందరం మమేకమై పార్టీ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ బిజేపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ నివేదిత రెడ్డి , మునగాల సుధారాణి, కూతురు విజయ, కొప్పు జయశ్రీ ,దాసోజు అరుణ, కొండేటి భవాని, మద్ది, ప్రసన్న కవిత, బద్రమ్మ , మధు, శేఖర్, నాయకులు, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

నూతన వధూవరులను ఆశీర్వదించిన నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి

నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన గాడుదల బుచ్చయ్య యాదవ్, యాదమ్మ కుమారుడు రమేష్ యాదవ్- రమాదేవి ల వివాహం కొండమల్లేపల్లి లోని సాయి కృపా ఫంక్షన్ హాల్లో జరగా అట్టి వివాహానికి నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. 

వారి వెంట మాజీ ఎంపిటిసి విష్ణుమూర్తి, రాజ్య తండా మాజీ సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ గిరి వెంకటయ్య,శీను, సిద్దు, యాదయ్య, నగేష్ తదితరులు ఉన్నారు

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

తుర్కయంజాల్ లో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టియుఎఫ్, మున్సిపాలిటీ అధ్యక్షులు నక్క జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో.. ఈరోజు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా, తుర్కయంజాల్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షులు జెనిగె విష్ణువర్ధన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంతం యాది రెడ్డి, జే విక్రం రెడ్డి, గడ్డం ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

NLG: చిన్న పత్రికల సమస్యలు పరిష్కరించాలి

నల్గొండ: చిన్న పత్రికల సంఘం కార్యాలయంలో, శుక్రవారం స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చిన్న పత్రికలకు నూతన ఎంపానెల్మెంట్, అక్రిడేషన్ కార్డులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వం ఈ సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని చిన్న పత్రికా జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.

తదనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డిని మరియు సహాయ కార్యదర్శి వెన్నమళ్ళ రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు గంగదారి వెంకటేశ్వర్లు, ఏ. మదనాచారి, ఫైనాన్స్ కమిటీ మెంబర్ వి. సుభాష్ రెడ్డి, గ్రీవెన్స్ కమిటీ మెంబర్ సుధీర్ కుమార్ లను స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు పిట్టల రామకృష్ణ, ఉపాధ్యక్షులు దోసపాటి ముత్తయ్య, అన్నేబోయిన మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG