పేదల అభ్యున్నతికి వైసీపీ పెద్ద పీట.. పల్లె నిద్ర కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
పేదల అభ్యున్నతికి వైసీపీ పెద్ద పీట.. పల్లె నిద్ర కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విదంగా పెద్ద పీట వేశారని వీరాంజనేయులు తెలిపారు.
ఎన్నికల ప్రచారం అనంతరం యల్లనూరు మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో ఆరవ రోజు "పల్లెనిద్ర" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కాలనీలో గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. ఇలానే పాలన కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు.
పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసునన్నారు. రానున్న ఎన్నికలలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయుచున్న తనను ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు.
మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచాక తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామంలో బస చేశారు.
Apr 01 2024, 06:40