కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీపీ దాసరి సునీత..

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత గారు.          పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పిల్లలతో ముచ్చటించి పరీక్షల్లో తీసుకోవలసిన మెలకుల గురించి విద్యార్థులతో ఆమె మాట్లాడారు అలాగే 10వ తరగతి విద్యార్థులకు పెన్నులను సరఫరా చేశారు పిల్లలకు వడ్డించే భోజనాలను తనిఖీ చేశారు పిల్లలు ఉపాధ్యాయులు చెప్పే మెలకువలను పాటించి ధైర్యంగా పరీక్షలు రాసి మన జగనన్నకు మంచి పేరు తేవాలని అలాగే పాఠశాలకు మంచిర్యాంకు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నాగవేణి గారు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

కోర్టుకు వాయిదా కోసం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ ఎమ్మెస్ రాజు

గతంలో ధర్నా చేసిన కేసులో భాగంగా అనంతపురం కోర్టుకు వాయిదా కోసం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ ఎమ్మెస్ రాజు గారితో పాటు జిల్లా తెలుగురైతు అధికార ప్రతినిధి నడిందొడ్డి తిప్పన్న,మాజీ ఎంపీటీసీ చండ్రాయుడు, మాజీ ఎంపీటీసీ కుళ్లాయప్ప, సలకం చెరువు శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది*

పంట పొలాల సందర్శన.. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు

పంట పొలాల సందర్శన

జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు బుక్కరాయసముద్రం మండలంలో వడియం పేట గ్రామం నందు బోరు బావులు క్రింద సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాలను సందర్శించారు ప్రస్తుతం పంట కంకి పాలు పోసుకునే దశలో ఉన్నది ప్రస్తుతం పైరు లో కత్తెర పురుగు మరియు ఆకు మాడు తెగులు ఆశించినట్లు వారు  గమనించారు. వీటి నివారణకు నివారణ చర్యలు తెలియజేయడం జరిగినది. కోరాజిన్, రైనాక్సీఫర్ ఎకరాకు 60 మిల్లీల లను 200 లీటర్ల నీటికి కలిపి పైరుపై పిచికారి చేయాలని రైతులకు సలహా సూచనలు ఇవ్వడం జరిగినది.

ఆకు మాడు తెగులు నివారణకు 600 గ్రాములు M- 45 లేదా ప్రోఫీ కొనజోల్ 200 మిల్లీలు 200 లీటర్ల నీటి కలిపి ఎకరానికి పిచికారి చేయవలెను

పొలము చుట్టూ మూడు నాలుగు వరుసలు జొన్న పంటను ఎర పంటగా వేయవలెను 45 రోజుల తర్వాత తీసివేయవలెను అంతర పంటగా అపరాలను సాగు చేయడం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది అని రైతులకు సూచించడం జరిగినది

ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు ఎ డి ఎ శైలజ, వ్యవసాయాధికారి శ్రీనివాసులు ఏఈఓ ప్రసాద్ మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీనివాస్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

మీ ఇంటి బిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి... టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ,

మీ ఇంటి బిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి... టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ,..

నార్పల మండలం బి పప్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశం సభకు ముఖ్య అతిథులుగా టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ,..

రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నారస నాయుడు హాజరయ్యారు

ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరస నాయుడు,బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ..

ఎన్ని కలహాలు,సమస్యలు ఉన్న మనమంతా ఒక్కటే కుటుంబ సభ్యులం..

ఐకమత్యబలంతో ఉంటే మనదే విజయం..

మన విజయానికి జనసేనా పార్టీ బలం కూడా చేకూరింది..

2024 ఎన్నికలల్లో శింగనమల నియోజకవర్గం గెలిచి అధినేత చంద్రబాబు,పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నం..

వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుండి నియోజకవర్గం దాచుకో దోచుకో అనే పరిస్థితికి వచ్చింది

నార్పల మండలం లోని టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా సీనియర్ నాయకులు ఆలం వెంకట నరసనాయుడు,ఆకుల ఆంజనేయులు, రంగా రెడ్డి, జనాసేన నాయకులు సాకే మురళి కృష్ణ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రామాలయం నిర్మాణం కోసం ఆలూరు రమణారెడ్డి గారు 1,65,000 రూ. లు విరాళం..

బుక్కరాయసముద్రం మండలం ఎడావులపర్తి గ్రామంలో రామాలయం నిర్మాణం కోసం ఆలూరు రమణారెడ్డి గారు 1,65,000 రూ. లు విలువ చేసే 500 సిమెంటు బస్తాలను గ్రామ పెద్దల కోరిక మేరకు విరాళం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెద్దిరెడ్డి జయరాం రెడ్డి వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

నారా లోకేష్ ని కలిసిన అనంతపురం జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు

అనంతపురం లో శంఖారావం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసిన అనంతపురం జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు

నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని అనంతపురంలోని పివికేకే కాలేజీలో శంఖారావం సభా ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు..

"ఫ్యాన్" కు ఓటు వేద్దాం... సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

"ఫ్యాన్" కు ఓటు వేద్దాం... సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, పార్లమెంట్ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు తాడిపత్రి రమేష్ రెడ్డి మరియు ప్రభుత్వ విద్యా సలహాదారు అలూరు సాంబశివా రెడ్డి.

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంటికీ, కుల, మత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పథకాలు ఇలానే కొనసాగలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ "ఫ్యాన్" గుర్తు కు ఓటు వేయాలని వీరాంజనేయులు, శంకర్ నారాయణ పిలుపునిచ్చారు.

నార్పల మండలం మద్దలపల్లి, నాయనపల్లి, వెంకటాంపల్లి, గడ్డంనాగేపల్లి, నడిమిదొడ్డి, కేశేపల్లి, కురగానిపల్లి, కర్ణపుడికి, పులసలనూతల, బొందలవాడ, నిలువురాయి, చామలూరు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి వారు పర్యటించారు.

మద్దలపల్లిలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో స్థానికులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ నాయకులను ఇంటింటికీ వెళ్లి పలకరిస్తూ, ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జగనన్న ప్రభుత్వంలో మేలుని వివరించారు. రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

 

◆ బ్రిడ్జి నిర్మాణం కొరకు భూమి పూజ

●శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, మరియు శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యం ఎం. వీరాంజనేయులు.

శింగనమల మండలం సోదనపల్లి- పోతురాజుకాలువ మధ్య ఉన్న మరువవంక దగ్గర హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు వైఎస్సార్సీపీ నాయకులతో కలసి సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు భూమి పూజ చేశారు. 

పి.ఎం.జి.ఎస్.వై.క్రింద దాదాపు రూ.6.32 కోట్లు నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 

రెండు గ్రామాల ప్రజల కష్టాలను గుర్తించి, బ్రిడ్జి నిర్మాణం కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి,ఎంపీ తలారి రంగయ్యకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

జగనన్న పథకాలతో ప్రతి ఇంటిలో చిరునవ్వులు.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.

జగనన్న పథకాలతో ప్రతి ఇంటిలో చిరునవ్వులు..  శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.

రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిలో సంక్షేమ కాంతులు 

వెదజల్లుతున్నాయని వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండలం చక్రాయపేట, పోతురాజుకాలువ గ్రామంలో ఆయన పర్యటించారు.

ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన గురించి ఆరా తీశారు. ప్రజలను పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు మళ్ళీ అందాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోడానికి వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమం కొనసాగాలంటే వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి రావాలన్నారు. 2014 లో చంద్రబాబు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి‌ అమలు చేయకుండా ప్రజలని మోసం చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రక్క రాష్ట్రాల వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలని మోసం చేయటానికి మళ్లీ వస్తున్నారన్నారని వాటిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని ప్రజల ఇంటి వద్దకే అందించారన్నారు. ప్రజల వద్దకే పాలన కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నార్పల మండల కేంద్రం లో నాగిరెడ్డి అనే వ్యక్తి పై కొడవళ్ళతో దాడి..

:అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని వేరుసెనగ మిల్లు వద్ద నాగిరెడ్డి అనే వ్యక్తి పై చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కొడవలితో దాడి..

తీవ్ర రక్తస్రావం కావడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు...