జగనన్న పథకాలతో ప్రతి ఇంటిలో చిరునవ్వులు.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.
జగనన్న పథకాలతో ప్రతి ఇంటిలో చిరునవ్వులు.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు.
రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిలో సంక్షేమ కాంతులు
వెదజల్లుతున్నాయని వీరాంజనేయులు అన్నారు.
శింగనమల మండలం చక్రాయపేట, పోతురాజుకాలువ గ్రామంలో ఆయన పర్యటించారు.
ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన గురించి ఆరా తీశారు. ప్రజలను పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు మళ్ళీ అందాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోడానికి వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమం కొనసాగాలంటే వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి రావాలన్నారు. 2014 లో చంద్రబాబు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలని మోసం చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రక్క రాష్ట్రాల వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలని మోసం చేయటానికి మళ్లీ వస్తున్నారన్నారని వాటిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని ప్రజల ఇంటి వద్దకే అందించారన్నారు. ప్రజల వద్దకే పాలన కొనసాగాలంటే మరోసారి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Mar 12 2024, 07:33