"ఫ్యాన్" కు ఓటు వేద్దాం... సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
"ఫ్యాన్" కు ఓటు వేద్దాం... సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, పార్లమెంట్ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు తాడిపత్రి రమేష్ రెడ్డి మరియు ప్రభుత్వ విద్యా సలహాదారు అలూరు సాంబశివా రెడ్డి.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంటికీ, కుల, మత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పథకాలు ఇలానే కొనసాగలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ "ఫ్యాన్" గుర్తు కు ఓటు వేయాలని వీరాంజనేయులు, శంకర్ నారాయణ పిలుపునిచ్చారు.
నార్పల మండలం మద్దలపల్లి, నాయనపల్లి, వెంకటాంపల్లి, గడ్డంనాగేపల్లి, నడిమిదొడ్డి, కేశేపల్లి, కురగానిపల్లి, కర్ణపుడికి, పులసలనూతల, బొందలవాడ, నిలువురాయి, చామలూరు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి వారు పర్యటించారు.
మద్దలపల్లిలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామాల్లో స్థానికులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ నాయకులను ఇంటింటికీ వెళ్లి పలకరిస్తూ, ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జగనన్న ప్రభుత్వంలో మేలుని వివరించారు. రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
◆ బ్రిడ్జి నిర్మాణం కొరకు భూమి పూజ
●శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, మరియు శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యం ఎం. వీరాంజనేయులు.
శింగనమల మండలం సోదనపల్లి- పోతురాజుకాలువ మధ్య ఉన్న మరువవంక దగ్గర హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు వైఎస్సార్సీపీ నాయకులతో కలసి సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు భూమి పూజ చేశారు.
పి.ఎం.జి.ఎస్.వై.క్రింద దాదాపు రూ.6.32 కోట్లు నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
రెండు గ్రామాల ప్రజల కష్టాలను గుర్తించి, బ్రిడ్జి నిర్మాణం కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి,ఎంపీ తలారి రంగయ్యకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
Mar 12 2024, 07:45