ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

 

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్యకు గురైంది.

హైదరాబాద్ కు చెందిన చైతన్య,చెత్త కుప్పలో విగతజీవిగా కనిపించింది. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన జరిగింది.

ఆమె భర్త అశోక్ ఇటీవల హైదరాబాద్ రావడంతో మిర్కావేలోని పాయింట్ కుక్లోని తన అపార్ట్మెంట్ లో ఉంటోంది.

దీంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ మిరియాల వెంకటేశ్వర్లు

బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ మిరియాల వెంకటేశ్వర్లు

నల్లగొండ నియోజకవర్గం బిజెపిలో చిన్న కార్యకర్తగా మొదలైన మిరియాల వెంకటేశ్వర్లు ప్రస్థానం నేడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యే వరకు చేరింది. చివరిసారి జరిగిన నల్లగొండ మున్సిపాలిటీ ఎలక్షన్లో తన 35 వార్డులో ప్రతిపక్షాల తాకిడి ఎంతో ఉన్నప్పటికీ 35 వార్డులో బిజెపి పార్టీని గెలిపించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు నియామకం కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు పార్టీని గెలుపు దిశగా తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలియజేశారు.

పేద పద్మశ్రీలను ఆదరించండి- ముఖ్యమంత్రికి దాసు సురేష్ విజ్ఞప్తి

పేద పద్మశ్రీలను ఆదరించండి- ముఖ్యమంత్రికి దాసు సురేష్ విజ్ఞప్తి 

పేదవర్గాల నుండి వికసించిన పద్మశ్రీ గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం 50 వేల రూపాయల పెన్షన్ 

,రాష్ట్రమంతా ఉచితంగా పర్యటించే ఆర్టీసీ రవాణా సౌకర్యంతో బాటు 10 లక్షల రూపాయల విలువైన హెల్త్ కార్డులను ఇచ్చి అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ సవినయంగా కోరారు.. ఇటీవల తెలంగాణ నుండి ఎంపికైన పద్మశ్రీలకు 25 లక్షల రూపాయల నగదు పారితోషకం మరియు 25 వేల రూపాయల పెన్షన్ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి తన మానవత్వాన్ని చాటడాన్ని తెలుగు సమాజం అంతా హర్షిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు..తెలంగాణ ఏర్పడిన నాటినుండి నేటివరకు పద్మశ్రీ గా ఎంపికైన 28 మంది పద్మశ్రీలకు పెన్షన్ మరియు ఇతర సౌకర్యాలను కల్పించి కళాకారులకు,సామాజిక కార్యకర్తలకు, స్వచ్ఛందసేవా కార్యక్రమ నివాహకులకు ముఖ్యమంత్రి ప్రేరణగా నిలవాలన్నారు..పద్మశ్రీగా ఎన్నికైన వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వే ప్రయాణంలో ఫస్ట్ క్లాస్ ప్రయాణాన్ని ఉచితంగా కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ అంశంపై ముఖ్యమంత్రి సత్వరమే సానుకూలంగా స్పందించి పద్మశ్రీలకు అండగా నిలవాలన్నారు .

నవీన్ కుమార్ రెడ్డికి బీ-ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

నవీన్ కుమార్ రెడ్డికి బీ-ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షాద్ నగర్ కు చెందిన నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డికి బీ-ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. నవీన్ కుమార్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఒప్పందం

ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఒప్పందం 

హైదరాబాద్:మార్చి 09

ప్రముఖ టాటా గ్రూప్ కంపె నీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల స్కిల్లింగ్ సెంటర్లు ఏర్పాటుకు టాటా కంపెనీ, ప్రభుత్వానికి మధ్య ఈరోజు అగ్రిమెంట్ కుదిరింది.

ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ మేరకు రాష్ట్రంలోని ప్రభు త్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నా లజీస్ లిమిటెడ్ కంపె నీ అప్ గ్రేడ్ చేయనుంది.

ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ కింద 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంత రాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సుల నిర్వహణను టాటా టెక్నా లజీస్ అందిచనుంది.

2024-25 విద్యాసంవత్స రం నుంచే ఈ ప్రాజెక్టు అమ లుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొ న్నారు. ఈ భేటీలోనే టాటా కంపెనీకి ప్రభుత్వానికి మధ్య కుదిరింది...

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రేవంత్ సర్కారు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి  ప్రకటించిన రేవంత్ సర్కారు 

హైదరాబాద్ మార్చి 09 

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఇటీవల హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023- 24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కా రాలు అందజేశారు.

అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారా నికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

హామీ ఇచ్చిన రెండ్రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టు కోవడంతో ఆర్టీసీ ఉద్యోగు లకు హర్షం వ్యక్తం చేస్తున్నారు...

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు

కరీంనగర్ - బి. వినోద్ కుమార్

పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్

ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు

మహబూబాబాద్ - మాలోత్ కవిత

గత రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం సమష్టి నిర్ణయం ప్రకారం నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు..

హైదరాబాద్‌: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ..

హైదరాబాద్‌: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పోలీస్ ఉన్నతాధికారులు.

రాజకీయాల పట్ల ఆసక్తి లేదు- ప్రముఖ సినీ హీరో సుమన్

రాజకీయాల పట్ల ఆసక్తి లేదు

- ప్రముఖ సినీ హీరో సుమన్

ప్రస్తుత రాజకీయాల పట్ల తనకు ఏలాంటి ఆసక్తి లేదని ప్రముఖ సినీ హీరో సుమన్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని కరాటే ప్రోగ్రాములో పాల్గొని తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యలో సూర్యాపేటలోని రాజు గారి తోట కు విచ్చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా సుమన్ యువసేన అధ్యక్షులు గుండా వెంకన్న ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా విలేకరులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయమై అడగగా తాను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడ నుండి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పోటీపై వస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని ఆయన చెప్పారు. ప్రస్తుతం కళామతల్లి సేవలోనే తరిస్తానని తెలిపారు. రాజకీయాల్లో చేరాలని ఆసక్తి కలిగినప్పుడు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమన్ యువసేన సభ్యులు కర్నాటి రంగయ్య, గోపారపు రాజు, బొల్లం సురేష్, గుడిపాటి రమేష్, బోనగిరి విజయకుమార్, బచ్చు పురుషోత్తం* తదితరులు పాల్గొన్నారు.

లేబర్ అధికారుల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి,పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలి

లేబర్ అధికారుల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

 పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలి

   దండంపల్లి సత్తయ్య

   నూతన ప్రభుత్వం కార్మిక శాఖను సమీక్షించి లేబర్ అధికారుల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు 

       ఆదివారం సుందరయ్య భవన్లో తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సత్తయ్య మాట్లాడుతూ శాఖలో నూతన నియామకాలు లేక కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో విచారణ చేసి క్లెయిమ్స్ విడుదల కాక వందలాది దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ ,కుటుంబ సభ్యుల చేర్పింపు, ప్రసూతి ,వివాహ కానుకలు కార్మికులకు అందజేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం నివారించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న భవన నిర్మాణ ముడి సరుకుల ధరల వలన పనులు కోల్పోతున్న రోజువారి అడ్డా కూలీలను సంక్షేమ బోర్డు ద్వారా నమోదు చేసుకొని సగం కూలి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

     *తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) పట్టణ అధ్యక్షుడు సలివోలు సైదాచారి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు బై రోజు ఆంజనేయులు, కోశాధికారి కావునపల్లి సురేష్, సహాయ కార్యదర్శి గడగోజు సైదాచారి, ప్రచార కార్యదర్శి గడగోజు శ్రీనివాసచారి, సభ్యులు విశ్వనాధుల ఈశ్వర చారి, రత్నాచారి ,మదనాచారి, భాస్కరాచారి, పోలోజు రవి, విశ్వనాధుల శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.