స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
*నల్గొండ. స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత*
నల్గొండ జిల్లా:-
నల్గొండ జిల్లా గుండ్లపల్లి గ్రామానికి చెందిన శంకర్ ఇటీవల మృతి చెందాడు. ఈసందర్బంగా నల్గొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2012-15 బ్యాచి కి చెందిన శంకర్ స్నేహితులు గురువారం గుడ్లపల్లి గ్రామం లోని శంకర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయన్ని అందజేశారు. కలిసి చదువుకున్న స్నేహితులు ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.
చిట్యాల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల పట్టణాన్ని ఆదర్శ  పట్టణంగా తీర్చిదిద్దుతా

పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లా :-
నకిరేకల్ నియోజకవర్గం.
చిట్యాల మున్సిపాలిటీ 04వ వార్డు పరిధిలోని సిరి వెంచర్ నుండి NH-65 వరకు 25. 00 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్ర్టోం వాటర్ డ్రెన్ నిర్మాణం పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  గురువారం నాడు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. చిట్యాల మున్సిపాలిటి ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా  అని అయన అన్నారు.పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. నకిరేకల్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. చిట్యాల మున్సిపాలిటి ని ఆదర్శ  మున్సిపాలిటి జాబితాలో చేర్చేందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు.పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.. . ఈ కార్యక్రమంలో మున్సిపాలిటి చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి,కౌన్సిలర్లు,మండల నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు..
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల(జేఎన్‌జే) హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డితో జేఎన్‌జే ప్రతినిధులు చర్చించి ఒక రోడ్‌మ్యాప్‌తో తన దగ్గరకు వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఏ సంస్థకు నామినేటెడ్‌ ఛైర్మన్‌ నియమించకుండా కేవలం మీడియా అకాడమీకే శ్రీనివాస్‌రెడ్డిని ఛైర్మన్‌గా నియమించామంటే తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్టమవుతోందని అన్నారు. శుక్రవారం సాయంత్రం జేఎన్‌జేలో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ మీడియాకు చెందిన ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
జేఎన్‌జేకు కేటాయించిన ఇళ్ల స్థలాల అప్పగింత ప్రక్రియ వంద రోజుల్లోగా మొదలుపెడతానన్న హామీని అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీకి 16 ఏళ్ల కిందట కాంగ్రెస్‌ ప్రభుత్వమే నిజాంపేట, పేట్‌బషీరాబాద్‌లో 70 ఎకరాల స్థలాన్ని జేఎన్‌జేకు కేటాయించిందని ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సొసైటీకి స్థలాన్ని అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా గత ప్రభుత్వంలో ఈ తీర్పు అమలుకాలేదన్నారు. ఇప్పటి వరకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చామని వారు వివరించారు.  ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో అర్హులైన మిగిలిన జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇచ్చే విషయంలో మీడియా అకాడమీతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తే వారికి కూడా స్థలాలను ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యభద్రతా కార్డులతోపాటు ఇతర సమస్యలపైనా దృష్టిసారించామని తెలిపారు. సమావేశంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలకు అనుగుణంగా స్థలాల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ లో మార్చి 15 నుండి ఒక్క పూట బడులు*
*తెలంగాణ లో మార్చి 15 నుండి ఒక్క పూట బడులు* తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండడంతో తెలంగాణలో హాఫ్ డే స్కూళ్లను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒక్క పూట తరగతులు నిర్వహించాలని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒక పూట భోజనం పెట్టాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనానని అందించనున్నారు. అయితే 10వ తరగతి కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
లక్ష్యoసాధన దిశగా విద్యార్థులు ఏర్పరుచుకోవాలి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
లక్ష్యoసాధన దిశగా విద్యార్థులు ఏర్పరుచుకోవాలి నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం నల్గొండ జిల్లా :-
విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకుని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  అన్నారు. నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో లో కృష్ణవేణి హై స్కూల్ వారికోత్సవ వేడుకలు శనివారం నాడు కోలాహలంగా జరిగాయి. విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు, అనంతరం ఎమ్మెల్యే ని సన్మానించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ :- విధ్యార్ధిని, విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు 30 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్న యశ్వంత్, నర్సిరెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదములు.మా ప్రాంతంలో ఈ పాఠశాల పెట్టి తల్లిదండ్రులు చనిపోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న వారికి అభినందనలు

విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించడానికి వార్తలు, పేపర్లు చదవడం ద్వారా జ్ఞానవంతులు అవుతారు

మార్కులు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి వారి క్రమశిక్షణ నే రేపటి భవిష్యత్తుకు బంగారు బాసటగా నిలుస్తుంది.. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3 నుంచి పోలియో చుక్కలు*
*తెలంగాణ వ్యాప్తంగా మార్చి 3 నుంచి పోలియో చుక్కలు*
*రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3 నుంచి ఫల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం కానున్నది. వరుసగా మూడు రోజుల పాటు మార్చి 5 వరకు స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగనున్నాయి*
*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ సెంటర్లు, గ్రామ పంచాయితీ కార్యాలయాలు, సర్కారీ స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ డ్రాప్స్ వేయనున్నారు* *రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి పైగా పోలియో డ్రాప్స్ వేయనున్నట్లు అంచనా. అయితే వైద్యారోగ్యశాఖ పల్స్ పోలియో ప్రిపరేషన్‌పై ఇప్పటి వరకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం టీమ్ లకు సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేదని తెలుస్తోన్నది. ఇక ఫిబ్రవరి 29న 1532 మంది జన్మించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. లీప్ ఇయర్ డే న పుట్టినందున ఆయా పిల్లలకు నాలుగేళ్లకోసారి బర్త్ డే రానున్నది*
అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*
*అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం* అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు

రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ నిధుల విడుదల రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
దుద్దిల్ల శ్రీపాదరావు  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కట్టంగూర్ ఎంపీపీ
దుద్దిల్ల శ్రీపాదరావు  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కట్టంగూర్ ఎంపీపీ నల్గొండ జిల్లా:-
కట్టంగూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఉదయం శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు మాజీ స్పీకర్  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు  జల్లా ముత్తిలింగయ్య ఎంపీపీ  మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మందని నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది  ప్రజలకు అనేక సేవలు అందించారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి శ్రీపాద రావు  స్పీకర్ గా తన బాధితులు సక్రమంగా నిర్వహించి శాసనసభ వన్నెతెచ్చినటువంటి మహానుభావుడు శ్రీపాద రావు  వారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్ణయించడానికి ప్రభుత్వం స్వీకారం చుటడం సంతోషకరమని వారి వేడుకల్ని చేయడం చాలా సంతోషమని అని అన్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు  రాష్ట్ర ఐటీ మంత్రి కొనసాగుతూ మందని నియోజకవర్గం నాటి నుండి నేటి వరకు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తూ రాష్ట్ర దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సాధించుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సూపర్డెంట్ చలపతి, ఏపీఓ రామ్మోహన్,కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
రేపే నకిరేకల్ లో మెగా జాబ్ మేళా

రేపే నకిరేకల్ లో మెగా జాబ్ మేళా

నియెజకవర్గ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలి

నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.

.

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహయ సహకారంతో రేపు అనగా 25 /02/2024 (ఆదివారం) రోజున మెగా జాబ్ మేళా ను నకిరేకల్ పట్టణంలోని హైస్కూల్ నందు నిర్వహిస్తుండగా శనివారం నాడు ఎమ్మెల్యే వేముల వీరేశం ఏర్పాటు పరిశిలించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని సుమారుగా యువతి, యువకులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు .. కావున రేపు అభ్యర్థులు వచ్చేటప్పుడు తమ ద్రువప్రతాలు తామ వెంట తెచ్చుకోగలరు. ఉదయం 9.00 గంటలకు ప్రారంభం కావడం జరుగుతుంది. సుమారుగా 60 పైచిలుకు కంపెనీలు ఇందులో పాల్గొంటాయి..కావున నియోజకవర్గ నిరుద్యోగ, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని మనవి..

.

ముగింపు దశకు చేరుకున్న మేడారం జాతర
ముగింపు దశకు చేరుకున్న మేడారం జాతర

ములుగు జిల్లా:-

వనదేవతలు ఈరోజు రాత్రి వనప్రవేశం చేయనున్నారు.

ఈ వనప్రవేశంతో జాతర ముగియనున్నది.

సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు.

పూజల తర్వాత వనదేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభం కానుంది.

అనంతరం సమ్మక్క తల్లి చిలకలగుట్టకు, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లనున్నారు.

చివరి రోజు కూడా భక్తుల రద్దీ భారీగా ఉంది.
. . . .