పోలీస్ కళాబృందం చే ప్రజలకు అవగాహన కల్పించే కనువిప్పు కార్యక్రమం ‌




[ Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(దౌల్తాబాద్ - 15 ఫిబ్రవరి):- పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 15-02-2024 రాత్రి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని " దొమ్మాట గ్రామంలో నిర్వహించారు. మూఢనమ్మకాలు,మంత్రాలు తంత్రాలు, సామాజిక రుక్మతల గురించి రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, హెల్మెట్ వినియోగం, ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో తొగుట సీఐ.లతీఫ్, దౌల్తాబాద్ ఎస్ఐ. శ్రీరామ్, ప్రేమ్ దీప్, పాల్గొన్నారు.ఈ సందర్భంగా తొగుట సిఐ లతీఫ్, మాట్లాడుతూ మూఢనమ్మకాలు నమ్మవద్దు,సైబర్ నేరాలపట్ల ప్రమాదంగా ఉండాలి. మోటార్ సైకిల్ వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. మెజీషియన్ నరేష్ మూఢనమ్మకాలపై అద్భుతంగా మెజీషియన్ చేసి ప్రజల యొక్క అనుమానాలను పటాపంచలు చేశారు. ఈ టెక్నాలజీ ప్రపంచంలో భానుమతి వాళ్లు చేశారు వీళ్ళు చేశారు అంటే నమ్మవద్దు ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రిలో చూపించుకోవాలన్నారు. చిన్నచిన్న తగాదాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు *సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి* *గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* జిల్లాలో చిన్న పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగులు వచ్చినాయని సోషల్ మీడియాలో పుకార్లు, షికార్లు చేస్తున్నారు, అలాంటి వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలోప్రవేశించలేదని,గ్రామాలలో పట్టణాలలో ఎవరైనాఅనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సంఘవిద్రోహశక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా బ్యాంకు వివరాలు ఏటీఎం కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు.వాట్సప్ కు మరియు ఫోన్ కు ఎలాంటి మెసేజ్ వచ్చిన ఓపెన్ చేయవద్దు స్పందించవద్దు. పోలీస్ కళా బృందం, తెలంగాణ సాంస్కృతిక సారథి సిద్దిపేట రూరల్ టీమ్ కళాకారులతో "కనువిప్పు "అనే కార్యక్రమం ద్వారా మూఢనమ్మకాల పై మరియు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు గురించి, పేకాట ఆడుట వలన కుటుంబలో జరుగుతున్నపరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలు గురించి, ఈమధ్య జరుగుతున్న ఆత్మహత్యలు గురించి, మరియు వృద్ధులైన తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ , షీ టీమ్స్ జరుగుతున్న సైబర్ నేరాల గురించి పాటల ద్వారా, సిడిల ద్వారా కళాబృందం సభ్యులు బాలు, రాజు, రవీందర్, తిరుమల, వెంకటాపురం రవి, రవీందర్, ఎల్లయ్య, తిరుమలయ్య, భార్గవి పాటల రూపంలో మరియు నాటకం రూపంలో ప్రజలను చైతన్య పరిచినారు. చిన్నచిన్న ఆస్తి తగాదాలకు పోయిప్రాణాలుతీసుకోవద్దని ఆలోచించకుండా క్షణికావేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తాయని ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, పరిష్కారం కానిసమయంలో పోలీస్ స్టేషన్ కు రావాలని ఇరువర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.మనిషి కక్షలు కారుణ్యాలతో ఏ పని చేయవద్దని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధం. టోల్ ఫ్రీ నెంబర్లు 1930, కాల్ చేయాలని సూచించారు. ప్రజలు ఎవరైనా తమ సెల్ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు CEIR పోర్టల్ (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ద్వారా అట్టినెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందని, దాని గురించి తెలియని వారు మీ సేవ కేంద్రంలో లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలు అప్లోడ్ చేసుకోవాలని సూచించారు కావున ప్రజలు ఈ CEIR అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యం ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాడి కౌశిక్ రెడ్డి జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో- మార్క అనిల్ గౌడ్ - బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి

మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి పిచ్చికూతలు కూస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు - మార్క అనిల్ గౌడ్ [ Crime journalist ]

సిద్దిపేట జిల్లా:
(హుస్నాబాద్ నియోజకవర్గం):- మతి గతి తప్పి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్సీగా హుజురాబాద్ నియోజకవర్గంలో నువ్వు అనుసరించిన పద్ధతి నువ్వు మాట్లాడిన మాటలకు ప్రజలు నీ గురించి ఏం మాట్లాడుకున్నారో అందరికీ తెలుసు.విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై 39 మంది ఎంపీలకు కన్వీనర్ గా వ్యవహరించి నేడు హుస్నాబాద్ నుంచి గెలుపొంది తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ప్రజా పాలన అందిస్తున్న పొన్నం ప్రభాకర్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. హుజురాబాద్ శాసనసభ ఎన్నికలలో నీ కుటుంబాన్ని అడ్డుపెట్టుకొనిగెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను మానసికంగా ఇబ్బంది పెట్టావు. దయగల ఓటర్లు ఎక్కడ ఈ పిచ్చోడు చచ్చిపోతాడు అని ఓట్లు వేసి గెలిపించారు. ఆ ఓట్లు వేసిన వాళ్లలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గం బీసీలదే. అలాంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకున్ని వారి సతీమణిని కలుపుతూ ఊహాజనితంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశావు. బీసీల ఓట్లతో గెలిచిన నువ్వు బీసీ నాయకత్వాన్ని విమర్శించటం సిగ్గుచేటు. దయచేసి మన బీసీ సామాజిక వర్గ ప్రజలు ఇలాంటి వాళ్లకు చట్టసభకు వెళ్లే అవకాశం ఇవ్వకండి. ఇవాళ మన ఓట్లతో గెలిచి మన బీసీ ప్రజా ప్రతినిధిని నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న ఇతని అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారి గురించి వారి సతీమణి గురించి తప్పుగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి వెంటనే వారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు.
అపరిచిత వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి-మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్



జయశంకర్ భూపాలపల్లి జిల్లా: [  Crime journalist. ]


(మొగుళ్ళపల్లి14-పిబ్రవరి ):- మండల పరిధిలోని ప్రజలు ఎన్నికల పట్ల ప్రమాదంగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. బుధవారం అయినా విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. దొంగతనాలు, పసి పిల్లల అపహరణ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాత నిరసనపై నిఘా పెంచామని తెలిపారు. అనుమానితులను నూతన టెక్నాలజీ సాఫ్ట్వేర్ సహాయంతో తనిఖీ చేస్తున్నామని, పగలు మరియు రాత్రి సమయాల్లో మాతృతంగా పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి సహకరించాలని సూచించారు.
మొట్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్*

బ్యాంక్ సేవలను వినియోగించుకోండి - బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ [  Crime journalist ]


తెలంగాణ మండలంలోని మొట్లపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు 432వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ వై శోభ, ప్రభుదాస్, రీజనల్ మేనేజర్ వేమూరి సాయి కృష్ణ, సీనియర్ మేనేజర్ రాజు విచ్చేయుచున్నారని బ్యాంక్ మేనేజర్ దిలీప్ కుమార్ తెలిపారు. గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు, మహిళా సంఘాలు బ్యాంకు సేవలనువినియోగించుకోవాలని, రైతులకు క్రాఫ్ లోన్స్ మరియు హౌసింగ్ లోన్స్ ఇస్తామని, వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తామని, గురువారం ఏర్పాటు చేయబోయే బ్యాంక్ ప్రారంభోత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు తరలి రావాలని, అందరూ ఆహ్వానితులేనని, బ్యాంక్ లో జీరో అకౌంట్ ఖాతాలు తీసుకోవచ్చన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో గండ్ర జ్యోతికి ఆత్మీయ సన్మానం*



*-శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొడారి రమేష్ యాదవ్*

ఆంధ్రప్రదేశ్:

[ Crime journalist ]


(తిరుపతి 14-పిబ్రవరి ):- భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో కలకాలం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ..బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దైవసంకల్పంతో భూపాలపల్లి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్లి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం అక్కడికి వెళ్లిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ గండ్ర జ్యోతిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముడుపు రవీందర్, నాయకులు గాజుల శ్రీనివాస్, పసరగొండ లక్ష్మయ్య, పసరగొండ స్వామి, ఇండిగ నర్సింగారావు, గాజుల శంకరయ్య, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి - గజ్వేల్ సీఐ. సైదా


రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణం ఇందిరాపార్క్ వద్ద గజ్వేల్ సిఐ.సైదా,వాహనదారులకు,ప్రజలకు,వ్యాపారస్తులకు, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు మరియు ఇందిరా పార్క్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ సైదా, మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం మరియు చట్ట ప్రకారం నేరం, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు.

సిద్దిపేట జిల్లా:

[Crime journalist]


(గజ్వేల్ 14- ఫిబ్రవరి):- రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు హెల్మెట్, సీటు బెల్టు తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేసిక్షేమంగాగమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కారు నడిపేటప్పుడు సీటు బెల్టుధరించాలనిసూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి సంవత్సరం భద్రత వారోత్సవాలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసుకోవాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దని తెలిపారు. జరిమానా ఫైన్లు వేయడం మా అభిమతం కాదని ప్రమాదాల నివారణ గురించి రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మాత్రమే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రొ.ముంద్రా ఆదినారాయణ - జోహార్

[Crime journalist ]

నిష్క్రమించిన విజ్ఞాన శిఖరం.

(హైదరాబాద్):- ప్రశ్న ఎంత చిన్నదైనా, జటిలమైనా, అది రసాయన చర్య వేగమా, క్వాంటం సిద్ధాంతమా లేక మూఢ నమ్మకాల గుట్టు విప్పే ప్రకృతి రహస్యమైనా ఆయన సమాధానం ‘వెరీ సింపుల్‌’ అనే మాట ఆయన నోటి నుండి వచ్చేది. ఆ మాటే వినే వారిలో కొండంత విశ్వాసాన్ని నింపేది. జవాబు ఎంత సింపుల్‌గా ఇస్తారో అంతకంటే సింపుల్‌గా ఉండే మనిషి వారే ప్రొఫెసర్‌ ఆదినారాయణ. మూడు దశాబ్దాలకు పైగా క్లిష్టతరం అనుకునే రసాయన శాస్త్రాన్ని యూనివర్సిటీలో బోధించిన ప్రొఫెసర్‌ అంటే నమ్మలేం. తానొక ప్రొఫెసర్‌నన్న స్పృహగాని, అత్యంత ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ జర్మనీలో ఏండ్ల పాటు పరిశోధనలు చేశానన్న గర్వంగాని, డిఎన్‌ఏ రిపేరు వంటి ఆధునిక విషయాలను శోధిస్తున్నానన్న దర్పంగాని ఏ కోశానా కనిపించేవి కావు. నిన్న మొన్ననే నల్లగొండ జిల్లా నల్లబండగూడెం నుండి వచ్చిన రైతు బిడ్డలా నలుగురితో కలిసిపోతారు. దశాబ్దాలుగా తెలుగులో రసాయనశాస్త్ర పాఠ్య గ్రంథాల రచయిత, సంపాదకులుగాను, ప్రయోగాలు చేస్తూ పిల్లలకు సైన్సును బోధించాలనే ఆలోచనల కనుగుణంగా కొత్త పుస్తకాలు తేవటంలో ప్రొ.ఆది నారాయణ చేసిన కృషికి నేడు రెండు తెలుగు రాష్ట్రాల సైన్సు పుస్తకాలే సాక్ష్యం. ఎన్ని కొత్త పద్ధతులు, పుస్తకాలు ప్రవేశ పెట్టినా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకపోతే ఫలితం శూన్యమని నమ్మిన వారు ఆది నారాయణ . అందుకోసం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరగతి గది బోధనకు తోడ్పడే ప్రయోగ దీపికలను తెచ్చిన వారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయులను సమాయత్తం చేయడానికి వారం రోజుల శిక్షణా కార్యక్రమాలు దాదాపు వంద వరకు నిర్వహించడంలో కీలకపాత్ర ఆయనది. రంప చోడవరం నుండి ఇచ్చోడ వరకు ఆదివాసీ ఆశ్రమ పాఠశాల పిల్లలకు బాలోత్సవాలు నిర్వహించి, వారిలో వైజ్ఞానిక స్పృహను నింపిన నిజమైన ప్రజా సైన్సు ఉద్యమకారుడు. పిల్లలు ఎక్కడున్నా, ఎక్కడకు రమ్మన్నా ఆనందంగా అడుగులు వేసిన పసిమనస్కులు ఆయన. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా నిబ్బరంగా ఎదుర్కొని ముందుకు నడిచిన ధీశాలి. నమ్మిన దానికోసం, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్దతతో ముందుకు సాగటం ఆయన నైజం. సైన్సు ఉద్యమంలో తనతో నడిచిన మిత్రులపై, శిష్యులపై చెరగని ముద్ర వేసిన ఆయనే మన ప్రొ. ఆది నారాయణ. ఉపాధ్యాయ శిక్షణా తరగతులకు హాజరైన విశాఖ, విజయనగరం, మిత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాన్నొకదాన్ని ఇక్కడ గుర్తు చేయకుండా ఉండలేము. ‘ఎప్పుడో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆయన శిష్యులు గుర్రం బగ్గీలో స్వయంగా లాగుతూ స్టేషన్‌కు తీసుకు పోయారని విన్నాం. ఈ రోజు అంతటి గురువును కళ్లారా చూశాం’ అని చెప్పటం మా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. బోర్డుమీద రాసేందుకు కుడి చేయి లేవకుంటే రెండో చేత్తో పట్టి లేపి పాఠం చెప్పిన గొప్ప గురువు. చెకుముకి అంటే ఆయనకు ప్రాణం. ఆయన ప్రయోగాలతో ‘క్విజ్‌’కు వన్నె తెచ్చారు. అదే చెకుముకి సంబరాలు, భువనగిరి వేదిక, రోజంతా పిల్లలతో చిరునవ్వులు చిందించిన ప్రొ.ఆదినారాయణ, ఇక సెలవంటూ నిష్క్రమించారు. తాను ప్రేమించిన పనిలో పాల్గొంటూ తనువు చాలించిన ప్రొ.ఆది నారాయణ ధన్యజీవి.

 వి. కృష్ణ మోహన్ 

నేషనల్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) 

కార్యదర్శి, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా) నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సి.సి.పి.ఏ) అనుబంధం 9182189533, 9440668281 హైదరాబాద్

KCR: ఆరు నూరైన తెలంగాణకు అన్యాయం జరగనివ్వను


[ Streetbuzz News Crime journalist]

(నల్గొండ 13-పిబ్రవరి):- ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని భారాస అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘కాలు విరిగినా కట్టె పట్టుకొని నల్గొండకు వచ్చా. ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ సభ, పోరాట సభ.  ఫ్లోరైడ్‌ వల్ల నల్గొండ ప్రజల నడుములు వొంగిపోయాయి. ఆ నాడు బాధితులను దిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధానికి చూపించాం. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదు. 24 ఏళ్లుగా పక్షిలాగా తిరిగి రాష్ట్రం మొత్తం చెప్పాను. తెరాస ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్‌ సమస్య పోయింది. ఇప్పుడు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్‌ రహిత జిల్లాగా మారింది. పోరాటం చేసి.. రాష్ట్రం తెచ్చి పదేళ్లు పాలించా. నా పాలనలో ఎవరికీ తక్కువ చేయలేదు. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారు. నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే.. ఎక్కడివరకైనా  పోరాడవచ్చు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపాయే అని అప్పట్లో నేనే పాట రాశా. బస్వాపూర్‌ ప్రాజెక్టు పూర్తయ్యింది, దిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు. ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాలు కేటాయించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగాం. ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రైబ్యునల్‌ ముందు పోరాడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా.. పిల్లి మాదిరిగా ఉండను.  *కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆట బొమ్మ కాదు..* కేసీఆర్‌ను తిరగనివ్వమంటున్నారు.. అంత మొనగాళ్లా? మీకు దమ్ముంటే మాకంటే గొప్పగా పాలించి చూపించండి. మేడిగడ్డకు వెళ్లి ఏం చేశారు.. అసెంబ్లీ అయ్యాక మేమూ వెళ్తాం. ఇప్పుడు కూడా ప్రాణహితలో 5వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దమ్ముంటే.. ప్రాణహితలో నీటిని ఎత్తిపోయాలి. కేసీఆర్‌ను బద్నాం చేయాలని .. పొలాలు ఎండబెడతారా? కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆటబొమ్మకాదు. ప్రాజెక్టులో 200 కి.మీ సొరంగాలు, 1500 కి.మీ కాల్వలు ఉంటాయి. రెండు మూడు పిల్లర్లు కుంగిపోయాయన్నది వాస్తవమే. ఎన్నిసార్లు ఇలా పిల్లర్లు కుంగిపోలేదు.. సాగర్‌లో కుంగలేదా? రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటారా.. ఎన్ని గుండెలు మీకు. మంత్రులకు అంత కండకావరమా.. కళ్లు నెత్తికెక్కాయా? పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి. రైతు చెప్పుతో కొడితే మూడు పళ్లు రాలిపోతాయి. మీకు చేతకాకపోతే.. చేతకాదని చెప్పాలి’’ అని కేసీఆర్‌ అన్నారు. భారాస నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కేశవరావు తదితరులు సభలో పాల్గొన్నారు. కొన్ని నెలల విరామం తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కేసీఆర్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
నేను సైతం అనే కార్యక్రమం లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు

రిమ్మనగూడ గ్రామపంచాయతీ పక్కన ఉన్న గల్లీలో నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు

[ Streetbuzz News Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ నియోజకవర్గం 13పిబ్రవరి) :- రిమ్మనగూడ గ్రామంలో గ్రామపంచాయతీ పక్క గల్లిలో గత కొన్ని రోజుల క్రితం ఒక దొంగతనం జరిగింది అట్టి విషయంలో గజ్వేల్ సిఐ సైదా గ్రామాన్ని సందర్శించి కాలనీ రక్షణ గురించి నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గల్లి వాసులకు తెలపగా గల్లీలో ఉన్న పెద్దలు అందరూ కలిసి నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం రోజు వాటిని గజ్వేల్ సీఐ సైదా ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ సైదా మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గల్లీ పెద్దలను అభినందించి.సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సిసి కెమెరాలు ఉన్న గ్రామాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని తెలిపినారు. గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు. మరియు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో కలసి గ్రామంలో పోలీస్ శాఖ తరపున ఏమైనా రక్షణ అవసరాలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా వెంటనే తెలపాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు బెల్ట్ షాపులు, గుట్కాలు, ఎవరైనా అమ్మితే మరియు గ్రామంలో పేకాట ఆడితే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ బి. సైదా .

గజ్వేల్ లో రక్తదాన శిబిరం లో పాల్గొని రక్త దానం చేసిన ఏసిపి రమేష్

ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం

[ Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా :

(గజ్వేల్):- గజ్వేల్ పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ లో మంగళవారం ఆపన్న హస్త మిత్రబృందం ఆధ్వర్యంలో రక్త దాన శిభిరం ఏర్పాటు చేశారు ఈ రక్త దానం శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఏసిపి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు అలాగే ఏసిపి రమేష్ నేను సైతం అంటూ రక్త దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పన్న హస్త మిత్రబృందం సేవలు అభినందనీయమని వినూత్న సేవా కార్యక్రమాలలో మంచి గుర్తింపు తెచ్చుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఆపన్న ఆస్తమిత్ర బృందం సేవలు మరింత విస్తృతం చేయాలని ఈ రోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నాకు కూడా రక్తదానం చేయడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని రక్త దానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు .ఈ కార్యక్రమంలో ఆపన్న ఆస్త మిత్ర బృందం మరియు నాయకులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.